iDreamPost
android-app
ios-app

విశ్వంభర లో ‘ఆట కావాలా పాట కావాలా’ మ్యాజిక్ !

  • Published Jul 09, 2025 | 4:50 PM Updated Updated Jul 09, 2025 | 4:50 PM

మెగాస్టార్ అభిమానులకు విశ్వంభర చూడడం తీరని కలల మిగిలిపోయింది. ఇప్పటికే సినిమా చాలా సార్లు రీలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయింది. సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదనే టాక్ కూడా ఉంది. ఈ సినిమాకు సంబంధించి ఇంకా ఒక్క ఐటెం సాంగ్ బాలన్స్ ఉందట. దానికోసం మౌని రాయ్ ని సంప్రదించినట్లు తెలుస్తుంది. కానీ ఇంకా ఎలాంటి అఫీషియల్ అప్డేట్ రాలేదు.

మెగాస్టార్ అభిమానులకు విశ్వంభర చూడడం తీరని కలల మిగిలిపోయింది. ఇప్పటికే సినిమా చాలా సార్లు రీలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయింది. సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదనే టాక్ కూడా ఉంది. ఈ సినిమాకు సంబంధించి ఇంకా ఒక్క ఐటెం సాంగ్ బాలన్స్ ఉందట. దానికోసం మౌని రాయ్ ని సంప్రదించినట్లు తెలుస్తుంది. కానీ ఇంకా ఎలాంటి అఫీషియల్ అప్డేట్ రాలేదు.

  • Published Jul 09, 2025 | 4:50 PMUpdated Jul 09, 2025 | 4:50 PM
విశ్వంభర లో ‘ఆట కావాలా పాట కావాలా’ మ్యాజిక్ !

మెగాస్టార్ అభిమానులకు విశ్వంభర చూడడం తీరని కలల మిగిలిపోయింది. ఇప్పటికే సినిమా చాలా సార్లు రీలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయింది. సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదనే టాక్ కూడా ఉంది. ఈ సినిమాకు సంబంధించి ఇంకా ఒక్క ఐటెం సాంగ్ బాలన్స్ ఉందట. దానికోసం మౌని రాయ్ ని సంప్రదించినట్లు తెలుస్తుంది. కానీ ఇంకా ఎలాంటి అఫీషియల్ అప్డేట్ రాలేదు. అయితే ఈ సినిమాలో ఓ కొత్త సాంగ్ కాకుండా చిరంజీవి ఓల్డ్ మూవీస్ లోని ఓ ఐకానిక్ సాంగ్ ను రీమిక్స్ చేయనున్నారట. అదే అన్నయ్య సినిమాలోని ‘ఆట కావాలా పాట కావాలా’ సాంగ్.

ఇప్పటివరకు చిరు సినిమాలోని పాటలను మిగిలిన హీరోలు రీమేక్ చేయడమే చూసాము. కానీ మొదటి సారి చిరంజీవినే తన సినిమాలోని పాటను రీమిక్స్ చేయనున్నారు. కాబట్టి ఆటోమాటిక్ గా హిట్ అయిపోతుంది. అని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే అప్పటి ఐటెం సాంగ్స్ కు ఇప్పటికి ఐటెం సాంగ్స్ కు ఎలాంటి వేరియేషన్స్ వచ్చాయో చూస్తూనే ఉన్నాము. పైగా అది పాతికేళ్ల క్రితం నాటి పాట. అప్పటి చిరు కి ఇప్పటికి చిరు కి కూడా డిఫరెన్స్ వచ్చింది. ఇప్పుడు అదే పాటను ఆయన అదే స్టైల్ లో కనుక రీక్రియేట్ చేయలేదంటే సోషల్ మీడియా వీక్షకులు.. పాయింట్ అవుట్ చేయడానికి రెడీగా ఉంటారు. సో ఇది కొంచెం రిస్క్ తో కూడుకున్న పాయింట్ అని చెప్పి తీరాల్సిందే.

అసలే ఈ సినిమా మీద మెల్ల మెల్లగా హోప్స్ వదిలేసుకుంటున్నారు ప్రేక్షకులు. దీని తర్వాత స్టార్ట్ అయినా మెగా157 కూడా జెట్ స్పీడ్ లో దూసుకుపోవడం ఇంకో కారణం. సో విశ్వంభర ఎప్పుడు వస్తుందో ఎలా ఉంటుందో.. చిరుకి ఈ సినిమా ఎలాంటి పేరు తెచ్చిపెడుతుందో అనే టెన్షన్ కూడా అభిమానులలో ఉంది. ఇక ఇప్పుడు ఈ ఐటెం సాంగ్ రిక్రియేషన్ ఇంకో రిస్క్ ఫ్యాక్టర్. కొత్త ట్యూన్ ను కంపోజ్ చేసే టైం లేకపోవడంతో ఈ డెసిషన్ తీసుకుంటున్నట్లు టాక్ నడుస్తుంది. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.