iDreamPost
android-app
ios-app

ENG vs WI: ఇంగ్లండ్​ను వణికించిన వెస్టిండీస్.. అండర్సన్, బ్రాడ్ లేకపోతే ఇక అంతేనా?

  • Published Jul 20, 2024 | 9:38 PM Updated Updated Jul 20, 2024 | 9:40 PM

ఇంగ్లండ్ జట్టును వెస్టిండీస్ వణికించింది. బజ్​బాల్ అంటూ బడాయికి పోయిన ఇంగ్లీష్​ టీమ్​ను కరీబియన్ వీరులు ఒక రేంజ్​లో భయపెట్టారు.

ఇంగ్లండ్ జట్టును వెస్టిండీస్ వణికించింది. బజ్​బాల్ అంటూ బడాయికి పోయిన ఇంగ్లీష్​ టీమ్​ను కరీబియన్ వీరులు ఒక రేంజ్​లో భయపెట్టారు.

  • Published Jul 20, 2024 | 9:38 PMUpdated Jul 20, 2024 | 9:40 PM
ENG vs WI: ఇంగ్లండ్​ను వణికించిన వెస్టిండీస్.. అండర్సన్, బ్రాడ్ లేకపోతే ఇక అంతేనా?

ఇంగ్లండ్.. వరల్డ్ క్రికెట్​లో టాప్ టీమ్స్​లో ఒకటి. ఆ టీమ్ బరిలోకి దిగుతోందంటేనే మిగతా జట్లన్నీ భయపడతాయి. ద్వైపాక్షిక సిరీస్​ కానివ్వండి.. ఐసీసీ టోర్నమెంట్ కానివ్వండి ఇంగ్లీష్ టీమ్ ఒకేలా ఆడుతుంది. దూకుడే మంత్రంగా దూసుకెళ్లుంది. ముఖ్యంగా టెస్టుల్లో ఆ టీమ్ అటాకింగ్ అప్రోచ్​తోనే టాప్ రేంజ్​కు చేరుకుంది. బజ్​బాల్ మంత్రంతో ఆస్ట్రేలియా సహా అన్ని జట్లను వణికించింది. అయితే ఈ మధ్య కాలంలో బజ్​బాల్ మ్యాజిక్ పని చేయడం లేదు. భారత పర్యటనలో ఇదే సూత్రాన్ని వాడి బొక్క బోర్లా పడింది స్టోక్స్ సేన. ఇప్పుడు వెస్టిండీస్ కూడా ఆ టీమ్​ బెండు తీస్తోంది. ఈ రెండు జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో కరీబియన్ వీరులు అదరగొట్టారు.

ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో ఆతిథ్య జట్టు 416 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్​కు దిగిన విండీస్ ఏకంగా 457 పరుగులు చేసింది. తొలి టెస్టులో చిత్తుగా ఓడిన కరీబియన్ టీమ్ ఇంగ్లీష్ జట్టు సాధించిన స్కోరును అధిగమించడం హైలైట్ అనే చెప్పాలి. కావెమ్ హాడ్జ్ (120), జోషువా డసిల్వా (82) ఇంగ్లండ్ బౌలింగ్​ను తుత్తునియలు చేశారు. వచ్చిన బౌలర్​ను వచ్చినట్లు బాది పారేశారు. ఇద్దరూ కలసి 29 బౌండరీలు కొట్టారు. దీంతో క్రిస్ వోక్స్, మార్క్ వుడ్ సహా మిగిలిన బౌలర్లు గుడ్లు తేలేశారు. కెప్టెన్స్ స్టోక్స్ స్వయంగా బౌలింగ్​కు దిగినా ఆ ఇద్దర్నీ ఆపలేకపోయాడు. దీంతో ఇంగ్లండ్ పనైపోయిందని నెటిజన్స్ అంటున్నారు. అండర్సన్, బ్రాడ్ రిటైర్మెంట్​తో ఇక ఆ జట్టు కథ ముగిసిందని చెబుతున్నారు. మరి.. ఇంగ్లండ్​ను విండీస్​ కోలుకోలేని దెబ్బ కొట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.