iDreamPost
android-app
ios-app

చిరు సినిమాలు ఒకటి జెట్ స్పీడ్.. మరొకటి స్లో టెక్

  • Published Jul 09, 2025 | 11:39 AM Updated Updated Jul 09, 2025 | 11:39 AM

చిరంజీవి సినిమాలంటే అభిమానులు చొక్కాలు చించేసుకుంటారు. ఒకప్పటి చిరు సినిమాలకు ఇప్పుడు చిరు సినిమాలకు చాలా డిఫరెన్స్ ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ లో చిరు నుంచి ఓ బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురుచుస్తూనే ఉన్నారు ప్రేక్షకులు. విశ్వంభర అనౌన్స్ చేసి చాలా కాలం అయింది.

చిరంజీవి సినిమాలంటే అభిమానులు చొక్కాలు చించేసుకుంటారు. ఒకప్పటి చిరు సినిమాలకు ఇప్పుడు చిరు సినిమాలకు చాలా డిఫరెన్స్ ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ లో చిరు నుంచి ఓ బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురుచుస్తూనే ఉన్నారు ప్రేక్షకులు. విశ్వంభర అనౌన్స్ చేసి చాలా కాలం అయింది.

  • Published Jul 09, 2025 | 11:39 AMUpdated Jul 09, 2025 | 11:39 AM
చిరు సినిమాలు ఒకటి జెట్ స్పీడ్.. మరొకటి స్లో టెక్

చిరంజీవి సినిమాలంటే అభిమానులు చొక్కాలు చించేసుకుంటారు. ఒకప్పటి చిరు సినిమాలకు ఇప్పుడు చిరు సినిమాలకు చాలా డిఫరెన్స్ ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ లో చిరు నుంచి ఓ బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురుచుస్తూనే ఉన్నారు ప్రేక్షకులు. విశ్వంభర అనౌన్స్ చేసి చాలా కాలం అయింది. అసలు ఇప్పటికి ఆ మూవీ రిలీజ్ అయ్యి ఎదో ఒక రిజల్ట్ వచ్చి ఉండాలి. కానీ అదిగో ఇదిగో అంటూ ఆ సినిమా ఊసే లేకుండా చేస్తున్నారు. ఇదిలా ఉంటె మరో వైపు అనిల్ రావిపూడి మాత్రం సినిమాను జెట్ స్పీడ్ లో ముందుకు తీసుకుని వెళ్తున్నాడు. అసలు సినిమా పేరేంటి ఎప్పుడు రిలీజ్ అవుతుంది.. ఇలాంటి అప్డేట్స్ ఏమి రాకముందే ఓటిటి డీల్ ను కూడా క్లోజ్ చేసుకున్నట్లు తెలుస్తుంది.

ఇప్పటికైతే ఓటిటి డీల్ దాదాపు 60 కోట్ల వరకు బేరం జరుగుతున్నట్లు సమాచారం. అమెజాన్ ప్రైమ్ ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ.. చర్చలైతే కొనసాగుతున్నాయట. అసలు షూటింగ్ కంప్లీట్ గా పూర్తికాకముందే ఈ రేంజ్ లో బిజినెస్ డీల్స్ జరగడం విశేషం. దీనిని బట్టే అర్థంచేసుకోవచ్చు.. అనిల్ బ్రాండ్ మార్కెట్ లో ఏ రేంజ్ లో ఉందో. ఇక విశ్వంభర విషయానికొస్తే.. అది కూడా కొద్దీ రోజుల క్రితం సేల్ అయిందని అంటున్నారు. నిజానికి ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడే ఓటిటి డీల్ హాట్ కేకుల్లా అమ్ముడు పోవాలి. కానీ అంత బజ్ రాలేదు. కానీ ఇప్పుడు ఈ మెగా 157 మాత్రం అటు షూటింగ్ లోను.. ఇటు బిజినెస్ డీల్ లోను జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది.

ఇక ఈ రెండు సినిమాల విడుదల తేదీల విషయానికొస్తే.. మెగా 157 వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ విశ్వంభర మాత్రం ఎప్పుడొస్తుందో ఎవరికీ ఎలాంటి క్లారిటీ లేదు. సెప్టెంబర్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే దానిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇలా ఒకేసారి రెండు సినిమాలతో చిరంజీవి ప్రేక్షకులను ఊరిస్తున్నాడు. బహుశా గతంలో ఎప్పుడు చిరు సినిమాలకు ఇలా జరగలేదేమో. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.