iDreamPost
android-app
ios-app

ఆసుపత్రిలో చేరిన క్రికెట్ దిగ్గజం.. పరిస్థితి విషమం!

  • Published Jul 22, 2024 | 10:13 AMUpdated Jul 22, 2024 | 10:13 AM

Geoffrey Boycott: క్రికెట్ రంగంలో ఎన్నో రికార్డులు తన పేరిట లిఖించుకొని అంతర్జాతీయ క్రికెటపై తనదైన ముద్ర వేసిన స్టార్ క్రికెటర్ ఆరోగ్య పరిస్థితి విషమించింది.

Geoffrey Boycott: క్రికెట్ రంగంలో ఎన్నో రికార్డులు తన పేరిట లిఖించుకొని అంతర్జాతీయ క్రికెటపై తనదైన ముద్ర వేసిన స్టార్ క్రికెటర్ ఆరోగ్య పరిస్థితి విషమించింది.

  • Published Jul 22, 2024 | 10:13 AMUpdated Jul 22, 2024 | 10:13 AM
ఆసుపత్రిలో చేరిన క్రికెట్ దిగ్గజం.. పరిస్థితి విషమం!

క్రికెట్ మైదానంలో ప్రత్యర్థులను ముప్పతిప్పలు పెట్టి ఎన్నో రికార్డులు తన పేరుపై నమోదు చేసుకున్న మేటి ఆటగాడు.  ఇటీవల తనకు గొంతు క్యాన్సర్ సోకిందని స్వయంగా ప్రకటించారు. గత కొంత కాలంగా గొంతు క్యాన్సర్ తో ఎంతో బాధపడుతున్నానని.. పలు పరీక్షలు చేసిన తర్వాత తనకు గొంతు క్యాన్సర్ ఉన్న విషయం నిర్ధారణ అయ్యిందని తెలిపారు. అందుకోసం ఆపరేషన్ చేయాల్సి వస్తుందని వైద్యులు తెలిపినట్లు ఆయన వెల్లడించారు. 2002లో క్యాన్సర్ భారిన పడి కోలుకున్నానని.. కానీ ఇప్పడు మళ్లీ వచ్చిందని వాపోయారు. ఇంతకీ ఆ స్టార్ క్రికెటర్ ఎవరు? అసలు ఏం జరిగిందన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

క్రికెట్ గురించి తెలిసిన వారికి ఇంగ్లాండ్ లెజెండ్ క్రికెటర్ సర్ జెఫ్రీ బాయ్‌కాట్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు.ఆయన పేరుపై ఎన్నో రికార్డులు ఉన్నాయి. జెఫ్రీ బాయ్‌కాట్ 1964 లో ఇంగ్లండ్ తరుపున తన మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడటం మొదలు పెట్టారు. ఇంగ్లాండ్ తరుపున 18 ఏళ్లా పాటు ఆడుతూ ఎన్నో అవార్డులు, రివార్డులు గెల్చుకున్నారు. టెస్టుల్లో 22 సెంచరీలు, 42 ఆఫ్ సెంచరీలు చేశారు. అలాంటి మేటి ఆటగాడు ప్రస్తుతం గొంతు క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఈ విషయం ఇటీవల స్వయంగా ప్రకటించారు. గతంలో ఆయనకు క్యాన్సర్ రాగా..ఆపరేషన్ చేయించుకున్నారు. తనకు ఆపరేషన్ అయినా మళ్లీ క్యాన్సర్ వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు బాయ్‌కాట్. 2002లో తనకు తొలుత క్యాన్సర్ సోకిందని.. 35 సార్లు కీమోథెరపీ సెషన్ ల తర్వాత భార్, కూతురు మద్దతులో క్యాన్సర్ ని ఓడించానని తెలిపారు. కానీ మళ్లీ ఆ మహ్మారి తనని వెంటాడుతుందని తెలిపాడు.

Geoffrey boycott hospitalized

జెఫ్రీ బాయ్‌కాట్ ఆరోగ్యం విషమంగా మారింది. కుటుంబ సభ్యుల వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఇటీవలే గొంతు క్యాన్సర్ చికిత్సలో భాగంగా ట్రీట్‌మెంట్ చేయించుకొని వెళ్లారు.. మరోసారి ఆయన ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రికి తీసుకువచ్చి చికిత్స చేయిస్తున్నట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. నిమోనియా కారణంగా ఆరోగ్యం విషమంగా మారిందని జెఫ్రీ కూతురు ఎమ్మా తెలిపారు. ‘మా నాన్న జెఫ్రీ కోలుకోవాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు.. ఆయన బత్రకాలని ఎంతోమంది ఫ్యాన్స్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. దురదృష్టవశాత్తు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. నిమోనియా వల్ల నాన్న తిండి సరిగా తినలేకపోతున్నారు.. కనీసం ద్రవ పదార్ధాలు కూడా తీసుకోలని పరిస్థితి. ప్రస్తుతం వెంటిలేషన్ పై చికిత్స పొందుతున్నారు. ఆయనకు ట్యూబ్ ద్వారా ఆహారం అందిస్తున్నాం, ఆయన బ్రతకాలని దైవాన్ని కోరుకుంటున్నాం’అంటూ సోషల్ మాధ్యమం వేదికగా పోస్ట్ చేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి