iDreamPost
android-app
ios-app

జూలై 18న ‘వీడే మన వారసుడు’ చిత్రం విడుద‌ల‌

  • Published Jun 26, 2025 | 12:09 PM Updated Updated Jun 26, 2025 | 12:09 PM

Veede Mana Varasudu: రైతుల జీవితాలపై ఆధారపడి రూపొందిన సందేశాత్మక చిత్రం ‘వీడే మన వారసుడు’. రమేష్ ఉప్పు (RSU) కథ , స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు ,నిర్మాత, దర్శకత్వంతో పాటు హీరోగా కూడా నటించిన ఈ సినిమా తుది మెరుగులు దిద్దుకుంటోంది. రమేష్ ఉప్పు (RSU)కు జోడిగా లావణ్య రెడ్డి, సర్వాణి మోహన్ న‌టించారు.

Veede Mana Varasudu: రైతుల జీవితాలపై ఆధారపడి రూపొందిన సందేశాత్మక చిత్రం ‘వీడే మన వారసుడు’. రమేష్ ఉప్పు (RSU) కథ , స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు ,నిర్మాత, దర్శకత్వంతో పాటు హీరోగా కూడా నటించిన ఈ సినిమా తుది మెరుగులు దిద్దుకుంటోంది. రమేష్ ఉప్పు (RSU)కు జోడిగా లావణ్య రెడ్డి, సర్వాణి మోహన్ న‌టించారు.

  • Published Jun 26, 2025 | 12:09 PMUpdated Jun 26, 2025 | 12:09 PM
జూలై 18న ‘వీడే మన వారసుడు’ చిత్రం విడుద‌ల‌

రైతుల జీవితాలపై ఆధారపడి రూపొందిన సందేశాత్మక చిత్రం ‘వీడే మన వారసుడు’. రమేష్ ఉప్పు (RSU) కథ , స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు ,నిర్మాత, దర్శకత్వంతో పాటు హీరోగా కూడా నటించిన ఈ సినిమా తుది మెరుగులు దిద్దుకుంటోంది. రమేష్ ఉప్పు (RSU)కు జోడిగా లావణ్య రెడ్డి, సర్వాణి మోహన్ న‌టించారు. అర్.ఎస్ ఆర్ట్స్ బ్యానర్ పై రూపోందిన ఈ చిత్రానికీ శ్రీమతి యు.రమాదేవి సమర్పకురాలుగా వ్యవహారిస్తున్నారు. సమ్మెట‌ గాంధీ, విజయ రంగరాజు, ఆనంద్ భారతి, గూడూరు కిషోర్, శిల్ప (వైజాగ్) కీలక పాత్రలు పోషించారు. జూలై 18న తెలుగు రాష్ట్రాల‌లో ఈ సినిమాను విడుద‌ల చేయ‌బోతున్నారు.

తాజాగా ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు చిత్రయూనిట్‌ను అభినందించారు. కుటుంబం, రైతుల పోరాటం, యువతపై మాదకద్రవ్యాల ప్రభావం వంటి అంశాలను సమర్థవంతంగా చిత్రీకరించినందుకు ప్రశంసలు లభించాయి.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌క‌నిర్మాత రమేష్ ఉప్పు (RSU) మాట్లాడుతూ.. స‌మాజానికి మంచి సందేశం అందిస్తుంది మా సినిమా. ఇందులోని భావోద్వేగాలు ప్ర‌తి ఒక్క‌రిని క‌దిలిస్తాయి. సెన్సార్ బోర్డు స‌భ్యుల‌తో పాటు, ప్రీమియ‌ర్ షో చూసిన ప‌లువురు ప్ర‌ముఖులు సినిమాపై ప్ర‌శంస‌లు కురిపించ‌డంతో మా న‌మ్మ‌కం మ‌రింతా పెరిగింది. మా శ్ర‌మ‌కు మంచి సక్సెస్ అందుతుందనే నమ్మకం బ‌లంగా ఉంది. రైతుల కష్టాలను అర్థవంతంగా ఆవిష్కరించిన‌ ఈ కుటుంబ క‌థా చిత్రాన్ని థియేట‌ర్‌కు వెళ్లి చూడాల‌ని ప్రేక్ష‌కుల‌కు విజ్ఞ‌ప్తి చేస్తున్నాను.” అని చెప్పారు.

ఈ నెల 29న మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఇప్పటికే ప్రముఖులకు ప్రీమియర్ షో ఏర్పాటు చేయగా, చూసినవారంతా సినిమా బృందాన్ని అభినందనలతో ముంచెత్తారు. సినిమాపై బజ్ పెంచేందుకు యూనిట్ ప్రమోషన్స్‌ ప్రారంభించింది.

తారాగణం: హీరో – రమేష్ ఉప్పు, హీరోయిన్‌లు లావణ్య రెడ్డి, సర్వాణి మోహన్. ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో సమ్మెట‌ గాంధీ, విజయ రంగరాజు, ఆనంద్ భారతి, గూడూరు కిషోర్, శిల్ప (వైజాగ్), సిద్ధు రాయల్, అద్వితేజ్ రెడ్డి తదితరులు నటించారు.

బ్యానర్: అర్.ఎస్ ఆర్ట్స్
ఛాయాగ్రహణం: డి. యాదగిరి
ఎడిటింగ్: కె. శ్రీనివాస్ రావు
సంగీతం: సదివే దేవేంద్ర
నేపథ్య సంగీతం : శ్రీ వెంకట్
లిరిక్స్ & సింగింగ్: రమేష్ ఉప్పు (RSU)
కో-డైరెక్టర్: అమీర్ కజ్ రాణి
ఫైట్స్: యాక్షన్ అహ్మద్, షావోలిన్ మల్లేష్
కొరియోగ్రఫీ: బాలకృష్ణ (బాలు)
పబ్లిసిటీ డిజైన్: దాది త్రినాథ్
పీఆర్‌వో: కడలి రాంబాబు, దయ్యాల అశోక్

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet