Nidhan
Joe Root, Ben Stokes, Champions Trophy 2025, England: టాప్ టీమ్స్‌లో ఒకటైన ఇంగ్లండ్ ఇప్పుడు మరింత స్ట్రాంగ్‌గా మారింది. ఆ జట్టులోకి అరివీర భయంకరులు రావడం ఖాయంగా మారింది. ఛాంపియన్స్ ట్రోఫీపై కన్నేసిన ఇంగ్లీష్ టీమ్ ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉంది.
Joe Root, Ben Stokes, Champions Trophy 2025, England: టాప్ టీమ్స్‌లో ఒకటైన ఇంగ్లండ్ ఇప్పుడు మరింత స్ట్రాంగ్‌గా మారింది. ఆ జట్టులోకి అరివీర భయంకరులు రావడం ఖాయంగా మారింది. ఛాంపియన్స్ ట్రోఫీపై కన్నేసిన ఇంగ్లీష్ టీమ్ ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉంది.
Nidhan
ప్రస్తుత క్రికెట్లో టాప్ టీమ్స్‌లో ఒకటి ఇంగ్లండ్. ముఖ్యంగా లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్లో ఆ జట్టు చాలా డేంజరస్. వన్డే ప్రపంచ కప్-2023లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఇంగ్లీష్ టీమ్.. వరుస ఓటములతో గ్రూప్ దశ నుంచే అవమానకర రీతిలో ఇంటిదారి పట్టింది. రీసెంట్గా జరిగిన టీ20 వరల్డ్ కప్-2024లో సెమీస్ వరకు వచ్చినా భారత్ దెబ్బకు బయటకు వచ్చేసింది. ఈ రెండు టోర్నీల్లో ఆశించిన మేర రాణించకపోయినా ఆ జట్టును తక్కువ అంచనా వేయడానికి లేదు. టీమ్ నిండా భారీ హిట్టర్లు, ఆల్‌రౌండర్లతో కూడిన ఇంగ్లండ్.. వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ మీద కన్నేసింది. ఆ టోర్నీతో తిరిగి క్రికెట్‌ను శాసించాలని చూస్తోంది. ఈ తరుణంలో ఆ జట్టులోకి ఇద్దరు అరివీర భయంకరులు వచ్చేస్తున్నారు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ ఇంగ్లండ్దేనని అంతా అంటున్నారు.
ఇంగ్లండ్ వన్డే జట్టులోకి జో రూట్, బెన్ స్టోక్స్ రావడం దాదాపుగా ఖాయమైంది. ప్రస్తుతం ఈ ఫార్మాట్‌కు దూరంగా ఉంటున్న ఈ ఇద్దరు స్టార్లు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. వన్డే వరల్డ్ కప్ పరాభవం తర్వాత 50 ఓవర్ల ఫార్మాట్‌కు దూరంగా ఉంటున్న స్టోక్స్-రూట్ తిరిగి ఆ ఫార్మాట్లో అడుగు పెట్టకపోవచ్చని అంతా అనుకున్నారు. అయితే ఇంగ్లండ్ సెలెక్టర్ ల్యూక్ రైట్ మాటలతో వీళ్లిద్దరూ వన్డేల్లో ఎంట్రీ ఇవ్వడం పక్కా అని తెలుస్తోంది. త్వరలో జరిగే వెస్టిండీస్, ఆస్ట్రేలియా సిరీస్‌ల్లో సాధ్యమైనంతగా యంగ్ ప్లేయర్లకు అవకాశం కల్పిస్తామని చెప్పిన రైట్.. ఛాంపియన్స్ ట్రోఫీకి మాత్రం బలమైన టీమ్‌తో వెళ్తామని తెలిపాడు. స్టోక్స్-రూట్ ఐసీసీ టోర్నీల కోసం తప్పక తిరిగొస్తారని, తమ టీమ్‌కు వాళ్లిద్దరూ మూలస్తంభాలు లాంటి వాళ్లన్నాడు.
‘ఇంగ్లండ్ క్రికెట్‌కు రూట్ చేసిన సేవలు అంతా ఇంతా కాదు. అతడు తన బెస్ట్ ఇస్తూనే వస్తున్నాడు. మెగా టోర్నమెంట్స్‌లో అతడు తప్పక ఆడతాడు. ఇంగ్లీష్ టీమ్‌కు రూట్ ఎంత కీలకమో మాకు తెలుసు. అతడు క్వాలిటీ స్పిన్ బౌలింగ్ కూడా వేయగలడు. బ్యాట్‌తో పరుగుల వరద పారిస్తూ బాల్‌తో రాణించే వాళ్లు చాలా అరుదు. అందులో రూట్ ఒకడు. అలాంటోడ్ని ఎందుకు వదులుకుంటాం. స్టోక్స్ సేవల్ని అవసరమైనప్పుడు వాడుకుంటాం. అతడు మాకు చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. బలమైన ఆటగాళ్లతో కూడిన టీమ్‌ను ఛాంపియన్స్ ట్రోఫీకి పంపిస్తాం’ అని ల్యూక్ రైట్ చెప్పుకొచ్చాడు.
ఒకవైపు యంగ్ ప్లేయర్లను పరీక్షిస్తూనే రూట్, స్టోక్స్ లాంటి సీనియర్లను కూడా ఫిట్‌గా ఉండేలా చూసుకుంటోది ఇంగ్లీష్ బోర్డు. ఫామ్, ఫిట్నెస్ను బట్టి స్ట్రాంగ్ టీమ్‌ను సిద్ధం చేసుకోవాలనేది వాళ్ల ప్లాన్‌లా కనిపిస్తోంది. రూట్, స్టోక్స్ వన్డేల్లోకి తిరిగొస్తున్నారనేది కన్ఫర్మ్ అవ్వడంతో ఇంక ఛాంపియన్స్ ట్రోఫీ ఇంగ్లండ్దేనని క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు. వాళ్లిద్దరూ ఫామ్‌లో ఉంటే ఇంగ్లీష్ టీమ్‌ను ఆపడం ఎవరి వల్లా కాదని.. ఆ ఫార్మాట్లో వాళ్లు తోపులని అంటున్నారు. కాగా, వన్డే ప్రపంచ కప్-2019లో రూట్ 11 మ్యాచుల్లో కలిపి 556 పరుగులు చేశాడు. ఆ టోర్నీలో స్టోక్స్ 5 హాఫ్ సెంచరీలు బాదడమే గాక 5 వికెట్లు తీశాడు. అందుకే ఈ అరివీర భయంకరులు వస్తున్నారంటే అంతా భయపడుతున్నారు. ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసే వీళ్లు ఫామ్‌లో ఉంటే కప్పు వాళ్లదేనని అంటున్నారు. మరి.. రూట్-స్టోక్స్ కలసి ఇంగ్లండ్‌కు ఇంకో ఐసీసీ ట్రోఫీని అందిస్తారా? మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
Joe Root and Ben Stokes will be considered by England for the 2025 Champions Trophy. (Espncricinfo). pic.twitter.com/r5bybpbZN5
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 28, 2024