iDreamPost
android-app
ios-app

ఈ ఫోటోలో ఉన్న చిన్నోడు ఇప్పుడు యంగ్ హీరో.. మెగా ఫ్యామిలీ మాత్రం కాదు

  • Published Sep 06, 2024 | 5:09 PM Updated Updated Sep 06, 2024 | 5:09 PM

మెగాస్టార్ చిరంజీవి గట్టిగా హగ్ చేసుకున్న ఈ చిన్నోడు ఎవరో తెలుసా... ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో. మెగా ఫ్యామిలీ అనుకుంటున్నారామో కానే కాదు.. ఇంతకు ఆ పిల్లోడు ఎవరంటే..?

మెగాస్టార్ చిరంజీవి గట్టిగా హగ్ చేసుకున్న ఈ చిన్నోడు ఎవరో తెలుసా... ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో. మెగా ఫ్యామిలీ అనుకుంటున్నారామో కానే కాదు.. ఇంతకు ఆ పిల్లోడు ఎవరంటే..?

  • Published Sep 06, 2024 | 5:09 PMUpdated Sep 06, 2024 | 5:09 PM
ఈ ఫోటోలో ఉన్న చిన్నోడు ఇప్పుడు యంగ్ హీరో.. మెగా ఫ్యామిలీ మాత్రం కాదు

చిరంజీవి గట్టిగా హగ్ చేసుకున్న ఈ పిల్లాడు ఎవరో తెలుసా..? మెగా వారసుడు కాదు. అయినప్పటికీ తనకు కొడుకులాంటి వాడే. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు గట్టి ప్రయత్నం చేస్తున్న కుర్ర హీరో. చైల్ట్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. అమ్మాయిల యువ రాకుమారుడిగా మారిన ఇతడు.. టాలీవుడ్ హృతిక్ రోషన్. ఇప్పటికే అర్థమైంది కదా ఎవరో. ఒకప్పటి హ్యాండ్సమ్ హీరో శ్రీకాంత్, నటి ఊహాల తనయుడు రోషన్. అన్నయ్యతో తన కుమారుడు అంటూ గతంలో శ్రీకాంత్ ఈ ఫోటోలను షేర్ చేసుకున్నాడు. గుణ శేఖర్ రుద్రమ దేవి చిత్రంతో బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో.. ప్రస్తుతం అమ్మాయిల క్రష్. తన అందంతో, నవ్వుతో మెస్మరైజ్ చేస్తుంటాడు రోషన్.

శ్రీకాంత్, ఊహా అందాన్నే కాదు నటనను పుణికి పుచ్చుకున్నాడు రోషన్. చదువులు పూర్తయ్యాక.. నటనపై ఆసక్తి కనబరుస్తుండటంతో ముంబయిలో నటనలో ట్రైనింగ్ ఇచ్చారు. ఆ తర్వాత అమెరికా వెళ్లి అక్కడ శిక్షణ తీసుకున్నాడు. నటనలోకి రాకముందు బాలీవుడ్ చిత్రాల్లో అసిస్టెంట్ డైరెక్టరుగా కూడా వర్క్ చేశాడు. నిర్మల కాన్వెంట్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాకు బెస్ట్ డెబ్యూట్ కేటగిరీలో సైమా అవార్డును అందుకున్నాడు. ఇందులో నూనుగు మీసాలతో మెప్పించాడు. మధ్యలో ఐదేళ్ల గ్యాప్ తీసుకున్నాడు రోషన్. ఇక అమ్మాయిలు ఫ్లాట్ అయిపోయిన మూవీ పెళ్లి సందడి. తన తండ్రికి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన పెళ్లి సందడి టైటిల్‌తో వచ్చాడు. ఆనాటి పెళ్లి సందడి దర్శకుడు రాఘవేంద్రరావు ఈ సినిమాకు పర్యవేక్షకుడిగా వ్యవహరించారు. ఈ మూవీతోనే ఇప్పటి స్టార్ హీరోయిన్ శ్రీలీల తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.

Roshan

ఈ సినిమా విడుదల సమయంలో ఈవెంట్ కండక్ట్ చేయగా మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఆ సమయంలో చిరంజీవి గారు అని రోషన్ సంభాషించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన చిరు.. ‘రోషన్ పెద్దనాన్న అని ఆప్యాయంగా పిలుస్తాడు. నా బిడ్డలాగా. ఎక్కడున్నా.. నేను మీ నాన్నకు అన్నయ్యనే.. నీకు పెద్దనాన్ననేరా’ అంటూ బ్లెస్ చేశాడు మెగాస్టార్. కాగా, రోషన్ ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు. ఒకటి మల్టీ లాంగ్వేజ్ మూవీ వృషభ. మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రోషన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలాగే చాంపియన్ అనే మూవీ చేస్తున్నాడు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే అధికారిక ప్రకటన వెలువడింది. ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ వైజయంతి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం.

 

View this post on Instagram

 

A post shared by Roshann meka (@iamrshn)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet