iDreamPost
android-app
ios-app

‘భారత్’ ప్రభావం.. సినిమా పేర్లపై పడబోతుందా..?

  • Author ajaykrishna Updated - 10:49 AM, Wed - 6 September 23
  • Author ajaykrishna Updated - 10:49 AM, Wed - 6 September 23
‘భారత్’ ప్రభావం.. సినిమా పేర్లపై పడబోతుందా..?

ప్రస్తుతం దేశం పేరును ఇండియా నుండి భారత్ కి మార్చడం పైనే దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. అసలు ఇండియా పేరును ఇంత సడన్ గా మార్చాలి అని ఎందుకు అనుకుంటున్నారో అర్ధం కావడం లేదనేది కొందరి వాదన. కానీ.. దాదాపు ఇండియా నుండి భారత్ కి పేరు మార్చేందుకు దేశ జనాభా నుండి సైతం సానుకూల స్పందన లభిస్తున్నట్లు తెలుస్తోంది. దీని వెనుక ఎన్నో రాజకీయ ప్రణాళికలు జరుగుతున్నాయని.. ప్రతి పక్షాలను దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఇలా చేస్తుందని ఢిల్లీ సీఎం కామెంట్స్ చేశారు. ఓవైపు భారత్ పేరు దేశమంతటా ట్రెండ్ అవుతుండగా.. ఇప్పుడీ పేరు ప్రభావం సినిమాలపై కూడా పడుతుందని వాదనలు వినిపిస్తున్నాయి.

ఇప్పటిదాకా ఇండస్ట్రీలో ఇండియా, ఇండియన్ అనే పదాలను ఉపయోగించి చాలా సినిమాలు తెరపైకి వచ్చాయి. ఇండియా పేరుతో టాలీవుడ్ లో తక్కువ సినిమాలే వచ్చినట్లు తెలుస్తుంది. కానీ.. ఇండియా పేరుతో చాలా బాలీవుడ్.. కోలీవుడ్ తో పాటు ఇతర ఇండస్ట్రీలలో చాలా సినిమాలు తెరకెక్కాయి. అందులో ఒకటి ఇప్పుడు సీక్వెల్ రెడీ అవుతోంది. విశ్వనటుడు కమల్ హాసన్ – శంకర్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఇండియన్'(తెలుగులో భారతీయుడు). దాదాపు ఇరవై ఏళ్ల క్రితమే వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనికి ఇండియన్ 2 సీక్వెల్ చేస్తున్నారు కమల్, శంకర్.

మరి దేశం పేరు ఇండియా నుండి భారత్ కి మార్చుతున్నప్పుడు ఇండియన్ పేరుతో రూపొందుతున్న సినిమాపై ఆ ప్రభావం పడబోతుందా? అనే చర్చ మొదలైంది. ఇండియన్ 2ని, భారతీయుడు 2 గా మార్చుతారా అని ప్రశ్నలు వెలువడుతున్నాయి. కానీ.. ఇండియన్ 2 పేరు ఖచ్చితంగా మార్చాలి అనే చర్చ వస్తే.. శంకర్, కమల్ హాసన్ లు ఎలా రియాక్ట్ అవుతారో అనే ఆసక్తి అందరిలో స్టార్ట్ అయ్యింది. మరోవైపు టాలీవుడ్ హీరో నిఖిల్ కూడా ‘ఇండియా గేట్’ అనే సినిమా రెడీ అవుతోంది. రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు.. ఇప్పుడు వినిపిస్తున్న వాదనల ప్రకారం.. భారతీయ గేట్ అని మార్చుకోవాల్సి ఉంటుంది. మరి ఈ సినిమా పీరియడిక్ స్టోరీతో వస్తోంది కాబట్టి.. ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. మరి ఇండియా ప్లేస్ లో భారత్ పేరు ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet