iDreamPost
android-app
ios-app

Indian 2 Update: కమల హాసన్ ఇండియన్-2 నుంచి క్రేజి అప్ డేట్.. ఏంటంటే !

  • Published Jun 22, 2024 | 10:34 AM Updated Updated Jun 22, 2024 | 10:34 AM

ఇండియన్ 2 సినిమా మీద ప్రేక్షకులు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వచ్చేసింది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఇండియన్ 2 సినిమా మీద ప్రేక్షకులు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వచ్చేసింది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Jun 22, 2024 | 10:34 AMUpdated Jun 22, 2024 | 10:34 AM
Indian 2 Update: కమల హాసన్ ఇండియన్-2 నుంచి  క్రేజి అప్ డేట్..  ఏంటంటే !

ఇప్పుడు సిక్వెల్ సినిమా ట్రెండ్ బాగా నడుస్తున్న సంగతి తెలిసిందే. పైగా ఇలాంటి సినిమాలు ఏ రేంజ్ లో హిట్ టాక్ ను సంపాదించుకుంటున్నాయో కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు తమిళ స్టార్ డైరెక్టర్ తీస్తున్న పాన్ ఇండియా మూవీ ఇండియా మూవీ ఇండియన్ 2. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయినా కూడా.. అనేక కారణాల వలన ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు మేకర్స్. ఈ సినిమాను జులై12 న ప్రేక్షకుల ముందుకు తీసురానున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన మరొక లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది. మరి ఆ అప్ డేట్ ఏంటో చూసేద్దాం.

ఇండియన్ 2 సినిమాను తెలుగుతో పాటు.. తమిళం , హిందీ భాషల్లోనూ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. అడపా దడపా ఈ సినిమాకు సంబందించిన ఎదో ఒక అప్ డేట్ వస్తూనే ఉంది. ఈ సినిమాను లేక ప్రొడక్షన్స్, రెడ్ జాయింట్ మూవీస్ బ్యానర్ పైన ఉదయ నిధి స్టాలిన్, సుభాస్కరన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అలా ఈ సినిమాలో కమల్ హాసన్ తో పాటు.. సిద్దార్ద్, కాజల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్, ఎస్.జె. సూర్య, బాబీ సింహ, సముద్రఖని లాంటి ఎంతో మంది నటి నటులు ప్రధాన పాత్రలలో నటించనున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ తో బిజీ బిజీగా ఉంది.

ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి. విడుదల చేసిన ఫస్ట్ గ్లిమ్ప్స్ , పోస్టర్స్ , కొన్ని సాంగ్స్ , విజువల్స్ ప్రేక్షకులకు.. ఈ సినిమాపై బాగానే అంచనాలు పెంచేశాయి. ఈ సినిమాను జూలై 12 న గ్రాండ్ గా రిలీజ్ ప్లాన్ చేయడంతో.. ఇప్పటినుంచే ఈ సినిమా ప్రమోషన్స్ ను మొదలు పెట్టేశారు. ఈ క్రమంలోనే ఈ సినిమా ట్రైలర్ ను ఈ నెల 25 న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ముంబై లో ఓ భారీ ఈవెంట్ ను నిర్వహించి ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారట మూవీ టీమ్ . ఇక ఈ ట్రైలర్ మొత్తం రెండు నిమిషాల 36 సెకన్లు ఉండబోతుందని సమాచారం. మరి ఈ ట్రైలర్ ప్రేక్షకులలో ఎలాంటి అంచనాలను పెంచేస్తుందో వేచి చూడాలి . మరి ఇండియన్ 2 మూవీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.