iDreamPost
android-app
ios-app

దృశ్యం 3.. ఇలా వర్క్ అవుట్ అవుతుందా !

  • Published Jun 24, 2025 | 4:27 PM Updated Updated Jun 24, 2025 | 4:27 PM

మలయాళ దర్శకుడు క్రియేట్ చేసిన సూపర్ సస్పెన్స్ సిరీస్ దృశ్యం. ఇప్పటి వరకు దృశ్యం రెండు పార్ట్శ్ మంచి సక్సెస్ ను అందుకున్నాయి. ఒరిజినల్ వెర్షన్ లో మోహన్ లాల్ నటించారు. ఇక తెలుగులో విక్టరీ వెంకటేష్ , హిందిలో అజయ్ దేవ్ గన్ నటించి ఈ సినిమాను అన్ని వెర్షన్స్ లోను సక్సెస్ చేశారు.

మలయాళ దర్శకుడు క్రియేట్ చేసిన సూపర్ సస్పెన్స్ సిరీస్ దృశ్యం. ఇప్పటి వరకు దృశ్యం రెండు పార్ట్శ్ మంచి సక్సెస్ ను అందుకున్నాయి. ఒరిజినల్ వెర్షన్ లో మోహన్ లాల్ నటించారు. ఇక తెలుగులో విక్టరీ వెంకటేష్ , హిందిలో అజయ్ దేవ్ గన్ నటించి ఈ సినిమాను అన్ని వెర్షన్స్ లోను సక్సెస్ చేశారు.

  • Published Jun 24, 2025 | 4:27 PMUpdated Jun 24, 2025 | 4:27 PM
దృశ్యం 3.. ఇలా  వర్క్ అవుట్ అవుతుందా !

మలయాళ దర్శకుడు క్రియేట్ చేసిన సూపర్ సస్పెన్స్ సిరీస్ దృశ్యం. ఇప్పటి వరకు దృశ్యం రెండు పార్ట్శ్ మంచి సక్సెస్ ను అందుకున్నాయి. ఒరిజినల్ వెర్షన్ లో మోహన్ లాల్ నటించారు. ఇక తెలుగులో విక్టరీ వెంకటేష్ , హిందిలో అజయ్ దేవ్ గన్ నటించి ఈ సినిమాను అన్ని వెర్షన్స్ లోను సక్సెస్ చేశారు. ఇక ఇప్పుడు ఈ సిరీస్ కు కొనసాగింపుగా దృశ్యం పార్ట్ 3 ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట మేకర్స్. ఆల్రెడీ దృశ్యం 3 కథ కూడా పూర్తయిందట.

అయితే ఈసారి మాత్రం అన్ని భాషలలో ఒకేసారి షూట్ చేసి.. ఒకే డేట్ కు సినిమాను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నాడట జీతూ జోసెఫ్. ‘‘మలయాళంలో నేను రాసిన కథతోనే హిందీ, తెలుగు భాషల్లో దృశ్యం 3 వస్తుంది. ప్రస్తుతం స్క్రిప్ట్‌ పనులు పూర్తయ్యాయి. హీరోల డేట్స్‌ కారణంగా ఈ సినిమాను ఒకే సమయంలో చిత్రీకరించలేకపోవచ్చు. కానీ అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నాం’’ అని అన్నారు జీతూ అన్నారు. దీనిలో వాస్తవం లేకపోలేదు. ఎందుకంటే ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ ఒక్క లాంగ్వేజ్ లో రిలీజ్ అయినా సరే సినిమాలో ట్విస్ట్ లు రివీల్ ముందే రివీల్ అయిపోతూ ఉంటాయి.

సో అందుకే ఈసారి అన్ని భాషల్లో ఒకేసారి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సరే ప్లానింగ్ వరకు బాగానే ఉంది. కానీ అసలు సమస్య ఏంటంటే ఇది అసలు సాధ్యపడే విషయమా అని డౌట్ పడుతున్నారు కొందరు. గతంలో గౌతమ్ మీనన్ ఇలాంటి ప్రయోగం ఒకటి చేసి ఫెయిల్ అయ్యాడు. ఇద్దరు హీరోలతో ఒకేసారి సినిమా తీయడం అంతా ఈజీకాదని అప్పట్లో చెప్పుకొచ్చాడు. పైగా ఒకే సమయంలో రిలీజ్ అంటే అది ఇంకో పెద్ద టాస్క్ అని చెప్పి తీరాలి. మరి దీనిని జీతూ జోసెఫ్ ఎలా వర్క్ అవుట్ అయ్యేలా చేస్తాడో చూడాలి. ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.