ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్ కప్‌కు టైమ్ దగ్గర పడుతోంది. అక్టోబర్ 5వ తేదీన ఈ మెగా టోర్నీ మొదలుకానుంది. దీంతో ఈసారి ఏ జట్టు కప్ గెలుస్తుందా అని ప్రెడిక్షన్స్ షురూ అయ్యాయి. ఫలానా టీమ్ నెగ్గుతుందని కొందరు అంటుంటే.. కాదు ఫలానా టీమే కప్ ఎగరేసుకుపోతుందంటూ రకరకాల అంచనాలు వస్తున్నాయి. ఈ విషయంపై తాజాగా ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ స్పందించాడు. వచ్చే వరల్డ్ కప్‌లో ఏయే టీమ్స్ ముందంజ వేస్తాయో ఆయన అంచనా […]
నాలుగేళ్ల కింద జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ టీమ్ రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ టీర్నీలో సెమీస్‌లో భారత్‌పై గెలిచి ఫైనల్‌కు చేరుకున్న కివీస్ జట్టు కప్‌ను మాత్రం కైవసం చేసుకోలేకపోయింది. బెన్ స్టోక్స్ సంచలన ఇన్నింగ్స్ కారణంగా వరల్డ్ కప్‌ను తృటిలో చేజార్చుకుంది. అయితే ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కప్‌ను కొట్టి ఛాంపియన్‌గా నిలవాలని న్యూజిలాండ్ పట్టుదలతో ఉంది. కానీ పరిస్థితులు మాత్రం ఆ జట్టుకు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. కీలక ఆటగాళ్లు […]
‘క్యాచెస్ విన్ మ్యాచెస్’ అని క్రికెట్‌లో ఒక నానుడి ఉంది. ఇది బాగా పాపులర్. జెంటిల్మన్ గేమ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌కు ఎంత ప్రాముఖ్యత ఉందో ఫీల్డింగ్‌కు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. ఒక్క క్యాచ్ లేదా ఒక్క రనౌట్‌తో మ్యాచ్ స్వరూపమే మారిపోతుందని అనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో కీలక సమయంలో భారత బ్యాట్స్‌మన్ ఎంఎస్ ధోని రనౌట్ అయ్యాడు. ఒకవేళ ధోని ఔట్ కాకపోయుంటే ఆ మ్యాచ్‌లో […]
ఆటర్.. ఈ జీవి గురించి అందరికీ పెద్దగా తెలియకపోవచ్చు. జంతువులకు సంబంధించిన ఛానళ్లు చూసే వారికి దీనిపై ఓ ఐడియా ఉంటుంది. ఈ జీవులు నీటిలోనూ.. నేలపైనా జీవిస్తాయి. నీటిలోని చేపల్ని ఇతర చిన్న చిన్న జీవుల్ని వేటాడి చంపి తింటూ ఉంటాయి. ఇవి నీటిలో చాలా వేగంగా వేటాడగలవు. అంతేకాదు! ఇవి కొన్ని కొన్ని సార్లు మనుషులపై కూడా దాడులు చేస్తూ ఉంటాయి. తాజాగా, ఓ ఆటర్ కారణంగా ఓ హోటల్‌కు ఏకంగా కోటి రూపాయల […]
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఏ అగ్రశ్రేణి జట్టులోకి ఎంట్రీ ఇవ్వాలన్న.. పాతికేళ్ల వయసు రాకముందే ఇవ్వాలి. మూడు పదుల వయసు వచ్చిందంటే.. ఎంత టాలెంట్ ఉన్నా జాతీయ జట్టులో చోటు దక్కుతుందనే ఆశలు వదులుకోవాలి. ఎందుకంటే ఆ రేంజ్‌లో పోటీ ఉంటుంది. వయసు పైబడుతున్న ఆటగాళ్లను ఎంపిక చేసేందుకు సెలెక్టర్లు పెద్దగా ఆసక్తి చూపించరు. కానీ.. చరిత్ర ఎప్పుడూ కనీవిని ఎరుగని రీతిలో 61 ఏళ్ల వయసులో ఓ క్రికెటర్ ఇంగ్లండ్ జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. […]
