iDreamPost
android-app
ios-app

నిహారిక కొణిదెల నిర్మిస్తున్న మూవీలో సంగీత్ శోభన్ తో నయన్ సారిక

  • Published Jun 26, 2025 | 4:09 PM Updated Updated Jun 26, 2025 | 4:14 PM

2024లో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకోవటమే కాదు.. బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. యూత్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించిన ఈ చిత్రం ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అందించిన గద్దర్ అవార్డ్స్‌లో జాతీయ సమైక్యత, అణగారిన వర్గాల సామాజిక అభ్యున్నతిపై తీసిన ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డుతో పాటు చిత్ర దర్శకుడు యదు వంశీకి ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా కూడా అవార్డ్ వచ్చిన విషయం తెలిసిందే.

2024లో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకోవటమే కాదు.. బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. యూత్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించిన ఈ చిత్రం ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అందించిన గద్దర్ అవార్డ్స్‌లో జాతీయ సమైక్యత, అణగారిన వర్గాల సామాజిక అభ్యున్నతిపై తీసిన ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డుతో పాటు చిత్ర దర్శకుడు యదు వంశీకి ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా కూడా అవార్డ్ వచ్చిన విషయం తెలిసిందే.

  • Published Jun 26, 2025 | 4:09 PMUpdated Jun 26, 2025 | 4:14 PM
నిహారిక కొణిదెల నిర్మిస్తున్న మూవీలో సంగీత్ శోభన్ తో నయన్ సారిక

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిహారిక కొణిదెల నిర్మిస్తోన్న సినిమాలో సంగీత్ శోభన్ సరసన హీరోయిన్‌గా నయన్ సారిక

2024లో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకోవటమే కాదు.. బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. యూత్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించిన ఈ చిత్రం ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అందించిన గద్దర్ అవార్డ్స్‌లో జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల సామాజిక అభ్యున్నతిపై తీసిన ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డుతో పాటు చిత్ర దర్శకుడు యదు వంశీకి ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా కూడా అవార్డ్ వచ్చిన విషయం తెలిసిందే. తొలి ప్రయత్నంలోనే అందరినీ మెప్పించిన ఈ సక్సెస్‌ఫుల్ బ్యానర్‌లో ఇప్పుడు రెండో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందనున్న రెండో సినిమాకు మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాల్లో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ప్రతిభావంతుడైన యువ కథానాయకుడు సంగీత్ శోభన్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. సంగీత్ సోలో హీరోగా నటించనున్న తొలి సినిమా ఇదే. ఇది వరకే నిహారిక రూపొందించిన వెబ్ ప్రాజెక్ట్స్‌లో హీరో సంగీత్ శోభన్, డైరెక్టర్ మానస శర్మ భాగమయ్యారు.

ఈ చిత్రంలో సంగీత్ శోభన్ సరసన హీరోయిన్‌గా నయన్ సారిక నటిస్తుంది. ఆయ్, క వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన ఈమె పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నిర్మించిన జీ5 వారి హలో వరల్డ్, సోనీ లివ్ వారి బెంచ్ లైఫ్ వంటి వెబ్ సిరీస్‌ల్లో ద్వారా తెలుగు కి పరిచయం అయ్యారు. ఇంకా ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శీను, సుఖ్వీందర్ సింగ్, అరుణ భిక్షు తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

జీ5తో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ రూపొందించిన వెబ్ సిరీస్ ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’కి మానస శర్మ రచయితగా.. సోనీ లివ్ రూపొందించిన ‘బెంచ్ లైఫ్’కి దర్శకురాలిగా పని చేశారు. తాజాగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌ రూపొందించనున్న ఈ సినిమాతో మానస శర్మ ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్‌గా ఆంగేట్రం చేస్తున్నారు. ఇక సంగీత్ శోభన్ విషయానికి వస్తే ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’లో ప్రధాన పాత్రలో నటించారు. నిహారిక కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రానికి మానస శర్మ కథను అందించగా మహేష్ ఉప్పల కో రైటర్‌గా స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు.

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ప్రొడక్షన్ నెం.2 ( #PEP2 )

నటీనటులు- సంగీత్ శోభన్, నయన్ సారిక, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శీను, సుఖ్వీందర్ సింగ్, అరుణ భిక్షు.
బ్యానర్ – పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్
కథ – మానస శర్మ
స్క్రీన్ ప్లే, డైలాగ్స్ – మహేష్ ఉప్పాల, మానస శర్మ
మ్యూజిక్ – అనుదీప్ దేవ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – మన్యం రమేష్
ప్రొడ్యూసర్ – నిహారిక కొణిదెల
దర్శకత్వం – మానస శర్మ
పి.ఆర్.ఒ – సురేంద్ర కుమార్ నాయుడు – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా)
మార్కెటింగ్ – టికెట్ ఫ్యాక్టరీ

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss