iDreamPost
android-app
ios-app

గ్రాహం థోర్ప్ ఆత్మహత్య చేసుకున్నాడు! ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ భార్య షాకింగ్‌ స్టేట్‌మెంట్‌

  • Published Aug 12, 2024 | 5:48 PM Updated Updated Aug 12, 2024 | 5:48 PM

England, Graham Thorpe, Amanda: దిగ్గజ మాజీ క్రికెటర్‌ సహజ మరణం పొందలేదని, ఆత్మహత్య చేసుకున్నాడంటూ.. తాజాగా అతని భార్య సంచలన స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. మరి క్రికెటర్‌ ఎవరు? ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో ఇప్పుడు చూద్దాం..

England, Graham Thorpe, Amanda: దిగ్గజ మాజీ క్రికెటర్‌ సహజ మరణం పొందలేదని, ఆత్మహత్య చేసుకున్నాడంటూ.. తాజాగా అతని భార్య సంచలన స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. మరి క్రికెటర్‌ ఎవరు? ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో ఇప్పుడు చూద్దాం..

  • Published Aug 12, 2024 | 5:48 PMUpdated Aug 12, 2024 | 5:48 PM
గ్రాహం థోర్ప్ ఆత్మహత్య చేసుకున్నాడు! ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ భార్య షాకింగ్‌ స్టేట్‌మెంట్‌

ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ గ్రాహం థోర్ప్‌ అనారోగ్యంతో మృతి చెందినట్లు.. ఈ నెల 5న ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే.. తాజాగా గ్రాహం థోర్ప్‌ భార్య అమండా ఆయన మృతిపై సంచలన స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. థోర్ప్‌ది సహజ మరణం కాదని ఆయన ప్రాణాలను ఆయనే తీసుకున్నారంటూ వెల్లడించారు. కొన్నేళ్లుగా థోర్ప్‌ తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నాడని, అందుకే ఆయన ఆత్మహత్య చేసకున్నట్లు తెలిపారు. ఆమె చేసిన ప్రకటన ప్రస్తుతం క్రికెట్‌ వర్గాల్లో సంచలనంగా మారింది.

‘మమ్మల్ని ప్రేమించే అతను, అతన్ని ప్రేమించే మేము(భార్య, ఇద్దరు కుమార్తెలు) ఉన్నప్పటికీ, అతను డిప్రెషన్‌ నుంచి బయట పడలేకపోయాడు. రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న థోర్ప్‌.. అంతకు ముందు కూడా డిప్రెషన్‌కు లోనయ్యాడు. అతను లేకుంటేనే మేం సంతోషంగా ఉంటామని భావించి.. తన ప్రాణాలు తానే తీసుకున్నాడు. 2022లో అతను చేసిన ఆత్మహత్య ప్రయత్నం వల్లే కొంతకాలంగా ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉన్నాడు’ అంటూ మాజీ క్రికెటర్‌ భార్య ఆవేదన వ్యక్తం చేశారు.

1969 ఆగస్ట్‌ 1న ఇంగ్లండ్‌లోని సర్రేలో జన్మించిన థోర్ప్‌ పూర్తి పేరు గ్రాహం పాల్ థోర్ప్. 1993 మే 19న ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చాడు. అదే ఏడాది జులైలో 1న ఆస్ట్రేలియాతోనే టెస్ట్‌ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. 1993 నుంచి 2005 మధ్య ఇంగ్లండ్ తరపున 100 టెస్టులు ఆడిన థోర్ప్, ఇంగ్లండ్‌కు కొంతకాలం బ్యాటింగ్‌ కోచ్‌గా కూడా పనిచేశాడు. 100 టెస్టుల్లో 44.66 యావరేజ్‌తో 6744 పరుగులు చేశాడు. అలాగే 82 వన్డేల్లో 2380 పరుగులు సాధించాడు. టెస్టుల్లో 16 సెంచరీలు, 39 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. మరి గ్రాహం థోర్ప్‌ది సహజ మరణం కాదని, అతను డిప్రెషన్‌తో ఆత్మహత్య చేసుకున్నాడని అతని భార్య చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.