iDreamPost
android-app
ios-app

పెళ్లి అయ్యాక ఇంకాస్త గ్లామర్ పెంచేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?

  • Published Jun 07, 2024 | 6:28 PM Updated Updated Jun 08, 2024 | 2:56 PM

పెళ్లైన హీరోలు.. అందమైన భామలతో డ్యాన్సులు చేయొచ్చు.. లిప్ లాక్ సన్నివేశాల్లో నటించొచ్చు కానీ.. హీరోయిన్లకు పెళ్లైతే మాత్రం ఇక కెరీర్ కు మంగళం పాడేయాల్సిందే. కానీ అందుకు కొంత మంది హీరోయిన్లు మినహాయింపుగా మారారు. అందులో ఒకరే ఈ భామ.

పెళ్లైన హీరోలు.. అందమైన భామలతో డ్యాన్సులు చేయొచ్చు.. లిప్ లాక్ సన్నివేశాల్లో నటించొచ్చు కానీ.. హీరోయిన్లకు పెళ్లైతే మాత్రం ఇక కెరీర్ కు మంగళం పాడేయాల్సిందే. కానీ అందుకు కొంత మంది హీరోయిన్లు మినహాయింపుగా మారారు. అందులో ఒకరే ఈ భామ.

  • Published Jun 07, 2024 | 6:28 PMUpdated Jun 08, 2024 | 2:56 PM
పెళ్లి అయ్యాక ఇంకాస్త గ్లామర్ పెంచేసిన  ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?

ఒకప్పుడు హీరోయిన్లు పెళ్లైతే.. కెరీర్ క్లోజ్ అయిపోయినట్లే. అప్పటి వరకు ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసి.. పూర్తిగా ఫ్యామిలీ లైఫ్‌లోకి వెళ్లిపోయేవారు. ఇక సగటు ఇల్లాలిగా మారిపోయేవారు. తాళి బొట్టు మెడలో పడిన హీరోయిన్లకు అవకాశాలు ఇచ్చేందుకు వెనకా ముందు ఆలోచించేవారు దర్శక నిర్మాతలు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీ తీరు మారింది. పెళ్లైతే మూవీస్ పక్కన పెట్టాలన్న నిబంధనలను చెరిపేసి కొంత మంది బ్యూటీలు తమ హవాను కొనసాగిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. మునుపటి కంటే మరింత అందంగా.. గ్లామరస్ పాత్రలో దూసుకెళుతున్నారు. సక్సెస్ అందుకుంటున్నారు. భర్తలు సైతం భార్యామణులకు సపోర్టుగా నిలుస్తుండటం విశేషం. ఇదిగో ఆ కోవలోకి వస్తుంది ఈ బ్యూటీ.

పెళ్లైతే.. సినిమాలు మానేయాలని ఏ రాజ్యాంగంలో రాసి ఉంది అని ప్రశ్నిస్తుంది. వరుస ఆఫర్లతో కిరాక్ పుట్టిస్తుంది. అంతే కాదు రెండు పడవల ప్రయాణాన్ని చేస్తుంది అమ్మడు. ఇటు మూవీస్ చేస్తూ బిజీబిజీగా గడుపుతూనే.. అటు వ్యాపార రంగంలోనూ సత్తా చాటుతుంది. ఇంతకు ఆమె ఎవరంటే.. రకుల్ ప్రీత్ సింగ్. కెరటం మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి ఉవ్వెత్తున ఎగసిపడిన అందాన్ని తొలుత రిసీవ్ చేసుకోలేదు ప్రేక్షకులు. ప్రార్థన.. ప్రతి రూపాయి కౌంటింగ్ ఇక్కడ అనగానే.. ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ చేసేశారు. అంతే వరుస పెట్టి తెలుగులో ఛాన్సులు కొల్లగొట్టింది. స్టార్ హీరోల సరసన ఆడిపాడే ఛాన్స్ కొట్టేసింది. మహేష్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, నాగార్జున, అల్లు అర్జున్ వంటి ఏ గ్రేడ్ హీరోలతో యాక్ట్ చేసింది.

రఫ్, లౌక్యం, కరెంట్ తీగ, పండగ చేస్కో, కిక్ 2, బ్రూస్ లీ, నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధ్రువ, విన్నర్, రారండోయ్ వేడుక చూద్దాం, జయ జానకి నాయక, స్పైడర్ వరకు ఆమె పరంపర కొనసాగింది. తెలుగు ఇండస్ట్రీలో అనతి కాలంలో కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంది. అదే సమయంలో బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టింది. జిమ్ సెంటర్స్ ఏర్పాటు చేసింది. ఆ తర్వాత తమిళ్, హిందీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మన్మధుడు 2, చెక్, కొండపొలం సినిమా తర్వాత హిందీ చిత్రాలకే పరిమితమైంది ఈ బ్యూటీ.  బూ అనే బైలింగ్వల్ మూవీతో పలకరించింది. ఈ ఏడాది కొత్త జీవితంలోకి ఎంట్రీ ఇచ్చింది రకుల్. నటుడు, చిత్ర నిర్మాత జాకీ భగ్నానీని వివాహం చేసుకుంది. పెళ్లైన తర్వాత మరింత గ్లామరస్ పాత్రల్లో మెరుస్తోంది. హైదరాబాద్‌లో ఆరంభం అనే స్టార్ హోటల్ ప్రారంభించింది. ఇప్పుడు మరింత జోష్‌తో బుల్లెట్ కన్నా వేగంగా దూసుకెళుతుంది. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు సినిమాలున్నాయి. ఇండియన్ 2తో పాటు రెండు హిందీ చిత్రాలను చేస్తుంది.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetavrupabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet