iDreamPost
android-app
ios-app

Chiranjeevi: మత్తు వదలరా 2పై మెగాస్టార్, మహేశ్ బాబు రివ్యూ! ఏమన్నారంటే?

  • Published Sep 15, 2024 | 11:16 AM Updated Updated Sep 15, 2024 | 11:16 AM

Chiranjeevi and Mahesh Babu tweets on Mathu Vadalara 2: మత్తు వదలరా 2 మూవీ చూసిన మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేశ్ బాబు తమ అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఆ సినిమా చూసి వారు ఏమన్నారంటే?

Chiranjeevi and Mahesh Babu tweets on Mathu Vadalara 2: మత్తు వదలరా 2 మూవీ చూసిన మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేశ్ బాబు తమ అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఆ సినిమా చూసి వారు ఏమన్నారంటే?

Chiranjeevi: మత్తు వదలరా 2పై మెగాస్టార్, మహేశ్ బాబు రివ్యూ! ఏమన్నారంటే?

‘మత్తు వదలరా 2’ ప్రస్తుతం థియేటర్లలో నవ్వుల వర్షంతో పాటుగా కలెక్షన్ల వర్షం కూడా కురిపిస్తోంది. శ్రీ సింహ, సత్య లీడ్ రోల్స్ లో నటించిన ఈ చిత్రం పాజిటీవ్ టాక్ తో దూసుకెళ్తోంది. డైరెక్టర్ రితేష్ రానా తన టేకింగ్ తో మరోసారి ప్రశంసలు అందుకుంటున్నాడు. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులతో పాటుగా సెలబ్రిటీలను కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ మూవీని చూసిన మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేశ్ బాబు తమ అభిప్రాయాలను ట్విట్టర్  వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ట్విట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కీరవాణి కొడుకు శ్రీ సింహ, కమెడియన్ సత్య కీలక పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘మత్తు వదలరా 2’. కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం థియేటర్ల దగ్గర సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. శ్రీ సింహ, సత్య ల కామెడీకి ఆడియెన్స్ పడి పడి నవ్వుతున్నారు. ఇక ఈ సినిమాను ప్రేక్షకులతో పాటుగా చూసిన సెలబ్రిటీలు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ మూవీని చూశారు. సినిమా అద్భుతంగా ఉందని, కామెడీతో కడుపుబ్బా నవ్వించారని ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఈ స్టార్ హీరోలు చేసిన ట్విట్స్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి.

“నిన్ననే మత్తు వదలరా 2 మూవీ చూశాను. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో మెుదటి నుంచి చివరి దాకా ఇంతలా నవ్వించిన చిత్రాన్ని నేను చూడలేదు. ఎండ్ టైటిల్స్ ను కూడా వదలకుండా చూశాను. ఈ క్రెడిట్ అంతా డైరెక్టర్ రితేష్ రానాకే ఇవ్వాలి. అతడి రాత, తీత, కోత, మోత ఇలా ప్రతీది చాలా చక్కగా హ్యాండిల్ చేశాడు. అందుకు అతడిని అభినందించకుండా ఉండలేము.. హ్యాట్సాఫ్ రితేష్ రానా. శ్రీ సింహ, సత్య, ఫరియా అబ్దుల్లా, కాలభైరవలకు నా ప్రత్యేక అభినందనలు. అలాగే మైత్రీ మూవీ మేకర్స్, టీమ్ మెుత్తానికి నా కంగ్రాట్స్. ఈ సినిమాను అస్సలు మిస్ కావొద్దు. 100 శాతం కామెడీ ఎంటర్ టైనర్ ఈ చిత్రం” అని మత్తు వదలరా 2 టీమ్ ను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు మెగాస్టార్.

ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్వీట్ చేస్తూ..”మత్తు వదలరా 2 మూవీ చాలా ఎంటర్ టైనింగ్ గా ఉంది. సినిమా మెుత్తం చాలా ఎంజాయ్ చేస్తూ చూశాం. ఇక వెన్నెల కిశోర్ స్క్రీన్ మీద కనిపించినంత సేపు నా కూతురు నవ్వు ఆపుకోలేకపోయింది. కిశోర్, సత్య పండించిన కామెడీకి నవ్వకుండా ఉండలేకపోయాం. శ్రీ సింహ అద్భుతంగా నటించాడు. టీమ్ మెుత్తానికి నా అభినందనలు” అంటూ ప్రశంసించాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఇదిలా ఉండగా.. ఈ మూవీ సక్సెస్ మీట్ లో డైరెక్టర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. పార్ట్ 2కి వచ్చిన సూపర్ రెస్సాన్స్ ను చూసి త్వరలోనే పార్ట్ 3 రూపొందించేందుకు ప్లాన్ చేస్తామని రితేష్ రానా చెప్పుకొచ్చాడు.

marsbahis giriş