iDreamPost
android-app
ios-app

వీడియో: సూపర్‌ డెలవరీ! సచిన్‌, కోహ్లీ, రోహిత్‌ కూడా ఆడలేరేమో?

  • Published Aug 10, 2024 | 5:41 PM Updated Updated Aug 10, 2024 | 5:41 PM

One Day Cup, England: ఆ బౌలర్‌ వేసిన ఇన్‌స్వింగ్‌ డెలవరీకి బ్యాటర్‌ నోరెళ్లబెట్టాడు. బ్యాటరే కాదు.. ఆ బాల్‌ చూసిన ఎవరైనా అలా చేయాల్సిందే. ఎందుకంటే అంత దారుణంగా స్వింగ్‌ అయిందా బాల్‌. దాని గురించి పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం..

One Day Cup, England: ఆ బౌలర్‌ వేసిన ఇన్‌స్వింగ్‌ డెలవరీకి బ్యాటర్‌ నోరెళ్లబెట్టాడు. బ్యాటరే కాదు.. ఆ బాల్‌ చూసిన ఎవరైనా అలా చేయాల్సిందే. ఎందుకంటే అంత దారుణంగా స్వింగ్‌ అయిందా బాల్‌. దాని గురించి పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Aug 10, 2024 | 5:41 PMUpdated Aug 10, 2024 | 5:41 PM
వీడియో: సూపర్‌ డెలవరీ! సచిన్‌, కోహ్లీ, రోహిత్‌ కూడా ఆడలేరేమో?

అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో సూపర్‌ డెలవరీలు వేస్తుంటారు బౌలర్లు. కొన్ని అద్భుతమైన బంతులకు హేమాహేమీ బ్యాటర్లు కూడా వికెట్‌ సమర్పించుకోవాల్సిందే. మంచి బంతులకు రెస్పెక్ట్‌ ఇస్తూ. డిఫెన్స్‌ ఆడకుంటే.. కొమ్ములు తిరిగిన బ్యాటర్‌ అయినా.. పెవిలియన్‌కు క్యూ కట్టాల్సిందే. ముఖ్యంగా స్పీడ్‌తో పాటు బాల్‌ను అద్భుతంగా స్వింగ్‌ చేయగలిగే బౌలర్‌ను చాలా డేంజరస్‌ బౌలర్‌గా పరిగణిస్తారు. పెద్ద పెద్ద బ్యాటర్లు సైతం అలాంటి బౌలర్లను ఒళ్లుదగ్గరపెట్టుకొని ఆడతారు. తాజాగా అలాంటి ఒక సూపర్‌ డెలవరీ చోటు చేసుకుంది.

బాల్‌ ఇంత దారుణంగా స్వింగ్‌ అవుతుందా అనిపిస్తుంది ఆ బాల్‌ చూస్తుంటే. అంత స్వింగ్‌ అయితే.. ఇండియాలో తోపు బ్యాటర్ల అయిన సచిన్‌ టెండూల్కర్‌, విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ లాంటి దిగ్గజ బ్యాటర్లు కూడా అవుట్‌ కావాల్సిందే అనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. ఎక్కడో వైడ్‌ లైన్‌లో పడిన బాల్‌ను.. అనూహ్యంగా ఇన్‌స్వింగ్‌ అవుతూ.. వచ్చి ఆఫ్‌ స్టంప్‌ను తాకింది. పైగా అంత వేగంగా చాలా ఎక్కువ స్వింగ్‌ అవ్వడంతో ఆ బ్యాటర్‌ అవాక్కయ్యాడు. ఈ సూపర్‌ స్వింగ్‌ డెలవరీ.. ఇంగ్లండ్‌ కౌంటీ క్రికెట్‌లోని వన్‌ డే కప్‌లో చోటు చేసుకుంది.

వన్‌ డే కప్‌లో భాగంగా జరిగిన ఓ మ్యాచ్‌లో బౌలర్‌ వేసిన బంతిని బ్యాటర్‌ ఏ మాత్రం అంచనా వేయలేకపోయాడు. పిచ్‌పై వైడ్‌లైన్‌లో పడిన బాల్‌ అలా రివ్వునా.. ఇన్‌ స్వింగ్‌గా రావడంతో ఖంగుతిన్నాడు. బాల్‌ అలా ఆఫ్‌ సైడ్‌ నుంచి వెళ్లిపోతుంది అని బ్యాటర్‌ షాట్‌ ఆడేందుకు కూడా ఇంట్రస్ట్‌ చూపించలేదు. కానీ, ఆ బాల్‌కే బౌల్డ్‌ అయ్యాడు. ప్రస్తుతం ఈ బాల్‌ అద్భుతంగా స్వింగ్‌ అయిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. మరి కిందున్న వీడియో చూపి.. ఆ సూపర్‌ స్వింగ్‌ బాల్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.