Nidhan
ఇంగ్లండ్ లెజెండ్ ఆండ్రూ ఫ్లింటాఫ్ నయా రోల్లో కనిపించేందుకు రెడీ అవుతున్నాడని తెలిసింది. ఆ టీమ్‌కు కోచ్‌గా వెళ్లేందుకు మాజీ ఆల్‌రౌండర్ సమాయత్తం అవుతున్నాడట.
ఇంగ్లండ్ లెజెండ్ ఆండ్రూ ఫ్లింటాఫ్ నయా రోల్లో కనిపించేందుకు రెడీ అవుతున్నాడని తెలిసింది. ఆ టీమ్‌కు కోచ్‌గా వెళ్లేందుకు మాజీ ఆల్‌రౌండర్ సమాయత్తం అవుతున్నాడట.
Nidhan
ఆండ్రూ ఫ్లింటాఫ్.. 2000వ దశకంలో క్రికెట్లో బాగా మార్మోగిన పేర్లలో ఒకటి. ఈ ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ తక్కువ సమయంలోనే బాగా పాపులర్ అయ్యాడు. భీకర పేస్, స్వింగ్‌తో బౌలింగ్ చేస్తూ బ్యాటర్లకు చుక్కలు చూపించేవాడు ఫ్లింటాఫ్. బాల్‌ను ఇరు వైపులా స్వింగ్ చేస్తూ అపోజిషన్ టీమ్స్‌ను భయపెట్టేవాడు. అదే సమయంలో అవసరమైనప్పుడు బ్యాట్‌తోనూ చెలరేగేవాడు. ధనాధన్ ఇన్నింగ్స్‌లు ఆడుతూ సింగిల్ హ్యాండ్‌తో మ్యాచ్ రిజల్ట్‌ను చూస్తుండగానే మార్చేసేవాడు. గాయాల కారణంగా కెరీర్‌ను సుదీర్ఘ కాలం పొడిగించుకోలేకపోయాడు ఫ్లింటాఫ్. కానీ ఆడినంత కాలం ఇంగ్లండ్ జట్టుకు అంతా తానై నిలిచాడు. యాషెస్ సిరీస్ సహా ఎన్నో కీలక టోర్నమెంట్స్‌లో అదరగొట్టాడు. అలాంటోడు రిటైర్మెంట్ తర్వాత క్రికెటింగ్ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నాడు.
క్రికెట్లోకి మళ్లీ కమ్‌బ్యాక్ ఇస్తున్న ఫ్లింటాఫ్‌కు వరుస అవకాశాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇంగ్లండ్ పాపులర్ లీగ్ అయిన ది హండ్రెడ్‌లో నార్తర్న్ సూపర్ఛార్జర్స్కు కోచ్‌గా ఎంపికయ్యాడీ లెజెండ్. ఈ సీజన్లో ఆ టీమ్‌ను విజేతగా నిలపాలని పట్టుదలతో ఉన్నాడు. ఇంగ్లీష్ టీమ్ కెప్టెన్ బెన్ స్టోక్సే సూపర్ఛార్జర్స్ జట్టుకు సారథిగా ఉన్నాడు. దీంతో వీళ్లిద్దరి కలయికతో టీమ్ ఛాంపియన్‌గా నిలవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ది హండ్రెడ్ లీగ్‌తో ఫ్లింటాఫ్ బిజీగా ఉన్న ఈ తరుణంలో అతడ్ని ఇంగ్లండ్ కోచ్ పదవి ఎంపికకు పరిగణనలోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఆ టీమ్ వైట్ బాల్ కోచ్‌గా ఫ్లింటాఫ్ పేరును ఇంగ్లీష్ బోర్డు ఖాయం చేసిందని బ్రిటీష్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఇంగ్లండ్ వైట్ బాల్ కోచ్ మాథ్యూ మాట్ను తీసేసి అతడి స్థానంలో ఫ్లింటాఫ్ను రీప్లేస్ చేయాలని అ దేశ క్రికెట్ బోర్డు డిసైడ్ అయిందట. గత ఏడాదిన్నర కాలంలో చూసుకుంటే వైట్ బాల్ క్రికెట్లో ఇంగ్లీష్ టీమ్ పెర్ఫార్మెన్స్ పడిపోయింది. వన్డే వరల్డ్ కప్-2023లో లీగ్ దశ దాటలేకపోయిన ఆ టీమ్.. టీ20 ప్రపంచ కప్‌లో సెమీస్ దగ్గరే ఆగిపోయింది. దీంతో కోచ్ మాట్ను తొలగించాలని ఈసీబీ నిర్ణయించుకుందట. అతడి స్థానంలో ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎంతో ఎక్స్‌పీరియెన్స్ ఉన్న ఫ్లింటాఫ్ కరెక్ట్ అని భావిస్తోందట. త్వరలో అతడి పేరును అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. ఈ న్యూస్ తెలిసిన నెటిజన్స్.. ఫ్లింటాఫ్ వస్తే ఇంగ్లండ్ మరింత దూకుడుగా ఆడటం పక్కా అని, ఆ టీమ్‌ను ఆపలేమని అంటున్నారు. మరి.. ఫ్లింటాఫ్ కోచ్‌గా రావాలని మీరు కోరుకుంటున్నట్లయితే కామెంట్ చేయండి.
Andrew Flintoff favourite to become England’s new White Ball coach. (iPaper Sports). pic.twitter.com/aAogW9Un4U
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 25, 2024