iDreamPost
android-app
ios-app

వీడియో: బ్యాటర్లకు నరకం చూపించే ఈ స్టార్​ బౌలర్​ను గుర్తుపట్టారా? లెజెండ్స్​నే వణికించినోడు!

  • Published Jul 17, 2024 | 10:40 AMUpdated Jul 17, 2024 | 10:40 AM

అతడు అలాంటి ఇలాంటి బౌలర్ కాదు.. క్రికెట్​లో లెజెండ్స్​గా పేరు తెచ్చుకున్న వారినే వణికించినోడు. స్టార్ బ్యాటర్లకు నిద్ర పట్టకుండా చేసిన ఆ బౌలర్​కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

అతడు అలాంటి ఇలాంటి బౌలర్ కాదు.. క్రికెట్​లో లెజెండ్స్​గా పేరు తెచ్చుకున్న వారినే వణికించినోడు. స్టార్ బ్యాటర్లకు నిద్ర పట్టకుండా చేసిన ఆ బౌలర్​కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

  • Published Jul 17, 2024 | 10:40 AMUpdated Jul 17, 2024 | 10:40 AM
వీడియో: బ్యాటర్లకు నరకం చూపించే ఈ స్టార్​ బౌలర్​ను గుర్తుపట్టారా? లెజెండ్స్​నే వణికించినోడు!

అతడు అలాంటి ఇలాంటి బౌలర్ కాదు.. క్రికెట్​లో లెజెండ్స్​గా పేరు తెచ్చుకున్న వారినే వణికించినోడు. స్టార్ బ్యాటర్లకు నిద్ర పట్టకుండా చేసిన బౌలర్ అతను. రెండు దశాబ్దాలకు పైగా సాగిన సుదీర్ఘ కెరీర్​లో సచిన్ టెండూల్కర్ నుంచి విరాట్ కోహ్లీ వరకు మేటి బ్యాటర్లు అందర్నీ ఇబ్బంది పెట్టాడు. అతడు ప్రైమ్ ఫామ్​లో ఉన్నప్పుడు కోహ్లీ ఎదుర్కోలేకపోయాడు. పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్, ఇరు వైపులా స్వింగ్, మెరుపు వేగంతో అతడు వేసే డెలివరీస్​ను ఎదుర్కొని బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకోలేకపోయేవారు. అంతలా క్రికెట్​పై డామినేషన్ చూపించిన ఆ బౌలర్​కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇంగ్లండ్ పేస్ లెజెండ్ జేమ్స్ అండర్సన్​కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. బాత్రూమ్​లో స్నానం చేసి వచ్చిన జిమ్మీ.. ఒంటికి టవల్ చుట్టుకొని, నెత్తికి ఇంకో తువాళ కట్టుకొని ఉండటం అందులో చూడొచ్చు. మరో ఇంగ్లండ్ దిగ్గజం గ్రేమ్ స్వాన్ కూడా ఈ వీడియోలో ఉన్నాడు. కెమెరా వైపు చూస్తూ స్వాన్ స్మైల్ ఇస్తున్న టైమ్​లో హఠాత్తుగా బాత్రూమ్ నుంచి వచ్చాడు అండర్సన్. అయితే స్వాన్ చేతిలో ఫోన్​ ఉండటం, అతడు వీడియో రికార్డ్ చేస్తున్నాడనే విషయం తెలియని జిమ్మీ.. ఒక్కసారిగా మొబైల్ వైపు చూసి షాకయ్యాడు. కొంపముంచాడని గ్రహించి వెంటనే బాత్రూమ్​లోకి వెళ్లిపోయాడు.

అండర్సన్​ వెనక్కి వెళ్లిపోవడంతో గ్రేమ్ స్వాన్ నవ్వుల్లో మునిగిపోయాడు. అతడు సరదాగా ఆటపట్టించడం కోసం ఈ వీడియో తీశాడని అర్థమవుతోంది. ఇదెప్పుడు జరిగిందో తెలియదు గానీ.. నెట్టింట మాత్రం వైరల్ అవుతోంది. 21 ఏళ్ల కెరీర్​లో ఎందరో గ్రేట్ క్రికెటర్స్​తో కలసి ఆడాడు అండర్సన్. స్వాన్​తోనూ అతడు డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నాడు. ఏదైనా టూర్​లో ఉన్నప్పుడు ఈ వీడియో తీసి ఉండొచ్చు. ఇక, లార్డ్స్ వేదికగా వెస్టిండీస్​తో జరిగిన టెస్ట్ మ్యాచ్​తో జెంటిల్మన్ గేమ్​కు గుడ్​బై చెప్పేశాడు అండర్సన్. ఆ మ్యాచ్​ తొలి ఇన్నింగ్స్​లో ఒక వికెట్ తీసిన ఈ స్టార్ పేసర్.. రెండో ఇన్నింగ్స్​లో 3 కీలక వికెట్లతో విండీస్ నడ్డి విరిచాడు. అదే పేస్, అదే స్వింగ్​తో బ్యాటర్లకు పోయించాడు. పోతూ పోతూ మునుపటి అండర్సన్​ను గుర్తుచేశాడు. మొత్తంగా కెరీర్​లో 188 టెస్టులు ఆడిన అతడు 704 వికెట్లు పడగొట్టి ఆల్​టైమ్ గ్రేటెస్ట్ క్రికెటర్​గా నిలిచాడు.

 

View this post on Instagram

 

A post shared by Hum hai cricket (@humhaicricket)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి