iDreamPost
android-app
ios-app

తమ్ముడు మూవీలో రీఎంట్రీ గురించి లయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

  • Published Jun 26, 2025 | 3:22 PM Updated Updated Jun 26, 2025 | 3:24 PM

Laya : "తమ్ముడు" సినిమా జూలై 4న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ హైలైట్స్ తో పాటు ఝాన్సీ కిరణ్మయి క్యారెక్టర్ లో నటించిన తన ఎక్సిపీరియన్స్ తెలిపారు నటి లయ. ఈ చిత్రంతో టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు నటి లయ.

Laya : "తమ్ముడు" సినిమా జూలై 4న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ హైలైట్స్ తో పాటు ఝాన్సీ కిరణ్మయి క్యారెక్టర్ లో నటించిన తన ఎక్సిపీరియన్స్ తెలిపారు నటి లయ. ఈ చిత్రంతో టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు నటి లయ.

  • Published Jun 26, 2025 | 3:22 PMUpdated Jun 26, 2025 | 3:24 PM
తమ్ముడు మూవీలో  రీఎంట్రీ గురించి లయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

“సంక్రాంతికి వస్తున్నాం” బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో వస్తున్న మరో సూపర్ హిట్ మూవీ “తమ్ముడు”. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంతో టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు నటి లయ. “తమ్ముడు” సినిమా జూలై 4న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ హైలైట్స్ తో పాటు ఝాన్సీ కిరణ్మయి క్యారెక్టర్ లో నటించిన తన ఎక్సిపీరియన్స్ తెలిపారు నటి లయ.

“నేను 2023 ఫిబ్రవరిలో ఇండియాకు వచ్చాను. ఇక్కడ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ కు ఇంటర్వ్యూస్ ఇచ్చాను. ఆ ఇంటర్వ్యూస్ చూసి జూన్ లో “తమ్ముడు” మూవీ టీమ్ నుంచి కాల్ వచ్చింది. నేను తీసుకున్న కొన్ని ఫొటోస్ పంపిస్తే, వాటిలో ఈ క్యారెక్టర్ కు సెట్ అయ్యేలా కనిపించలేదు. దాంతో మళ్లీ ఫొటోషూట్ చేసి పంపమన్నారు. ఆ ఫొటోస్ చూసి నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. అప్పటికి లైన్ గా ‘తమ్ముడు”‘కథ తెలుసు. నా రీ ఎంట్రీకి ఇది సరైన సినిమా అనిపించింది. క్యారెక్టర్ కోసం కొంచెం లావు కావాలని చెప్పారు. స్వీట్స్ తిని బరువు పెరిగాను.

ఈ మూవీ కోసం కొన్ని నెలల పాటు ఇక్కడే ఉన్నాను.’తమ్ముడు’ మూవీలో ఝాన్సీ కిరణ్మయి అనే క్యారెక్టర్ లో నటించాను. తనొక ఆఫీసర్. స్ట్రిక్ట్ గా ఉంటుంది. కుటుంబాన్ని చూసుకుంటూనే, ఆఫీసర్ గా నా బాధ్యతలు నిర్వర్తిస్తుంటాను. హీరో నితిన్ కు సోదరి పాత్ర నాది. ఈ చిత్రం కోసం అడవిలో షూటింగ్ చేశాం. రోజూ యూనిట్ లో ఎవరో ఒకరికి గాయాలు అయ్యేవి. షూటింగ్ పిక్నిక్ లా చేశామని చెబుతుంటారు. కానీ మేము పిక్నిక్ లా చేయలేదు. కష్టపడాల్సి వచ్చింది. మూవీ బాగా వస్తుందనే సంతోషంలో అంతా యూనిటీగా పనిచేశాం. ఈ సినిమా షూటింగ్ కాదని ఎవరూ ఎక్కడికీ వెళ్లలేదు. చాలా డెడికేటెడ్ గా వర్క్ చేశాం.

