Nidhan
WI vs ENG: ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ ఓ అరుదైన ఘనత సాధించాడు. గ్రేటెస్ట్ క్రికెటర్స్ సరసన అతడు చోటు దక్కించుకున్నాడు.
WI vs ENG: ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ ఓ అరుదైన ఘనత సాధించాడు. గ్రేటెస్ట్ క్రికెటర్స్ సరసన అతడు చోటు దక్కించుకున్నాడు.
Nidhan
ప్రస్తుత క్రికెట్లో టాప్ బ్యాటర్లలో ఒకడిగా ఇంగ్లండ్ స్టార్ జో రూట్‌ను చెప్పొచ్చు. కూల్‌గా, కామ్‌గా తన పని తాను చేసుకుపోయే అతడు.. క్రీజులో కుదురుకుంటే మ్యాచ్‌ను ఫినిష్ చేయనిదే వదలడు. అన్ని ఫార్మాట్లలోనూ అదరగొట్టే రూట్.. టెస్ట్ స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఆ ఫార్మాట్లో ఇప్పటికే ఎన్నో మైల్‌స్టోన్స్ చేరుకున్న రూట్.. తాజాగా ఓ క్రేజీ రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో అత్యధిక పరుగులు బాదిన బ్యాటర్లలో ఏడో స్థానానికి అతడు ఎగబాకాడు. ఈ క్రమంలో విండీస్ గ్రేట్ బ్రియాన్ లారా (11,953 పరుగులు)ను అధిగమించాడు.
వెస్టిండీస్‌తో జరుగుతున్న ఆఖరి టెస్టులో రూట్ ఈ రికార్డు క్రియేట్ చేశాడు. ఈ మ్యాచ్‌తో అతడు 11,954 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక రన్స్ బాదిన వారిలో టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ (15,921) ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. రూట్ ఇంకొన్నేళ్ల పాటు ఇదే రీతిలో బ్యాటింగ్ చేస్తే మాస్టర్‌బ్లాస్టర్‌ను దాటే అవకాశాలు ఉంటాయి. అయితే లీడింగ్ రన్ స్కోరర్స్ జాబితాలో రూట్‌కు దరిదాపుల్లో కూడా భారత స్టార్లు విరాట్ కోహ్లీ (8,848), రోహిత్ శర్మ (4,137) లేరు. ఆ లిస్ట్‌లో టాప్-10లోకి వచ్చే ఛాన్స్ ఉన్న విరాట్ రాబోయే కొన్నేళ్ల పాటు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. వన్డే గ్రేట్‌గా ఉన్న కోహ్లీ.. టెస్టుల్లోనూ దిగ్గజాల సరసన నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి.. రూట్ రికార్డును కోహ్లీ అధిగమిస్తాడని మీరు భావిస్తే కామెంట్ చేయండి.
JOE ROOT becomes the 7th leading run-getter in Test history 🤯🔥 pic.twitter.com/ByPA7XMoqp
— Johns. (@CricCrazyJohns) July 27, 2024