మెగాస్టార్ వరసపెట్టి సినిమాలు చేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు గ్యారెంటీ. ఈసారి సంక్రాంతికి సినిమా లాక్ అయ్యింది. ఆర్నెలలు ముందుగానే సంక్రాతికి డేట్ ఫిక్స్ చేశారు చిరంజీవి. బాబీ డైరెక్షన్ తయావుతున్న సినిమాను , వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా “కలుద్దాం సంక్రాంతికి” అనే క్యాప్షన్ తో, జనవరి 2023 అనే ట్యాగ్ లైన్ తో నిర్మాతలు పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమాలో శృతిహసన్ చిరంజీవి పక్కన హీరోయిన్ గా నటిస్తోంది. ఇంకా టైటిల్ […]
బాలయ్యలోని రియల్ యాటిట్యూడ్ ని ఓటీటీ మీదకు తీసుకొచ్చిన క్రేజీ టాక్షో ‘అన్స్టాబుల్ విత్ ఎన్బీకే’(Unstoppable With NBK) ఆహాలో సూపర్ సక్సెస్. గెస్ట్ ఎవరైనా, షో మాత్రం బాలయ్యదే. చురుకుపుట్టించేలా ప్రశ్నలు, మేనరిజం, పంచ్ డైలాగ్స్, అప్పటికప్పుడు వచ్చే కామెడీతో బాలయ్యా నేషనల్ వైడ్ గా అన్స్టాపబుల్ను పాపులర్ చేశారు. స్టార్లను గెస్ట్ లుగా తీసుకొచ్చి, పర్సనల్ నుంచి ఫ్యామిలీ వరకు చాలా విషయాలను రాబట్టారు. సూపర్ హిట్ టాక్తో అన్స్టాపబుల్ షో ముగిసింది. అప్పటి […]
రణబీర్ కపూర్ – అలియా భట్ జంటగా నటిస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ సినిమాని పాన్ ఇండియా సినిమాగా విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడో సెప్టెంబర్ 9న విడుదలకి ముహూర్తం పెట్టుకున్నా ఇప్పటి నుంచే ప్రమోషన్స్ చేస్తుంది. ఈ సినిమా ట్రైలర్ ను జూన్ 15న విడుదల చేయనున్నారు. ఇక బ్రహ్మాస్త్రకి బాలీవుడ్ కాకుండా వేరే భాషల్లో కూడా ప్రమోట్ చేస్తున్నారు. తెలుగులో అయితే ఓ రేంజ్ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు బ్రహ్మాస్త్ర టీం. ఇప్పటికే బ్రహ్మాస్త్ర టీమ్ దర్శకధీరుడు […]
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న భోళా శంకర్ షూటింగ్ అతి త్వరలోనే పునఃప్రారంభం కానుంది. అజిత్ తమిళ బ్లాక్ బస్టర్ వేదాళం రీమేక్ గా రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ మీద డైరెక్టర్ ట్రాక్ రికార్డు వల్ల అభిమానులు ముందు నుంచి టెన్షన్ గానే ఉన్నారు. దానికి తోడు ఇటీవలే ఆచార్య దారుణంగా డిజాస్టర్ కావడంతో దీని మీద అంచనాల బరువు పెరుగుతోంది. గాడ్ ఫాదరే ముందు విడుదలయ్యే అవకాశం ఉన్నప్పటికీ […]
ఏదైనా సినిమా నచ్చిందంటే చాలు. ఆ చిత్ర బృందాన్ని, లేదా హీరోను పిలిచి అభినందిస్తూ ఉంటారు చిరు. ఇక తన మిత్రుడు, లోక నాయకుడైన కమల్ హాసన్ తాజా చిత్రం విక్రమ్ ను చూసిన మెగాస్టార్ ఏకంగా పార్టీతో పాటు కమల్ ను సత్కరించారు. చిరంజీవికి విక్రమ్ సినిమా బాగా నచ్చేసింది. దానికి తోడు సినిమా కూడా బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ కావడంతో ఆ చిత్ర దర్శకుడు లోకేశ్ కనకరాజ్, కమల్ హాసన్ లను పార్టీకి […]