నితిన్ తో వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. తను స్టార్ హీరో అయినా చిన్న పిల్లాడిలా మా అందరితో కలిసిపోయారు. పర్ ఫార్మెన్స్ పరంగా చూస్తే ఈ సినిమాలో నితిన్ చాలా మెచ్యూర్డ్ గా కనిపిస్తాడు. చాలా కష్టమైన సీన్స్ కూడా ఈజీగా చేశాడు. సీన్స్ కోసం చేసిన ప్రిపరేషన్ వల్లే అంత సులువుగా నటించగలిగారు. తమ్ముడు అనే టైటిల్ ఈ సినిమాకు యాప్ట్. మీరు సినిమా చూశాక చెబుతారు. పవన్ కల్యాణ్ గారి తమ్ముడు మూవీకి ఈ చిత్రానికి పోలిక లేదు. నేను గతంలో సినిమాల్లో నటించినప్పటికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చాయి.

ప్రమోషన్ విషయం తీసుకుంటే అప్పుడు ఆడియో ఫంక్షన్, థియేటర్ విజిటింగ్, 100 డేస్ ఫంక్షన్ ఉండేది. ఇప్పుడు చాలా ఈవెంట్స్ చేస్తున్నారు. తమ్ముడు మూవీకి చేసిన ఈవెంట్స్ కు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు వస్తున్నారు. నేను హీరోయిన్ గా నటించినప్పుడు కూడా సింపుల్ గానే ఉన్నాను. ఒక స్టార్ హీరోయిన్ గా కాకుండా ప్రేమించులో మీనాగా, మిస్సమ్మలో రత్నమాలగానే ప్రేక్షకులు నన్ను చూశారు. అందుకే ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నప్పుడు సెట్ లో ఆ తేడా తెలియడం లేదు.

ఈ సినిమా కోసం ఇండియా రావాలనుకున్నప్పుడే అక్కడ యూఎస్ లో జాబ్ మానేశాను. అవకాశాలు కోరుకున్నప్పుడు రావు. అందుకే ఇండస్ట్రీలో వచ్చిన అవకాశం వదులుకోకూడదని వచ్చేశా. ఝాన్సీ కిరణ్మయి క్యారెక్టర్ ఎక్కువగా మాట్లాడదు. కానీ మాట్లాడినప్పుడు చాలా పవర్ ఫుల్ గా చెబుతుంది. ఈ క్యారెక్టర్ గురించి దర్శకుడు శ్రీరామ్ వేణు గారు చెప్పినప్పుడు ఝాన్సీ కిరణ్మయి స్ట్రాంగ్ వుమెన్, తను అనుకున్నది చేస్తుంది. ఏది ఏమైనా భయపడదు అని చెప్పారు. ఆయన చెప్పినట్లే నటించాను. ఈ క్యారెక్టర్ లో ఆ స్ట్రిక్ట్ నెస్ తో పాటు ఎమోషన్, అఫెక్షన్ కూడా ఉంటాయి.నా కెరీర్ లో ఇప్పటిదాకా ఒక సాధారణ అమ్మాయి పాత్రల్లోనే నటించాను. తమ్ముడు మూవీలో మాత్రం స్ట్రాంగ్ వుమెన్ గా నటించే అవకాశం దక్కింది.

ఈ కథలో ప్రతి పాత్రకు ఓ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎవరూ ఊరికే కనిపించరు. బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. నేను హీరోయిన్ గా చేసినప్పుడు అనుకోకుండా ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు చిత్ర పరిశ్రమలో మనకంటూ ఏదో సాధించాలనే తపనతో తిరిగి వచ్చాను. కథలో ప్రాధాన్యమున్న పాత్రల్లో నటించాలని అనుకుంటున్నా. ఆ పాత్ర సిస్టర్ అయినా, మదర్ అయినా చేస్తాను. కానీ థియేటర్ నుంచి బయటకు వచ్చేప్పుడు ఆడియెన్స్ కు నా క్యారెక్టర్ గుర్తుండాలి. నేను హీరోయిన్ గా చేసిన చిత్రాల్లోనూ మదర్ గా కనిపించినవి ఉన్నాయి. అప్పుడు నా వయసు 22 ఏళ్లు. కథకు డ్రైవింగ్ ఫోర్స్ లాంటి క్యారెక్టర్స్ వస్తే తప్పకుండా నటిస్తా. నేను యూఎస్ ఆర్టిస్టును కాదు హైదరాబాద్ లోకల్ ఆర్టిస్టునే. మూవీస్ ఉన్నప్పుడు ఇక్కడే ఉంటా. ప్రస్తుతం శివాజీ గారితో ఒక సినిమా చేస్తున్నాను. ఇంకే ప్రాజెక్ట్స్ అంగీకరించలేదు.” అని చెప్పుకొచ్చారు లయ.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap