SNP
Graham Thorpe, England, ECB: స్టార్ బ్యాటర్‌గా కొన్నేళ్ల అంతర్జాతీయ క్రికెట్‌కు సేవలు అందించిన ఓ దిగ్గజ క్రికెటర్ తాజాగా కన్నుమూశారు. ఆయన గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Graham Thorpe, England, ECB: స్టార్ బ్యాటర్‌గా కొన్నేళ్ల అంతర్జాతీయ క్రికెట్‌కు సేవలు అందించిన ఓ దిగ్గజ క్రికెటర్ తాజాగా కన్నుమూశారు. ఆయన గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక వెలుగు వెలిగిన దిగ్గజ మాజీ క్రికెటర్ గ్రాహం థోర్ప్ మృతిచెందాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. గ్రాహం థోర్ప్ మృతి దిగ్భ్రాంతి కలిగించిందని, అతని మృతి క్రీడా ప్రపంచానికి తీరని లోటని పేర్కొంది. 55 ఏళ్ల గ్రాహం థోర్ప్.. గత రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ.. సోమవారం ఉదయం కన్నుమూసినట్లు ఈసీబీ వెల్లడించింది. గ్రాహం థోర్ప్.. చాలా కాలం పాటు ఇంగ్లండ్ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించి.. మంచి బ్యాటర్‌గా గుర్తింపు తెచ్చకున్నాడు.
1969 ఆగస్ట్ 1న ఇంగ్లండ్‌లోని సర్రేలో జన్మించిన థోర్ప్ పూర్తి పేరు గ్రాహం పాల్ థోర్ప్. 1993 మే 19న ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చాడు థోర్ప్. ఆ వెంటనే అదే ఏడాది జులైలో 1న ఆస్ట్రేలియాతో ప్రారంభమైన టెస్ట్ మ్యాచ్‌తో సంప్రదాయ క్రికెట్‌లోకి కూడా అడుగుపెట్టాడు. 1993 నుంచి 2005 మధ్యకాలంలో ఇంగ్లండ్ తరపున 100 టెస్టులు ఆడిన థోర్ప్, ఇంగ్లండ్‌కు కొంతకాలం బ్యాటింగ్ కోచ్‌గా కూడా పనిచేశాడు. 2022లో ఆఫ్ఘనిస్తాన్ హెడ్ కోచ్‌గా అపాయింట్ అయిన కొద్ది రోజులకే తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. అప్పటి నుంచి తిరిగి కోలుకోలేదు.
తన కెరీర్‌లో మొత్తం 100 టెస్టుల ఆడిన థోర్ప్ 179 ఇన్నింగ్స్‌ల్లో 44.66 యావరేజ్‌తో 6744 పరుగులు చేశాడు. అలాగే 82 వన్డేల్లో 2380 పరుగులు సాధించాడు. టెస్టుల్లో 16 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే 341 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 21937 పరుగులు చేశాడు. అందులో 49 సెంచరీలు, 122 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 354 లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో 10871 పరుగులు.. 9 సెంచరీలు, 80 హాఫ్ సెంచరీలు సాధించాడు. మరో విశేషం ఏంటంటే.. ఈ టీ20లు కూడా ఆడాడు. 5 టీ20ల్లో 95 పరుగులు చేశాడు. అందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది. అయితే అవి ఇంటర్నేషనల్ టీ20లు కాదు. దేశవాళి టీ20 మ్యాచ్‌లు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఇంగ్లండ్ డొమెస్టింగ్ క్రికెట్‌లో అద్భుతమైన స్టాట్స్ ఉన్న దిగ్గజ క్రికెటర్ అనంతలోకాలకు వెళ్లిపోవడంతో క్రికెట్ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.
It is with great sadness that we share the news that Graham Thorpe, MBE, has passed away.
There seem to be no appropriate words to describe the deep shock we feel at Graham’s death. pic.twitter.com/VMXqxVJJCh
— England and Wales Cricket Board (@ECB_cricket) August 5, 2024