iDreamPost
android-app
ios-app

Mark Wood: వీడియో: మార్క్ వుడ్ స్టన్నింగ్ బాల్.. దెబ్బకు రెండు ముక్కలైన వికెట్!

  • Published Jul 26, 2024 | 6:30 PM Updated Updated Jul 26, 2024 | 6:30 PM

WI vs ENG: ఇంగ్లండ్ స్టార్ పేసర్ మార్క్ వుడ్ స్టన్నింగ్ డెలివరీతో అందర్నీ అలరించాడు. అతడి దెబ్బకు స్టంప్స్ చెల్లాచెదురయ్యాయి.

WI vs ENG: ఇంగ్లండ్ స్టార్ పేసర్ మార్క్ వుడ్ స్టన్నింగ్ డెలివరీతో అందర్నీ అలరించాడు. అతడి దెబ్బకు స్టంప్స్ చెల్లాచెదురయ్యాయి.

  • Published Jul 26, 2024 | 6:30 PMUpdated Jul 26, 2024 | 6:30 PM
Mark Wood: వీడియో: మార్క్ వుడ్ స్టన్నింగ్ బాల్.. దెబ్బకు రెండు ముక్కలైన వికెట్!

ఇంగ్లండ్ స్టార్ పేసర్ మార్క్ వుడ్ గురించి తెలిసిందే. భీకర పేస్​తో ప్రత్యర్థి జట్లను వణికిస్తుంటాడతను. బౌన్సర్లతో బ్యాటర్లను బెంబేలెత్తిస్తుంటాడు. క్రీజులోకి కొత్త బ్యాటర్ వస్తే వాళ్లతో ఆడుకుంటాడు. కన్​సిస్టెంట్​గా 90 మైళ్లకు తగ్గని పేస్​తో బౌలింగ్ చేసే వుడ్​ను ఫేస్ చేయాలంటే స్టార్ బ్యాటర్లు కూడా జడుసుకుంటారు. సరైన లైన్ అండ్ లెంగ్త్, లీథల్ పేస్​తో నిప్పులు చెరిగే వుడ్ మరోమారు సత్తా చాటాడు. వెస్టిండీస్​తో జరుగుతున్న మూడో టెస్ట్​లో అతడు ఓ స్టన్నింగ్ బాల్​తో అలరించాడు. విండీస్ బ్యాటర్ కిర్క్ మెకంజీని క్లీన్​బౌల్డ్ చేశాడు వుడ్. అతడి దెబ్బకు స్టంప్స్ చెల్లాచెదురయ్యాయి.

విండీస్ ఇన్నింగ్స్ 25వ ఓవర్ వేసిన వుడ్.. మూడో బంతిని ఏకంగా 146 కిలోమీటర్ల వేగంతో విసిరాడు. ఫుల్ లెంగ్త్​లో పడిన బంతి బుల్లెట్​లా దూసుకొచ్చింది. దాన్ని డ్రైవ్ చేసేందుకు ప్రయత్నించి మెకంజీ ఫెయిలయ్యాడు. అతడి బ్యాట్​ అంచును తాకిన బంతి కాస్తా వెళ్లి మిడిల్ స్టంప్​ను గిరాటేసింది. దెబ్బకు మిడిల్ వికెట్ రెండు ముక్కలైంది. స్టంప్ మైక్​తో ఉన్న వికెట్ కింది భాగం ఒకవైపు, మిగిలిన భాగం ఇంకో వైపు వెళ్లి పడింది. బెయిల్స్ ఎగిరి దూరంగా పడ్డాయి. మెకంజీకి అసలు ఏం జరిగిందో అర్థం కాక ఆ కన్​ఫ్యూజన్​లోనే క్రీజును వీడాడు. ఇక, ఇన్నింగ్స్ 26 ఓవర్లు ముగిసేసరికి విండీస్ 3 వికెట్లకు 97 పరుగులు చేసింది. క్రెయిగ్ బ్రాత్​వైట్ (56 నాటౌట్) క్రీజులో ఉన్నాడు. ఈ సిరీస్​లో 2-0తో ఇంగ్లండ్ ఆధిక్యంలో ఉంది. మరి.. వుడ్ స్టన్నింగ్ డెలివరీ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.