iDreamPost
android-app
ios-app

లైకా చేతిలో ప్యాన్ ఇండియా పంచరత్నాలు

  • Published Jan 02, 2023 | 6:15 PM Updated Updated Jan 02, 2023 | 6:15 PM
  • Published Jan 02, 2023 | 6:15 PMUpdated Jan 02, 2023 | 6:15 PM
లైకా చేతిలో ప్యాన్ ఇండియా పంచరత్నాలు

తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ కన్నడలో హోంబాలే ఫిలింస్ తరహాలో తమిళంలో అగ్ర హీరోలతో ప్యాన్ ఇండియా రేంజ్ సినిమాలతో దూసుకుపోతున్న సంస్థ లైకా ప్రొడక్షన్స్. కళ్ళు చెదిరే బడ్జెట్ తో వందల కోట్లను సునాయాసంగా ఖర్చు పెట్టే బ్యానర్ గా దీనికున్న పేరు సుపరిచితమే. శంకర్ రజనీకాంత్ కలయికలో 2.0 నిర్మించినప్పుడు దానికి సంబంధించిన ప్రతి వార్త సెన్సేషన్ గా నిలిచేది. ట్రైలర్ లాంచ్ ఓ మీడియం బడ్జెట్ సినిమాతో సమానంగా డబ్బుని వెదజల్లడం లైకాకే సాధ్యమయ్యింది. వీటి సంగతలా ఉంచితే ఈ ఏడాది లైకా ప్లానింగ్ ఓ రేంజ్ లో సాగుతోంది. క్రేజీ సినిమాలు కాంబినేషన్లతో వేల కోట్ల వ్యాపారమే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో సాగుతోంది.

ముందుగా ‘పొన్నియన్ సెల్వన్ 2’ ఏప్రిల్ 28న రాబోతున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ పార్ట్ తమిళ వెర్షన్ అయిదు వందల కోట్లకు పైగా వసూళ్లతో సంచలనం సృష్టించడం ఇంకా ఫ్రెష్ గానే ఉంది. రెండో భాగం మీద భారీ అంచనాలున్నాయి. మణిరత్నం అసలైన మేజిక్ ఇందులో చూస్తారనే ప్రచారం చెన్నైలో జోరుగా సాగుతోంది. కమల హాసన్ హీరోగా రూపొందుతున్న ‘ఇండియన్ 2’ షూటింగ్ ఆలస్యం జరిగినప్పటికీ ఈ వేసవిలో విడుదల చేసేలా ప్లానింగ్ జరుగుతోంది. 1996లో వచ్చిన బ్లాక్ బస్టర్ కి ఇప్పుడు సీక్వెల్ తీయడం ఒక విశేషమైతే ఫస్ట్ పార్ట్ లో చనిపోయిన కొడుకు స్థానంలో సేనాపతి తండ్రి వస్తాడనే లీక్ ఇంకా షాకింగ్ గా ఉంది

లారెన్స్ తో చేస్తున్న ‘చంద్రముఖి 2’ షూటింగ్ వేగంగా జరుగుతోంది. సూపర్ స్టార్ చేసిన మూవీ కాబట్టి స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని దర్శకులు పి వాసు దీన్ని రూపొందిస్తున్నారు. రజని గెస్ట్ రోల్ ఉంటుందనే టాక్ ఉంది కానీ ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. చెన్నైలో రెండేళ్లకు పైగా ఆడిన సినిమాగా ఇప్పటికీ చంద్రముఖి రికార్డు భద్రంగా ఉంది. సో అంతకు మించి ఉండాల్సిందే. ఇవి కాకుండా రజని కూతురు ఐశ్వర్య డైరెక్షన్ లో మరో స్పోర్ట్స్ డ్రామా ఇటీవలే మొదలుపెట్టారు. ఇందులో మాత్రం తలైవా క్యామియో రోల్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయ్యింది. ఇవన్నీ తెలుగులో డబ్బింగ్ రూపంలో వచ్చేవే. ప్రొడక్షన్ ప్లానింగ్ లో ప్రత్యేకత నిలుపుకుంటున్న లైకా ఇంకొన్ని భారీ ప్రాజెక్టులను త్వరలోనే ప్రకటించనుంది

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş