iDreamPost
android-app
ios-app

OTT లోకి వచ్చేసిన డేంజరస్ హర్రర్ మూవీ..తెలుగులో కూడా

  • Published Jun 26, 2025 | 9:10 PM Updated Updated Jun 26, 2025 | 9:10 PM

కొన్ని సినిమాలు ఎంత భయంకరంగా ఉన్నా సరే ప్రేక్షకులు వాటిని చూడడం మాత్రం స్కిప్ చేయరు. హర్రర్ సినిమాలు ఏ లాంగ్వేజ్ లో ఉన్నా సరే కంటెంట్ బావుంటే కనుక చూస్తూనే ఉంటారు. అలాంటిది ఈ హాలీవుడ్ మోస్ట్ ఫేవరేట్ ఫ్రాంచైజ్ తెలుగులో వస్తే ఎలా మిస్ చేస్తారు.

కొన్ని సినిమాలు ఎంత భయంకరంగా ఉన్నా సరే ప్రేక్షకులు వాటిని చూడడం మాత్రం స్కిప్ చేయరు. హర్రర్ సినిమాలు ఏ లాంగ్వేజ్ లో ఉన్నా సరే కంటెంట్ బావుంటే కనుక చూస్తూనే ఉంటారు. అలాంటిది ఈ హాలీవుడ్ మోస్ట్ ఫేవరేట్ ఫ్రాంచైజ్ తెలుగులో వస్తే ఎలా మిస్ చేస్తారు.

  • Published Jun 26, 2025 | 9:10 PMUpdated Jun 26, 2025 | 9:10 PM
OTT లోకి వచ్చేసిన డేంజరస్ హర్రర్ మూవీ..తెలుగులో కూడా

కొన్ని సినిమాలు ఎంత భయంకరంగా ఉన్నా సరే ప్రేక్షకులు వాటిని చూడడం మాత్రం స్కిప్ చేయరు. హర్రర్ సినిమాలు ఏ లాంగ్వేజ్ లో ఉన్నా సరే కంటెంట్ బావుంటే కనుక చూస్తూనే ఉంటారు. అలాంటిది ఈ హాలీవుడ్ మోస్ట్ ఫేవరేట్ ఫ్రాంచైజ్ తెలుగులో వస్తే ఎలా మిస్ చేస్తారు. ఒకవేల మీరు కనుక ఈ మూవీ మిస్ అయ్యి ఉంటే ఓ మంచి హర్రర్ కంటెంట్ మిస్ అయినట్టే. పైగా ఈ సినిమా రూ. 430 కోట్లతో తెరకెక్కి.. ఏకంగా రూ. 2400 కోట్లు రాబట్టింది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలు చూసేద్దాం.

హాలీవుడ్ లో వచ్చిన మోస్ట్ ఫేవరేట్ సిరీస్ లో ఫైనల్ పార్ట్ అయిన ఈ సిరీస్ లో కూడా సస్పెన్స్ థ్రిల్లర్స్ , హర్రర్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇక విజువల్ ఎఫెక్ట్స్ సంగతైతే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే వీక్ హార్ట్ పీపుల్ ఈ సినిమాకు కాస్త దూరంగా ఉండడం మంచిదని అంటున్నార హర్రర్ మూవీ లవర్స్. ఈ సినిమా మరేదో కాదు.. ఆడియన్స్ అందరిని విపరీతంగా భయపెట్టిన ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్. మూవీ. చావు ఎంత భయంకరంగా ఉంటుందో ఈ సినిమానే అందరికి పరిచయం చేసింది.

ఆడమ్ స్టెయిన్ తెరకెక్కించిన ఈ మూవీలో ట్లిన్ శాంటా జువానా, టియో బ్రియోన్స్, రిచర్డ్ హార్మన్, ఓవెన్ పాట్రిక్ జాయ్నర్, ర్యా కిహ్ల్స్టెడ్, అన్నా లోర్, బ్రెక్ బాసింగర్, టోనీ టాడ్ ప్రధాన పాత్రలలో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ తో పాటు.. బుక్ మై షో ప్లాట్ ఫార్మ్స్ లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఒరిజినల్ లాంగ్వేజ్ తో పాటు తెలుగులోనూ ఈ మూవీ అందుబాటులోకి వచ్చింది. అయితే ప్రస్తుతానికి ఈ మూవీ రెంటల్ విధానంలోనే అందుబాటులోకి ఉంది. మరి కొద్దీ రోజుల్లో ఫ్రీ స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశం ఉంది. థియేటర్ లో కనుక ఈ సినిమాను మిస్ అయితే ఓటిటి లో అసలు మిస్ కాకుండా చూసేయండి.