iDreamPost
android-app
ios-app

విశ్వంభరలో అకీరా నందన్? మెగా ఫ్యాన్స్ కోరిక తీరబోతోందా..

  • Published Oct 01, 2024 | 1:54 PM Updated Updated Oct 01, 2024 | 1:54 PM

ఇటు బాలకృష్ణ నట వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దీంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా పేరు తెరపైకి వచ్చింది. అతడు కూడా హీరో అయితే చూడాలనుకుంటున్నారు ఫ్యాన్స్. కానీ రేణు మాత్రం యాక్టింగ్ ఇష్టం లేదని క్లారిటీ ఇచ్చింది. కానీ ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది.

ఇటు బాలకృష్ణ నట వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దీంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా పేరు తెరపైకి వచ్చింది. అతడు కూడా హీరో అయితే చూడాలనుకుంటున్నారు ఫ్యాన్స్. కానీ రేణు మాత్రం యాక్టింగ్ ఇష్టం లేదని క్లారిటీ ఇచ్చింది. కానీ ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది.

  • Published Oct 01, 2024 | 1:54 PMUpdated Oct 01, 2024 | 1:54 PM
విశ్వంభరలో అకీరా నందన్? మెగా ఫ్యాన్స్ కోరిక తీరబోతోందా..

మెగా ఫ్యామిలీ నుండి ఎంతో మంది టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోలుగా సత్తా చాటుతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వారసుడి వంతు వచ్చింది. పవన్-రేణు దేశాయ్ ముద్దుల తనయుడు అకీరా నందన్ హీరోగా చూడాలని భావిస్తున్నారు ఫ్యాన్స్. అతడి ఎంట్రీ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు.  కానీ తల్లి రేణు మాత్రం.. యాక్టింగ్ అంటే అకీరాకు అంత ఇష్టం లేదని, మ్యూజిక్ వైపే ఇంట్రస్ట్ చూపుతున్నాడని క్లారిటీ ఇచ్చింది. కానీ భవిష్యత్తులో ఫైనల్ ఛాయిస్ అకీరాదే అంటూ వెల్లడించింది. దీంతో కొంత మేర వారసుడి ఎంట్రీపై హోప్స్ ఉంచుకున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. అయితే ఇప్పుడు ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ సినీ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. త్వరలోనే అకీరా బిగ్ స్క్రీన్ పై కనిపించబోతున్నాడని ఇన్నర్ టాక్. అయితే హీరోగా కాదట.. ఓ స్మాల్ అండ్ స్పెషల్ రోల్ చేయబోతున్నాడట ఈ యంగ్ పవర్ స్టార్.

పెద్దనాన్న మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ఫాంటసీ ఫిల్మ్ విశ్వంభరలో అకీరా నందన్ ఓ కీలక పాత్ర చేయబోతున్నాడట. మనం మూవీలో అఖిల్ ఎంట్రీలా.. విశ్వంభరలో కూడా అకీరా ఇంట్రడక్షన్ ఉండబోతుందని బజ్ నడుస్తోంది. ఈ సినిమాకు మరింత హైప్ తెచ్చేందుకు దర్శకుడు వశిష్ట ఈ మేరకు ప్లాన్ చేస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే 80 శాతం పూర్తి చేసుకున్న ఈ సినిమాను విజువల్ వండర్‌గా తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్. చిరంజీవి కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కబోతుంది.  సుమారు 500 కోట్ల రూపాయలతో యువీ క్రియేషన్స్ ఎక్కడా రాజీ పడకుండా .. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే.. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాను వేరే లెవల్లో తీసుకెళ్లేందుకు మాస్టర్ ప్లాన్ రచిస్తున్నాడు దర్శకుడు వశిష్ట.

ఈ క్రమంలోనే అకీరాను విశ్వంభరలో యాక్ట్ చేయించాలని అనుకుంటున్నాడట డైరెక్టర్. ఇదే కన్ఫమ్ అకీరా హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు అడుగులు పడినట్లే లెక్క. తండ్రి లుక్స్, హెయిర్ స్టైల్‌ను యాజ్ టీజ్ పుణికి పుచ్చుకున్నాడు అకీరా. హీరోగా రావాలనుకుంటే గ్రాండ్ వెల్కమ్ ఉంటుంది. పెద్దనాన్న ఆశీస్సులు, అన్నయ్యలు రామ్ చరణ్, వరుణ్ తేజ్ అండదండలు ఎలాగూ ఉంటాయి. అతడు ఊ అనాలే కానీ.. సినిమా తీసేందుకు బడా ప్రొడ్యూసర్స్, దర్శకులు ఉన్నారు. తమ అభిమాన హీరో కొడుకును ఎప్పుడెప్పుడు తెరపై చూస్తామా అని ఎదురు చూస్తున్న అభిమానుల ఆశలు తీరినట్లు అవుతుంది. కానీ తన కొడుకు మదిలో మ్యూజిక్ ఫస్ట్.. సినిమాలు నెక్ట్స్ అంటున్నట్లు చెబుతోంది తల్లి రేణు. మరీ అకీరా స్టెప్స్ ఎటువైపు పడనున్నాయో వెయిట్ అండ్ వాచ్.  అకీరా హీరోగా ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నారా.? మీ అభిప్రాయాలను కామెంట్స్ రపంలో తెలియజేయడి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibom