Nidhan
Dawid Malan Retires From International Cricket: ఓ ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు అనౌన్స్ చేశాడు.
Dawid Malan Retires From International Cricket: ఓ ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు అనౌన్స్ చేశాడు.
Nidhan
ఇంగ్లండ్ జట్టులోని ఓ స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక నుంచి అంతర్జాతీయ క్రికెట్లో ఆడనని అనౌన్స్ చేశాడు. లిమిటెడ్ ఓవర్స్ స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న ఆ ప్లేయర్ రిటైర్మెంట్ ప్రకటనతో అందరూ షాక్ అవుతున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఉన్న నేపథ్యంలో అతడు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడని అంతా ఆలోచనల్లో పడ్డారు. ఇంతకీ రిటైర్మెంట్ ప్రకటించిన ఆ క్రికెటర్ మరెవరో కాదు.. స్టార్ బ్యాటర్ డేవిడ్ మలన్. ఒకప్పుడు టీ20 క్రికెట్లో వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్‌గా హవా నడిపించిన మలన్.. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. ఈ మేరకు ఓ ప్రకటన చేశాడు.
ఇంగ్లండ్‌కు ఆడాలనే తన డ్రీమ్ నెరవేరినందుకు సంతోషంగా ఉందని.. ఈ జర్నీలో తనకు సహకరించిన వారందరికీ మలన్ థ్యాంక్స్ చెప్పాడు. లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్లో తాను అంచనాలకు అనుగుణంగా రాణించానని.. ఆ విషయంలో ఫుల్ హ్యాపీగా ఉన్నానని తెలిపాడు. అయితే టెస్టుల్లో సరిగ్గా పెర్ఫార్మ్ చేయకపోవడం ఒక్కటే బాధగా ఉందని.. ఆ ఫార్మాట్లో ఛాన్సులు వచ్చినా బాగా ఆడలేకపోయానని విచారం వ్యక్తం చేశాడు. ఇక, జులై 27, 2017లో సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు డేవిడ్ మలన్. అప్పటి నుంచి ఏడేళ్ల కెరీర్లో 22 టెస్టుల్లో 1074 పరుగులు చేశాడు. వన్డేల్లో 30 మ్యాచుల్లో కలిపి 1450 పరుగులు, టీ20ల్లో 62 మ్యాచుల్లో 1892 పరుగులు చేశాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 8 సెంచరీలు బాదాడు.
ఒకదశలో టీ20ల్లో వరుసగా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్‌గా అవతరించాడు మలన్. ఆ తర్వాత అదే స్థాయి ప్రదర్శన చేయలేకపోయాడు. వన్డే ప్రపంచ కప్-2023 తర్వాత 50 ఓవర్ల ఫార్మాట్లో మళ్లీ అతడికి ఆడే అవకాశం రాలేదు. సెలెక్టర్లు అతడికి బదులు యంగ్‌స్టర్స్‌కు ఛాన్సులు ఇస్తూ పోయారు. దీంతో నిరాశతో మలన్ రిటైర్మైంట్ ప్రకటించాడని తెలుస్తోంది. ఆల్రెడీ వన్డేల్లో పక్కనబెట్టడంతో ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఎలాగూ ఛాన్స్ దక్కదనే ఉద్దేశంతో ఆ టోర్నీకి ముందే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడని సమాచారం. మలన్‌కు ప్రస్తుతం 37 ఏళ్లు. వయసు కూడా అతడి రిటైర్మెంట్ డెసిషన్‌కు ఓ కారణమని తెలుస్తోంది. ఏదేమైనా కొన్నేళ్ల పాటు ఇంటర్నేషనల్ క్రికెట్లో సత్తా చాటిన, నంబర్ వన్ ర్యాంక్‌లో కొనసాగిన బ్యాటర్ నిష్క్రమించాడు. మరి.. మలన్ ఇంకొన్నాళ్లు ఆడాల్సిందా? లేదా సరైన సమయంలోనే రిటైర్మెంట్ ప్రకటించాడా? మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
🚨 FORMER NO.1 RANKED T20I BATTER – DAWID MALAN RETIRES FROM INTERNATIONAL CRICKET. 🚨 pic.twitter.com/gvvb6xvh3g
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 28, 2024