అంతర్జాతీయ క్రికెట్‌కు ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ అలెక్స్ హేల్స్ రిటైర్మెంట్ ప్రకటించాడు. 34 ఏళ్లు హేల్స్ ఇంగ్లండ్ తరఫున దాదాపు 12 ఏళ్ల పాటు ఆడాడు. 2011లో టీమిండియాపైనే తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడి.. క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ టీమ్‌లో కీ ప్లేయర్‌గా మారాడు. అలాగే 2022లో ఇంగ్లండ్ గెలిచిన టీ20 వరల్డ్ కప్ టీమ్‌లో హేల్స్ సభ్యుడు. ఓపెనర్‌గా టీమ్ మంచి ఆరంభాలు ఇచ్చి.. రెండో సారి టీ20 వరల్డ్ […]
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2023-2025 సైకిల్ ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన యాషెస్ సిరీస్ తో ప్రారంభం అయ్యింది. ఇప్పటికే భారత్-వెస్టిండీస్, పాకిస్థాన్-శ్రీలంక మధ్య టెస్టు సిరీస్ లు జరిగాయి. ఈ మూడు సిరీస్ ల తర్వాత WTC పాయింట్ల పట్టికలో పాకిస్థాన్ అగ్రస్థానంలో ఉంది. రెండో స్థానంలో టీమిండియా కొనసాగుతోంది. ఇక యాషెస్ సిరీస్ ను 2-2తో సమం కావడంతో.. ఇంగ్లాండ్, ఆసీస్ జట్లకు సమానంగా పాయింట్లు లభించాయి. ఈ నేపథ్యంలోనే ఐసీసీ ఇంగ్లాండ్-ఆసీస్ జట్లకు […]
ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్ కప్‌కు సమయం దగ్గర పడుతోంది. ఈసారి మెగా టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. 50 ఓవర్ల ఫార్మాట్లో బహుశా ఇదే చివరి వరల్డ్ కప్ అనే ఊహాగానాలు క్రికెట్ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. దీంతో ఐసీసీ నిర్వహించే ఈ టోర్నీపై మరింత ఆసక్తి నెలకొంది. ఈసారి ఎవరు కప్‌ను నెగ్గుతారోనని అందరూ ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్నారు. టీమిండియా మాత్రం 2011 సీన్‌ను రిపీట్ చేయాలని చూస్తోంది. ఆ ఏడాది కూడా […]
యాషెస్ సిరీస్ అందరూ ఊహించినట్లే చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతోంది. రెండు హేమాహేమీ జట్ల మధ్య మ్యాచ్‌లు చాలా ఉత్కంఠగా సాగుతూ ప్రేక్షకులను మునివేళ్లపై నిల్చోబెడుతున్నాయి. వరల్డ్ టెస్ట్ సిరీస్ ఫైనల్లో టీమిండియాను ఓడించి మాంచి ఊపు మీదున్న కంగారూ టీమ్.. యాషెస్ సిరీస్‌లో అదే జోరును కొనసాగించింది. బూడిద కప్ కోసం జరుగుతున్న ఈ సిరీస్ తొలి టెస్టులో ఆసీస్ అదరగొట్టింది. ఆ టీమ్ కెప్టెన్ ప్యాట్ కమిన్సన్ ఆల్‌రౌండ్ పెర్ఫార్మెన్స్తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. బజ్‌బాల్ […]
ప్రపంచ క్రికెట్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక రకంగా క్రికెట్‌ను ఒక ప్రొఫెషనల్ గేమ్ నుంచి వినోదం అందించే ఇవెంట్‌గా మార్చేసింది. క్రికెటర్లపై కాసుల వర్షం కురిపిస్తూ.. వ్యాపారులకు కోట్ల ఆదాయం తెచ్చిపెడుతూ.. బీసీసీఐకి బంగారు బాతుగా అవతరించింది. ఐపీఎల్ గ్రాండ్ సక్సెస్ చూసి.. ప్రపంచ వ్యాప్తంగా చాలా లీగులు పుట్టుకొచ్చాయి. కానీ, ఏదీ ఐపీఎల్ క్రేజ్‌ను కొట్టేయలేకపోయాయి. అందుకు ప్రధాన కారణం.. ఇండియన్ క్రికెటర్లు ఐపీఎల్‌లో […]