తెలంగాణలో భారీ పెట్టుబడులు పెడుతున్నట్లు ఇటీవల అమరరాజా గ్రూప్ ప్రకటించడంతో.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. జగన్ హయాంలో ఏపీ నుంచి కంపెనీలన్నీ తరలిపోతున్నాయని తెగ ఫైర్ అయ్యాయి. అమరరాజా కంపెనీ ప్రతిపక్ష టీడీపీకి చెందిన నాయకుడి కంపెనీ కావడంతో.. అధికార పార్టీ రాజకీయ కక్ష సాధింపుతోనే ఏపీ నుంచి తరిమేసిందని నానా మాటలు అన్నాయి. కట్ చేస్తే తాము ఏపీలో పెట్టుబడులు పెడుతున్నట్లు తాజాగా అమరరాజా గ్రూప్ ప్రకటించింది. […]
* తొలిసారి ‘లెవల్–2’ సాధించిన ఆంధ్రప్రదేశ్ * ఏపీ, కేరళతో పాటు మరో 5 రాష్ట్రాలకు లెవల్–2 * దేశంలో ఏ ఒక్క రాష్ట్రానికీ దక్కని లెవల్–1 * 2020–21కి రాష్ట్రాల పనితీరు గ్రేడింగ్ విడుదల చేసిన కేంద్రం * 2017 నుంచి 2019 వరకూ లెవల్ 6లో ఏపీ * చిత్తశుద్ధితో విద్యారంగాన్ని సంస్కరిస్తూ వస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ * ఫలితంగా నాలుగు స్థాయిలు ఎగబాకి ఏకంగా లెవల్–2కు ‘పిల్లలకు మనమిచ్చే ఆస్తి చదువే’ […]
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మూడేళ్లుగా అవార్డు తీసుకుంటున్నాం. జపాన్ కంపెనీకి ప్రపంచంలోనే ఐదో స్థానం ఉంది. అలాంటిది 15 నెలల్లోనే ఏటీసీ టైర్ల పరిశ్రమను స్థాపించగలిగామని ప్రకటించారు ఏపీ సిం జగన్. ఆగస్టు 2023 నాటికి రెండో పనులు పూర్తి చేసే అవకాశం ఉందన్న సీఎం, రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని తెలిపారు. ఈ మూడేళ్లలో పారిశ్రామికాభివృద్ధి పరుగులుపెడుతోందన్న సీఎం, ఏపీకి 17 భారీ పరిశ్రమలతో 39, 350 కోట్ల పెట్టుబడులు […]
ఏపీ అభివృద్ధిపై నీతి అయోగ్ ప్రశంసల వర్షం కురిసింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో నీతి ఆయోగ్ సభ్యులు రమేష్ చంద్, బృందం భేటీ అయ్యారు. తలసరి ఆదాయం, వ్యవసాయం, పశుసంపద తదితర రంగాల్లో దేశసగటు కన్నా, ఏపీలో వృద్ధి బాగుందని రమేష్ చంద్ ప్రకటించారు. ఆ మేరకు గణాంకాలను సీఎంకు రమేష్ చంద్ వివరించారు. లక్ష్యాలను పెట్టుకుని, దానికి అనుగుణంగా సాగుతున్న తీరును నీతి అయోగ్ రమేష్చంద్ ప్రశంసించారు. పండ్లు, మత్స్య […]
రాజ్యసభ ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. జూన్ 10వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు ఫలితాలనూ ప్రకటిస్తారు. ఈ సందర్భంగా పలు పార్టీల అభ్యర్థులను ప్రకటించడంతో వారు నామినేషన్లను దాఖలు చేయగా, నామినేషన్లకు గడువు నిన్నటితో ముగిసింది. మొత్తం 57 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుండగా, అందులో 41 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీజేపీ నుంచి 14 మంది ఎన్నికయ్యారు. మిగిలిన 16 స్థానాలకు ఎన్నికలు జరపనున్నారు. మహారాష్ట్రలో 6, రాజస్తాన్లో 4, కర్ణాటకలో 4, హర్యాణాలో […]
‘పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలమేరకు ఎమ్మెల్సీ అనంతబాబుపై సస్పెన్షన్ వేటు వేశారు . అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మరణానికి తానే బాధ్యుడిని అని ఎమ్మెల్సీ అనంతబాబు తమకు వాంగ్మూలం ఇచ్చినట్టు పోలీసులు ప్రకటించిన నేపథ్యంలో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడమైనది’ అని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. డ్రైవర్ హత్య కేసులో అనంతబాబును ఇప్పటికే పోలీసులు […]
ఒకచోట భూమిని తవ్వుతుంటే వజ్రాలు దొరికాయి అని ఎవరైనా ప్రచారం చేశారనుకోండి… గుడ్డిగా కొంతమంది నమ్మెస్తారు. అక్కడు పరుగులు పెడుతారు. ఆ ప్రాంతానంతటినీ తవ్విపారేస్తారు. ఆశే వాళ్లను పరుగెత్తిస్తుంది. లేటెస్ట్ గా… గుట్టలుగా బంగారం దొరుకుతుందని పుకార్లు వచ్చాయి. ఇంకేముంది జనాలు అక్కడికి ఉరుకుతున్నారు. అసలు బంగారం ఎక్కడ దొరుకుతుందని పుకార్లు వచ్చాయి తెలుసా? సముద్రంలో. అక్కడ బంగారం దొరకడం ఎలా సాధ్యం అని ఒక డౌట్ రావొచ్చు. అయితే… వారి నమ్మకానికి ఓ కారణం ఉంది. […]
నెలల తరబడి టాలీవుడ్ చేస్తున్న ఎదురు చూపులకు ఫలితం దక్కింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జిఓని విడుదల చేసింది. మున్సిపల్ కార్పొరేషన్, మునిసిపాలిటీ, పంచాయితీ కేంద్రాలకు ఎలాంటి రేట్లు ఉండాలి, అదనపు షోలకు సంబంధించి పూర్తి వివరాలతో ఇందాక ఇచ్చిన ఉత్తర్వు మీద అప్పుడే చర్చలు మొదలయ్యాయి. భీమ్లా నాయక్ ఇప్పటికే రెండు వారాలు పూర్తి చేసుకోవడంతో దీని వల్ల వచ్చే లాభం ఆ సినిమాకు ఉండకపోవచ్చు. ఎలాగూ శుక్రవారం రాధే శ్యామ్ రానుంది కాబట్టి ఈ […]
ఏపీలో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం. సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కేఎస్ జవహర్ రెడ్డి నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం టీటీడీ ఈవోగా కొనసాగుతున్నారు. ఆయన సీఎంవోలో నియమితులైనప్పటికీ, టీటీడీ ఈవోగానూ కొనసాగుతారని తాజా ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఇక, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ ను బదిలీ చేశారు. సీసీఎల్ఏగా జి.సాయిప్రసాద్ ను బదిలీ చేశారు. కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా జీఎస్ఆర్కేఆర్ విజయ్ కుమార్, […]