iDreamPost
android-app
ios-app

వీడియో: క్రికెట్ చరిత్రలో ఇలాంటి క్యాచ్ డ్రాప్ ఎప్పుడూ చూసి ఉండరు!

Greatest Dropped Catch In England Cricket: క్రికెట్ మ్యాచ్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్ మాత్ర‌మే కాదు ఫీల్డింగ్ కూడా ఎంతో ముఖ్యం. ఒక క్యాచ్ కూడా మ్యాచ్ గెలుపోటములను నిర్దేస్తుంది. తాజాగా ఓ క్యాచ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూస్తే మాత్రం నవ్వకుండా ఉండలేరు.

Greatest Dropped Catch In England Cricket: క్రికెట్ మ్యాచ్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్ మాత్ర‌మే కాదు ఫీల్డింగ్ కూడా ఎంతో ముఖ్యం. ఒక క్యాచ్ కూడా మ్యాచ్ గెలుపోటములను నిర్దేస్తుంది. తాజాగా ఓ క్యాచ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూస్తే మాత్రం నవ్వకుండా ఉండలేరు.

వీడియో: క్రికెట్ చరిత్రలో ఇలాంటి క్యాచ్ డ్రాప్ ఎప్పుడూ చూసి ఉండరు!

క్రికెట్ ఆట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  ఈ గేమ్ కి ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటారు. ఇక వర్డల్ కప్, చాంపియన్ ట్రోపి లాంటి వాటితో పాటు వివిధ సిరీస్ లను సైతం క్రికెట్ ఫ్యాన్స్ మిస్స్ అవ్వకుండా చూస్తుంటారు. ఇలా మ్యాచ్ జరిగే సమయంలో కొన్ని కొన్ని  సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మరికొన్ని ఉత్కంఠను కలిగించడంతో పాటు నవ్వుకునేలా ఉంటాయి. క్రికెట్ లో ఫన్నీ సంఘటనలు అనేకం చోటుచేసుకుంటాయి. అయితే కొన్ని మాత్రం చరిత్రలో మిగిలిపోతుంటాయి. అవి జాతీయ స్థాయి క్రికెట్ అయినా, గల్లీ క్రికెట్ అయినా. అచ్చం అలాంటి ఓ అద్భుతమైన దృశ్యమే ఇంగ్లాండ్ క్రికెట్ లో చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం…

ఇంగ్లాండ్‌లో విలేజ్ క్రికెట్‌లో నేపథ్యంలో మెర్ట‌న్ బోర్స్‌, సంద‌ర్ స్టీడ్ క్ల‌బ్ టీమ్ ల మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్ లో ఇరు జట్లు గెలుపు కోసం తీవ్రంగా పోరాడుతున్నాయి. బ్యాటర్లను కట్టడి చేసేందుకు ప్రత్యేర్థి టీమ్ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే కనీసం ఒక్క పరుగు కూడా రాకుండా చేయాలని, అలానే క్యాచ్ ను పొరపాటును మిస్ చేయకూడదన్నట్లు ఫీల్డింగ్ టీమ్ ఆడుతుంది. ఇలాంటి సమయంలోనే బ్యాట‌ర్ కొట్టిన భారీ షాట్ ను బౌండ‌రీ లైన్ వ‌ద్ద ఫీల్డింగ్ చేస్తున్న సంద‌ర్‌ స్టీడ్ ఫీల్డ‌ర్ టీమ్ ప్లేయర్ స్టూ ఎల్లెరీ క్యాచ్‌గా అందుకునే ప్ర‌య‌త్నం చేశాడు. అతడు క్యాచ్ ను అందుకుంటాడని అందరు భావించారు. కానీ ఎల్లెరీ ఆ క్యాచ్ ను డ్రాప్ చేశాడు. అయితే ఇందులో వింతేముంది అనుకోవచ్చు.

ఆ క్యాచ్ ను ఒక్కసారి, రెండుసార్లు కాదు.. ఏకంగా ఏడుసార్లు పట్టుకోవాలని ఎల్లెరీ తీవ్రంగా ప్రయత్నించాడు.  అయిన‌ప్ప‌టికి ఆ క్యాచ్‌ను అందుకోలేక‌పోయాడు. ఇక ఆ క్యాచ్ ను రిప్లయ్ లో చూసిన ఎల్లెరీ, అతడి సహచారులు నవ్వుకున్నారు. అలానే అతడు చేసిన గట్టి ప్రయత్నాన్నికి అభినందించారు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ కామెంట్స్ చేస్తున్నారు.’నువ్వు తోపు అన్నా.. నీలాంటి ఫీల్డ‌ర్ మా జ‌ట్టుకు వ‌ద్ద‌న్నా’ అని ఒక‌రు, పాకిస్తాన్ ఫీల్డింగ్‌ను గుర్తుకుతెచ్చాడని మ‌రికొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు. ఇంకొందరు మాత్రం అతడి చేసిన ప్రయత్నానికి అభినందిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ  వీడియోపై మీరు ఓ లుక్కేసి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.