iDreamPost
android-app
ios-app

Ricky Ponting: ఆ టీమ్​కు కోచింగ్ ఇచ్చే ప్రసక్తే లేదు.. పాంటింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • Published Aug 09, 2024 | 5:33 PM Updated Updated Aug 09, 2024 | 5:33 PM

ఆస్ట్రేలియా లెజెండ్ రికీ పాంటింగ్ ప్లేయర్​గా క్రికెట్​కు గుడ్​బై చెప్పినా.. కోచ్​గా మాత్రం ఆటకు సన్నిహితంగానే ఉంటున్నాడు. అలాంటోడు తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఆస్ట్రేలియా లెజెండ్ రికీ పాంటింగ్ ప్లేయర్​గా క్రికెట్​కు గుడ్​బై చెప్పినా.. కోచ్​గా మాత్రం ఆటకు సన్నిహితంగానే ఉంటున్నాడు. అలాంటోడు తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

  • Published Aug 09, 2024 | 5:33 PMUpdated Aug 09, 2024 | 5:33 PM
Ricky Ponting: ఆ టీమ్​కు కోచింగ్ ఇచ్చే ప్రసక్తే లేదు.. పాంటింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

రికీ పాంటింగ్.. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన బెస్ట్ క్రికెటర్స్​లో ఒకడు. బ్యాటర్​గా పరుగుల వరద పారించి అన్ని టీమ్స్​ను భయపెట్టిన ప్లేయర్. బ్యాట్స్​మెన్​గా కంటే కెప్టెన్​గానే అతడు చాలా ఫేమస్. స్టీవ్​వా తర్వాత కెప్టెన్సీ పగ్గాలు చేపట్టి టీమ్​ను సక్సెస్​ఫుల్​గా నడిపించాడు. కంగారూలకు వరుస వరల్డ్ కప్​లు అందించడమే గాక అన్ని ఫార్మాట్లలోనూ తిరుగులేని టీమ్​గా నిలబెట్టాడు. అతడి నాయకత్వంలో ఆసీస్​ది గోల్డెన్ ఎరా నడిచింది. ఆ తర్వాత కూడా ఆ జట్టు అదే దూకుడును కొనసాగిస్తూ వస్తోంది. క్రికెట్​ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నా గేమ్​తో అనుబంధాన్ని మాత్రం పాంటింగ్ వీడలేదు. ఏదో ఒక టీమ్​కు కోచింగ్ ఇస్తూ ఆటతో రిలేషన్​ను కంటిన్యూ చేస్తున్నాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్​లో ఢిల్లీ క్యాపిటల్స్​కు ఏడు సీజన్లు హెడ్​ కోచ్​గా ఉన్నాడు పాంటింగ్. ఆ టీమ్​ను సక్సెస్​ఫుల్​గా వెనుక నుంచి నడిపించాడు. శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్ లాంటి ఆటగాళ్లు స్టార్లుగా మారడంలో అతడికి క్రెడిట్ ఇవ్వాల్సిందే. అయితే గత రెండు సీజన్లలో టీమ్ ఫెయిల్ అవడంతో మెగా ఆక్షన్​కు ముందు పాంటింగ్​కు గుడ్​బై చెప్పింది డీసీ. అతడి స్థానంలో నయా కోచ్ కోసం అన్వేషిస్తోంది. దీంతో పాంటింగ్ భవిష్యత్తు అయోమయంలో పడింది. ఈ తరుణంలో ఇంగ్లండ్ వైట్ బాల్ టీమ్​కు కోచ్​గా ఈ దిగ్గజం పేరు వినిపిస్తోంది. దీనిపై అతడు రియాక్ట్ అయ్యాడు. చచ్చినా ఆ జట్టుకు కోచింగ్ ఇవ్వనని స్పష్టం చేశాడు పాంటింగ్.

ఇంగ్లండ్​కే కాదు.. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ఇతర అంతర్జాతీయ జట్టుకు కోచింగ్ ఇవ్వడం కుదరదన్నాడు పాంటింగ్. ఇంగ్లీష్ టీమ్​కు ఆస్ట్రేలియన్ కోచింగ్ ఇవ్వడం అనేది చాలా డిఫరెంట్ ఇష్యూ అన్నాడు. ఇంటర్నేషనల్ టీమ్​కు కోచ్​గా ఉంటే చాలా సమయం జాబ్​లోనే వెళ్లిపోతుందని.. ఫ్యామిలీకి టైమ్ కేటాయించడం కుదరదన్నాడు ఆసీస్ లెజెండ్. టీవీ ఛానళ్లలో కామెంట్రీ కమిట్​మెంట్స్​తో బిజీగా ఉన్నానని తెలిపాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతూ తన కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపలేకపోయానని.. అందుకే ఇప్పుడు ప్రొఫెషనల్ వర్క్ తగ్గించుకొని పర్సనల్ లైఫ్ మీద ఫోకస్ చేస్తున్నానని పేర్కొన్నాడు పాంటింగ్. కాగా, మ్యాథ్యూ మ్యాట్ రాజీనామా చేయడంతో వైట్ బాల్ క్రికెట్​కు కొత్త కోచ్​ కోసం అన్వేషిస్తోంది ఇంగ్లండ్ బోర్డు. ఈ లిస్ట్​లో ఫ్లింటాఫ్ సహా సంగక్కర, ఆండీ ఫ్లవర్ పేర్లు వినిపించాయి. పాంటింగ్ పేరు కూడా వార్తల్లో నలిగింది. అందుకే అతడు క్లారిటీ ఇచ్చాడు.