భారీ అంచనాలతో విడుదలై అతి పెద్ద డిజాస్టర్ గా మిగిలిన ఆచార్య ఎఫెక్ట్ రాబోయే మెగా సినిమాల మీద పడుతోంది. చిరంజీవి ఉన్నంత మాత్రాన టాక్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులు గుడ్డిగా ఓపెనింగ్స్ ఇవ్వరని అర్థమైపోయింది. ఆఖరికి రామ్ చరణ్ క్రేజ్ కూడా ఆచార్యకు కొంచెం కూడా ఉపయోగపడకపోవడం షాక్ కలిగించే అంశం. సుమారు 80 కోట్ల దాకా నష్టం మూటగట్టుకున్న ఆచార్య ఓన్లీ తెలుగు వెర్షన్ ప్రకారం బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. అజ్ఞాతవాసి, […]
నిర్మాణ సంస్థ ఇంకా అధికారికంగా చెప్పలేదు కానీ బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా పేరు వాల్తేరు వీరయ్యగా చిరంజీవి ఆచార్య ప్రమోషనల్ ఇంటర్వ్యూలో చెప్పేశారు. దానికి సంబంధించిన కొంత భాగం షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. ప్రస్తుతం మెగాస్టార్ వెకేషన్ బ్రేక్ కోసం అమెరికా వెళ్లగా టీమ్ మిగిలిన పనుల్లో బిజీగా ఉంది. ఇందులో రవితేజ ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. క్యామియో అనలేని ఎక్కువ లెన్త్ తో దీన్ని చాలా పవర్ ఫుల్ గా […]
ఒక మెగాస్టార్ సినిమా వారం తిరక్కుండానే వాషవుట్ అయిపోవడం అభిమానులకే కాదు మొత్తం కొణిదెల టీమ్ కే పెద్ద షాక్. ఆచార్య రన్ దాదాపు ఫైనల్ కు వచ్చేసింది. ఎక్కడా కనీసం సగం థియేటర్లు నిండని పరిస్థితి కనిపిస్తోంది. అగ్రిమెంట్ల ప్రకారం రెండో వారం కంటిన్యూ చేయడం తప్ప ట్రేడ్ కు రెవిన్యూ మీద పెద్ద నమ్మకం లేదు. దానికి తోడు హైదరాబాద్ లాంటి నగరాల్లో సెకండ్ వీక్ లో కేవలం యాభై రూపాయలు మాత్రమే ధర […]
వారం తిరక్కుండానే ఆచార్య ఫైనల్ రన్ కు రావడమనేది మెగాస్టార్ గా మారాక చిరంజీవి కెరీర్ లో ఇదే మొదటిసారని చెప్పొచ్చు. ఫస్ట్ వీక్ లో రంజాన్ హాలిడే ఉన్నప్పటికీ కనీసం హౌస్ ఫుల్స్ చేసుకోలేనంత దారుణమైన పొజిషన్ కి పడిపోయింది. మొత్తం థియేట్రికల్ గా కలిగిన నష్టం 80 కోట్లకు పైగానే ఉండొచ్చని, డబ్బింగ్ లేకుండా ఒక స్ట్రెయిట్ తెలుగు మూవీకి సంబంధించి ఇదే అతి పెద్ద డిజాస్టరని ట్రేడ్ పేర్కొంటోంది. రాధే శ్యామ్ లాస్ […]
ఇప్పుడంటే జానీ, శేఖర్, ప్రేమ్ రక్షిత్ మాస్టర్లంటూ కొత్త జెనరేషన్ కి వీళ్ళే గుర్తున్నారు కానీ ఒకప్పుడు వన్ అండ్ ఓన్లీ ప్రభుదేవా అనే పేరు సౌత్ మొత్తం మారుమ్రోగిపోయింది. ముఖ్యంగా చిరంజీవి లాంటి హీరోలతో డాన్స్ లో కొత్త ఒరవడిని తీసుకొచ్చింది ఈయనే. ప్రేమికుడు బ్లాక్ బస్టర్ తో హీరోగా కూడా తన సత్తాను ఋజువు చేసుకున్న ప్రభుదేవా తర్వాతి కాలంలో నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి లాంటి సినిమాలతో దర్శకుడిగానూ ఒక ముద్రవేయగలిగారు. అప్పటి నుంచి […]