iDreamPost
android-app
ios-app

కన్నప్ప మ్యాటర్ లో డార్లింగ్ ఫ్యాన్స్ ఏం అంటున్నారంటే..

  • Published Jun 27, 2025 | 4:34 PM Updated Updated Jun 27, 2025 | 4:34 PM

మరో శుక్రవారం వచ్చేసింది. గత వారం కుభేర పుణ్యమా అని థియేటర్స్ కళకళలాడాయి. ఇక ఇప్పుడు కన్నప్ప ఆ జోష్ ను ముందుకు తీసుకుని వెళ్తుంది. మంచు ఫ్యామిలిలో డ్రీమ్ ప్రాజెక్ట్ కు మంచి మార్కులు పడ్డాయి. గత నెల రోజుల నుంచి విష్ణు ఈ సినిమాను జనాల్లోకి తీసుకువెళ్ళడానికి విశ్వ ప్రయత్నాలు చేసాడు. ఎన్నో ఇంటర్వూస్ ఇచ్చాడు. ఫైనల్ గా అతని కష్టం ఫలించింది

మరో శుక్రవారం వచ్చేసింది. గత వారం కుభేర పుణ్యమా అని థియేటర్స్ కళకళలాడాయి. ఇక ఇప్పుడు కన్నప్ప ఆ జోష్ ను ముందుకు తీసుకుని వెళ్తుంది. మంచు ఫ్యామిలిలో డ్రీమ్ ప్రాజెక్ట్ కు మంచి మార్కులు పడ్డాయి. గత నెల రోజుల నుంచి విష్ణు ఈ సినిమాను జనాల్లోకి తీసుకువెళ్ళడానికి విశ్వ ప్రయత్నాలు చేసాడు. ఎన్నో ఇంటర్వూస్ ఇచ్చాడు. ఫైనల్ గా అతని కష్టం ఫలించింది

  • Published Jun 27, 2025 | 4:34 PMUpdated Jun 27, 2025 | 4:34 PM
కన్నప్ప మ్యాటర్ లో డార్లింగ్ ఫ్యాన్స్ ఏం అంటున్నారంటే..

మరో శుక్రవారం వచ్చేసింది. గత వారం కుభేర పుణ్యమా అని థియేటర్స్ కళకళలాడాయి. ఇక ఇప్పుడు కన్నప్ప ఆ జోష్ ను ముందుకు తీసుకుని వెళ్తుంది. మంచు ఫ్యామిలిలో డ్రీమ్ ప్రాజెక్ట్ కు మంచి మార్కులు పడ్డాయి. గత నెల రోజుల నుంచి విష్ణు ఈ సినిమాను జనాల్లోకి తీసుకువెళ్ళడానికి విశ్వ ప్రయత్నాలు చేసాడు. ఎన్నో ఇంటర్వూస్ ఇచ్చాడు. ఫైనల్ గా అతని కష్టం ఫలించింది. మొదటి షో నుంచే పోజిటిక్ టాక్ మొదలైంది. ఇక సినిమాకు మెయిన్ అసెట్ ప్రభాస్. చాలామంది ఈ సినిమా చూడడానికి ముఖ్య కారణం ప్రభాస్ ఏ అని అంతా అంటున్నారు.

మంచు విష్ణునే మెయిన్ హీరో.. కథ , కథనం అన్నీ బావున్నాయి. కానీ అరగంటకు పైగా ఉన్న డార్లింగ్ క్యామియో ప్రేక్షకులను ఇంకాస్త అట్ట్రాక్ట్ చేస్తుంది. కంప్లీట్ శాటిస్ఫాక్షన్ తో ప్రేక్షకులు థియేటర్స్ నుంచి బయటకు వస్తూన్నారు. ఇంకా చెప్పాలంటే సినిమాలోని చిన్న చిన్న లోపాలు ప్రభాస్ పాత్ర , క్లైమాక్స్ తో కవర్ అయిపోయాయని అంటున్నారు. ఉన్నంతలో ప్రభాస్ మాత్రం ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టేశాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటివరకు అయితే సినిమాకు మంచి రెస్పాన్స్ దక్కుతుంది. మరి దానికి మెయిన్ కారణం ప్రభాస్ ఆ కథ అనే సంగతి పక్కన పెడితే.. దర్శకుడు మాత్రం ఉన్న భారీ తారాగణానికి పూర్తి న్యాయం చేసాడు.

ఎక్కడా కూడా ఎవరి పాత్రను తగ్గించకుండా.. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అనేది లేకుండా అన్ని పాత్రలకు సమన్యాయం చేసాడు. కంప్లీట్ డివోషనల్ సినిమానే అయినా దీనికి కమర్షియల్ హంగులు కూడా జోడించారు మేకర్స్. ప్రతి ఒక్కరు సెకండ్ హాఫ్ గురించే ఎక్కువ పాజిటివ్ గా చెప్తున్నారు. ప్రభాస్ ఉన్నది కూడా సెకండ్ హాఫ్ లోనే. మరి క్రౌడ్ పుల్లింగ్ లో ప్రభాస్ రోల్ ఎంతవరకు సాయపడుతుంది అనేది చూడాలి. కాకపోతే ఫ్యాన్స్ మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ముందు ముందు సినిమా ఎలాంటి టాక్స్ , కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş