iDreamPost
android-app
ios-app

మన శంకర వరప్రసాద్ గారికి ఎక్కువ సమయం లేదు

  • Published Dec 26, 2025 | 3:52 PM Updated Updated Dec 26, 2025 | 3:52 PM

సరిగ్గా ఇంకో 17 రోజుల్లో మన శంకర వర ప్రసాద్ గారు థియేటర్స్ లో గ్రాండ్ ఎంట్రీ ఇస్తారు. అయితే సాధారణంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చే సినిమాలన్నిటికీ... కనీసం నెల ముందు నుంచి ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తూ ఉంటాడు అనిల్. అవి సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అవుతూ ఉంటాయి.

సరిగ్గా ఇంకో 17 రోజుల్లో మన శంకర వర ప్రసాద్ గారు థియేటర్స్ లో గ్రాండ్ ఎంట్రీ ఇస్తారు. అయితే సాధారణంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చే సినిమాలన్నిటికీ... కనీసం నెల ముందు నుంచి ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తూ ఉంటాడు అనిల్. అవి సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అవుతూ ఉంటాయి.

  • Published Dec 26, 2025 | 3:52 PMUpdated Dec 26, 2025 | 3:52 PM
మన శంకర వరప్రసాద్ గారికి ఎక్కువ సమయం లేదు

సరిగ్గా ఇంకో 17 రోజుల్లో మన శంకర వర ప్రసాద్ గారు థియేటర్స్ లో గ్రాండ్ ఎంట్రీ ఇస్తారు. అయితే సాధారణంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చే సినిమాలన్నిటికీ… కనీసం నెల ముందు నుంచి ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తూ ఉంటాడు అనిల్. అవి సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అవుతూ ఉంటాయి. అవుట్ డోర్ పబ్లిసిటీ , థియేటర్స్ దగ్గర హోర్డింగ్ లు , పెద్ద పెద్ద వాళ్ళతో ఇంటర్వూస్ ఇలా చాలానే హంగామా ఉంటూ ఉంటుంది. కానీ ఇప్పుడు అవేమి కనిపించకపోయేసరికి ఫ్యాన్స్ కాస్త వర్రీ అవుతున్న సంగతి తెలిసిందే.

పోనీ అనిల్ రావిపూడి బిజీ బిజీగా ఉండి ఈ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయలేదా అంటే.. కాదు వేరే ఈవెంట్స్ లో గెస్ట్స్ గా కనిపిస్తునే ఉన్నాడు. అక్కడ ఎక్కడా కూడా మన శంకర వర ప్రసాద్ గారి స్టాంప్ కనిపించడం లేదు. అసలే పండగకు పోటీ గట్టిగా ఉంది. దానికి నాలుగు రోజుల ముందు రాజాసాబ్ వస్తుంది. అటు రాజాసాబ్ టీం భారీగా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి మన శంకర వర ప్రసాద్ గారు ఇంకాస్త స్పీడ్ పెంచాల్సిందే. గత ఏడాది సంక్రాంతి రిలీజ్ కు నవంబర్ చివరి వారం నుంచే ప్రమోషన్స్ మొదలుపెట్టిన అనిల్ .. ఇప్పుడు డిసెంబర్ అయిపోవస్తున్న సినిమా టీజర్ కూడా రిలీజ్ చేయకపోవడం ఆశ్చర్యం.

పైగా మెగాస్టార్ కి ఇప్పుడు మెగా బ్లాక్ బస్టర్ చాలా అవసరం . రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక్క సాలిడ్ హిట్ కూడా పడలేదు. దీనితో ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ట్రోల్ చేద్దామా అని ఎదురుచూస్తున్నారు. మరో వైపు రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు రేంజ్ లో వింటేజ్ మెగాస్టార్ ని బయటికి తీశానని చెప్పాడు అనిల్ రావిపూడి. మరి వాటి తాలూకా శాంపుల్స్ కొన్నైన కనిపిస్తే ఫ్యాన్స్ హ్యాపీ అవుతారు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.