Swetha
ప్రతి మనిషికి ఎవరో ఒకరు ప్రేరణ కలిగిస్తుంటారు. ఏ హీరోకైనా నటుడు కావడానికి ప్రేరణ ఎవరు అని అంటే మనం అందరం ఫలానా అగ్ర నటుడు అని చెపుతుంటారు. అలానే చిరంజీవికి మాత్రం నటించాలనే కోరిక కలగడానికి ఎవరు కారణం అనడిగితే ..ఇలా చెప్పుకొచ్చాడు చిరంజీవి.
ప్రతి మనిషికి ఎవరో ఒకరు ప్రేరణ కలిగిస్తుంటారు. ఏ హీరోకైనా నటుడు కావడానికి ప్రేరణ ఎవరు అని అంటే మనం అందరం ఫలానా అగ్ర నటుడు అని చెపుతుంటారు. అలానే చిరంజీవికి మాత్రం నటించాలనే కోరిక కలగడానికి ఎవరు కారణం అనడిగితే ..ఇలా చెప్పుకొచ్చాడు చిరంజీవి.
Swetha
దక్షిణభారతచలన చిత్ర వానిజ్యమండలి ఆధ్వర్యంలో నిర్వహింప బడిన శిక్షణాలయం విద్యార్థి చిరంజీవి 1978 లో పునాది రాళ్ళు అనే సినిమాలో నటించే అవకాశం లభించింది. అయితే ఆ చిత్రం కంటే ముందు గానే ప్రాణం ఖరీదు, మన ఊరి పాండవులు, కుక్క కాటుకు చెప్పుదెబ్బ, ఇది కథ కాదు , ఐ లవ్ యూ లాంటి చిత్రాలు చిరంజీవివి మంచి ఇమేజ్ తెచ్చి పెట్టాయి..దాని తరువాత చాలా సినిమాలు సూపర్ డూపర్ హిట్‌లు వచ్చి పడ్డాయి..తెలుగు సినిమా రంగంలో అగ్రస్థాయి కథానాయకుడి స్థాయికి చేరుకున్నారు.అయితే ప్రతి మనిషికి ఎవరో ఒకరు ప్రేరణ కలిగిస్తుంటారు. ఏ హీరోకైనా నటుడు కావడానికి ప్రేరణ ఎవరు అని అంటే మనం అందరం ఫలానా అగ్ర నటుడు అని చెపుతుంటారు. అలానే చిరంజీవికి మాత్రం నటించాలనే కోరిక కలగడానికి ఎవరు కారణం అనడిగితే ..ఇలా చెప్పుకొచ్చాడు చిరంజీవి.
అవి నేను తొమ్మిదో తరగతి చదువు తున్న రోజులు ..ఆ సమయంలో బాలరాజు కథ అనే చిత్రం అప్పట్లో విడుదలైంది. అంతకు ముందు నేను ఎన్నొ సినిమాలు చూశాను అయితే ఆ సినిమాలో మాస్టర్ ప్రభాకర్ వేసిన వేషం నన్ను విశేషంగా ఆకట్టుకుంది. థియేటర్లో బయట ప్రేక్షకులు ప్రభాకర్ నటనకు ముచ్చట పడి ప్రశంసా పూర్వకంగా మాట్లాడుతుంటే మొదటి సారిగా నాకు నటన మీద.. ఆసక్తి ఏర్పడింది. ఆ బాల నటుడు ఏమి చేశాడని ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారనే ఆలోచన కలిగింది. ఆ సినిమాను నేను రెండు మూడు సార్లు చూశాను. అలా చాలా సార్లు చూసి నటించడంలో గమ్మత్తు ఉంది. మనం కూడా నటనలో కృషి చేస్తే ఇలా నలుగురి ఆదరాభిమానం సంపాదించగలమేమో అని అనిపించింది. నాలో నటన పట్ల ఆసక్తి , అభిరుచి ఏర్పడటానికి ప్రేరణ అలా మొదలైంది. ఆ తరువాత ఆ ప్రేరణకు ఎన్నో మలుపులు ..కొందరు వ్యక్తులు కొన్ని సినిమాలు ..కొన్ని సంఘటనలు నన్ను ప్రభావితం చేస్తూనే వచ్చాయి.
ఆ దిశగా అడుగులు వేసినప్పుడు ప్రతి వృత్తికి ఎంతో కొంత శిక్షణ ఉండి తీరాలంటాను ..ముఖ్యంగా నటన వంటి సృజనాత్మక కళలకు శిక్షణ ఎంత గానో దోహదం చేస్తుంది. ఐతే శిక్షణ లేకుండా కూడా చాలా మంది రాణించారు. కానీ వారు ఆరంభంలో తప్పని సరి రకరకాల సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. వాచకం విషయంలో కానీ ఇతర సాంకేతిక విషయాల్లో కానీ ఆ లోపాలు సరిదిద్దుకోవడానికి కనీసం ఐదు సినిమాల అనుభవం అవసరమౌతుంది. అవీ తొలిరోజుల్లో ప్రతిభ గల దర్శకుల వద్ద చేస్తే ఫరవాలేదు. అసమర్థులైన దర్శకుల దర్శకత్వంలో నటిస్తే ఆ నటుడి లోపాలు తప్పకుండా తెలుస్తాయి. శిక్షణ పొందిన నటుడికి అటు వంటి సమస్యలు ఉండవు. కారణం అతనికి ముందే గట్టి ఆత్మవిశ్వాసం ఉంటుంది. నటన అనేది నిత్యనూతనం అంటూ తన గురించి చెప్పుకున్నారు చిరంజీవి.