iDreamPost
android-app
ios-app

Rajinikanth: భారతీయుడు 2పై రజినీకాంత్ కామెంట్స్! మీరు ఊహించలేరు..

  • Published Jul 22, 2024 | 12:15 PM Updated Updated Jul 22, 2024 | 12:15 PM

సూపర్ స్టార్ రజినీకాంత్ తన నెక్ట్స్ రెండు చిత్రాల అప్డేట్స్ తో పాటుగా కమల్ హాసన్-శంకర్ కాంబినేషన్ లో లేటెస్ట్ గా వచ్చిన భారతీయుడు 2 గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

సూపర్ స్టార్ రజినీకాంత్ తన నెక్ట్స్ రెండు చిత్రాల అప్డేట్స్ తో పాటుగా కమల్ హాసన్-శంకర్ కాంబినేషన్ లో లేటెస్ట్ గా వచ్చిన భారతీయుడు 2 గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

  • Published Jul 22, 2024 | 12:15 PMUpdated Jul 22, 2024 | 12:15 PM
Rajinikanth: భారతీయుడు 2పై రజినీకాంత్ కామెంట్స్! మీరు ఊహించలేరు..

సూపర్ స్టార్ రజినీకాంత్ వరుస చిత్రాలతో ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ‘వేట్టయాన్’, ‘కూలి’ మూవీలు చేస్తున్నాడు. టీజే జ్ఞానవేల్ డైరెక్షన్ లో వేట్టయాన్, లోకేశ్ కనగరాజ్ తో కూలి చిత్రాలు రానున్నాయి. ఈ రెండు చిత్రాల అప్డేట్స్ తో పాటుగా కమల్ హాసన్-శంకర్ కాంబినేషన్ లో లేటెస్ట్ గా వచ్చిన భారతీయుడు 2 గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు సూపర్ స్టార్. ఆ వివరాల్లోకి వెళితే..

గత కొంత కాలంగా వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు సూపర్ స్టార్ రజినీకాంత్. ప్రస్తుతం టీజే జ్ఞానవేల్ డైరెక్షన్ లో వేట్టయాన్, లోకేశ్ కనగరాజ్ తో కూలి సినిమాలను థియేటర్లలోకి తెచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాల అప్డేట్, వేట్టయాన్ వాయిదా గురించి తాజాగా మాట్లాడాడు రజినీ. కేరళలో ఓ పెళ్లికి వెళ్లి వస్తుండగా.. విమానాశ్రయంలో మీడియాతో ముచ్చటించాడు. రజినీ మాట్లాడుతూ..

“వేట్టయాన్ రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. ఇక కూలి మూవీ స్పీడ్ గా షూటింగ్ చేసుకుంటోంది. కమల్ హాసన్-శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ఇండియన్ 2 మూవీ చాలా బాగుంది. వేట్టయాన్ లో తన భాగం షూటింగ్ పార్ట్ పూర్తి అయ్యింది” అంటూ చెప్పుకొచ్చాడు సూపర్ స్టార్ రజినీకాంత్. కాగా.. గతంలో వేట్టయాన్ దసరాకు రానున్నట్లు రజినీ చెప్పాడు. అయితే కంగువా నిర్మాత వేట్టయాన్ వాయిదా పడుతుంది కాబట్టి.. కంగువాను దసరాకు విడుదల చేస్తున్నాం అని ప్రకటించాడు. దాంతో వేట్టయాన్ విడుదలపై కన్ఫ్యూజన్ ఏర్పడింది. అయితే ఇండియన్ 2 మూవీ నిరాశపరచగా.. సూపర్ స్టార్ ఏంటి చాలా బాగుందని అంటున్నాడు? అంటూ ఫ్యాన్స్, నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom