iDreamPost
android-app
ios-app

‘కన్నప్ప’ కల్పితం కాదు.. అది మన చరిత్ర.. ఆ శివుడి ఆశీస్సులతో ఈ శుక్రవారం నాది అవుతుంది.. మీడియా మీట్‌లో విష్ణు మంచు

  • Published Jun 26, 2025 | 6:26 PM Updated Updated Jul 07, 2025 | 4:32 PM

విష్ణు మంచు మాట్లాడుతూ .. ‘‘కన్నప్ప’కు ఇప్పటి వరకు లక్షకు పైగా టికెట్లు తెగాయి. ఇంతటి రెస్పాన్స్ చూసి నాకు ఆనందమేస్తోంది. ఇదంతా శివ లీల అనిపిస్తుంది. ‘కన్నప్ప’ మీద ఇంత పాజిటివిటీ వస్తుందని ప్రారంభంలో ఎవ్వరూ నమ్మలేదు.

విష్ణు మంచు మాట్లాడుతూ .. ‘‘కన్నప్ప’కు ఇప్పటి వరకు లక్షకు పైగా టికెట్లు తెగాయి. ఇంతటి రెస్పాన్స్ చూసి నాకు ఆనందమేస్తోంది. ఇదంతా శివ లీల అనిపిస్తుంది. ‘కన్నప్ప’ మీద ఇంత పాజిటివిటీ వస్తుందని ప్రారంభంలో ఎవ్వరూ నమ్మలేదు.

  • Published Jun 26, 2025 | 6:26 PMUpdated Jul 07, 2025 | 4:32 PM
‘కన్నప్ప’ కల్పితం కాదు.. అది మన చరిత్ర.. ఆ శివుడి ఆశీస్సులతో ఈ శుక్రవారం నాది అవుతుంది.. మీడియా మీట్‌లో విష్ణు మంచు

డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ జూన్ 27న విడుదల కాబోతోంది. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా. ఎం. మోహన్ బాబు నిర్మాణంలో ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్‌లు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. ఈ క్రమంలో గురువారం నాడు విష్ణు మంచు, కన్నప్ప టీం మీడియాతో ముచ్చటించింది. ఈ కార్యక్రమంలో

విష్ణు మంచు మాట్లాడుతూ .. ‘‘కన్నప్ప’కు ఇప్పటి వరకు లక్షకు పైగా టికెట్లు తెగాయి. ఇంతటి రెస్పాన్స్ చూసి నాకు ఆనందమేస్తోంది. ఇదంతా శివ లీల అనిపిస్తుంది. ‘కన్నప్ప’ మీద ఇంత పాజిటివిటీ వస్తుందని ప్రారంభంలో ఎవ్వరూ నమ్మలేదు. అది వారి తప్పు కాదు. ఇప్పుడు ‘కన్నప్ప’ మీద ఫుల్ పాజిటివిటీ వచ్చింది. ‘కన్నప్ప’ చిత్రాన్ని ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా చూడాలని కోరుకుంటున్నాను. అందుకే నేను టికెట్ రేట్లు పెంచడం లేదు. ఈ మూవీని పిల్లలే ఎక్కువగా చూడాలని అనుకుంటున్నాను. అందుకే కుటుంబాలకు భారం కావొద్దని టికెట్ రేట్లు ఎక్కువగా పెంచడం లేదు. ఏపీలో కొన్ని చోట్ల మాత్రమే పెంచాం. ప్రభాస్‌కి ఇప్పటికే నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఆ దేవుడి దయవల్ల నేను కన్నప్ప విషయంలో ఎప్పుడూ ఆర్థిక కష్టాల్ని ఎదుర్కోలేదు. నా తండ్రి మోహన్ బాబు గారు, విజయ్, వినయ్ గారు నా వెన్నంటే ఉండి అంతా చూసుకున్నారు. కన్నప్ప కోసం మా టీం పడినంత కష్టాన్ని నేను అయితే పడలేదు. నా నలుగురు పిల్లలు ఈ చిత్రంలో నటించారు. ఓ తండ్రిగా నా పిల్లల్ని తెరపై చూడటం ఆనందంగా ఉంటుంది. నా పిల్లలు ఆర్టిస్టులు అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. కానీ వాళ్లు ఏం అవుతారో చూద్దాం. అసలు ‘కన్నప్ప’ ఈ రేంజ్ పాజిటివిటీతో వస్తుందని ఒకప్పుడు ఎవ్వరూ ఊహించలేదు. కర్ణాటకలో తెల్లవారు ఝామున రెండు గంటలకు ప్లాన్ చేశారు. కేరళలో పెద్ద ఎత్తున సినిమాను విడుదల చేస్తున్నారు. నా చిత్రం పది వారాల వరకు ఓటీటీలో రాదు. నా మీద రిలీజ్ గురించి ఒత్తిడి లేదు. నేను అందరినీ గౌరవిస్తాను. ఏ కమ్యూనిటీని కించపర్చాలని కూడా అనుకోను.

ఈ చిత్రంలో ఎవ్వరినీ ఎక్కడా కూడా అగౌరవపర్చలేదు. దేవుడు, భక్తుడికి మధ్యలో ఎవ్వరూ ఉండాల్సిన పని లేదు, మూఢ నమ్మకాలు అవసరం లేదు అని చెప్పడమే ఈ చిత్రం ఉద్దేశం. దేవుడి మీద మనసారా భక్తి ఉంటే చాలు అని చెప్పాలని అనుకున్నాం. ‘కన్నప్ప’ స్క్రిప్ట్ మీదున్న నమ్మకంతోనే ఇంత బడ్జెట్ పెట్టి, రిస్క్ చేసేందుందుకు ముందుకు వచ్చాం. ఈ చిత్రంలో మోహన్‌లాల్ గారి పాత్ర చాలా సర్ ప్రైజింగ్‌గా, షాకింగ్‌గా అనిపిస్తుంది. ఆ శివుడి ఆశీస్సులతో ఈ శుక్రవారం నాది అవుతుంది. ‘కన్నప్ప’ కథ కల్పితం కాదు. కన్నప్ప ఉన్నారు.. ఇప్పటికీ ఆయన్ను ఆరాధిస్తుంటారు. మళ్లీ చెబుతున్నాను ‘కన్నప్ప’ కల్పితం కాదు.. చరిత్ర.. మన చరిత్ర. మన మధ్యలో జీవించినవాడు’ అని అన్నారు.

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş