iDreamPost
android-app
ios-app

హీరో నారా రోహిత్ ఇంట విషాదం.. తండ్రి మృతి

  • Published Nov 16, 2024 | 1:06 PM Updated Updated Nov 16, 2024 | 1:06 PM

Nara Ramamurthy naidu: సినీ హీరో నారా రోహిత్ ఇంట విషాదం నెలకొన్నది. ఆయన తండ్రి తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు.

Nara Ramamurthy naidu: సినీ హీరో నారా రోహిత్ ఇంట విషాదం నెలకొన్నది. ఆయన తండ్రి తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు.

  • Published Nov 16, 2024 | 1:06 PMUpdated Nov 16, 2024 | 1:06 PM
హీరో నారా రోహిత్ ఇంట విషాదం.. తండ్రి మృతి

నటుడు నారా రోహిత్ బాణం సినిమాతో వెండి తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత సోలో సినిమాతో సక్సెస్ అందుకుని గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదిలా ఉంటే నారా రోహిత్ ఇంట తీవ్ర విషాదం నెలకొన్నది. ఆయన తండ్రి నారా రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించారు. గత మూడు రోజుల నుంచి వైద్యులు రామ్మూర్తి నాయుడికి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం పూర్తిగా విషయమించింది. కాసేపటి క్రితం చికిత్స పొందుతూ రామ్మూర్తి నాయుడు మృతి చెందారు. ఆయన మరణంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆయన మరణ వార్త తెలిసిన పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా రామ్మూర్తి నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సోదరుడు. రామ్మూర్తి నాయుడు గతంలో టీడీపీ తరపున చంద్రగిరి నియోజకవర్గం నుంచి 1994- 1999లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో గల్లా అరుణ కుమారి చేతిలో ఓటమిపాలవడంతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు. రామ్మూర్తి నాయుడు తిరుపతికే పరిమితమవడంతో టీడీపీలో ఎక్కువగా పాపులర్ కాలేకపోయారు. ఆయన మృతితో టీడీపీ శ్రేణులు శోక సంద్రంలో మునిగిపోయాయి. సోదరుడి మరణంతో ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని తిరుపతికి బయలుదేరారు.

రామ్మూర్తి నాయుడు మరణ వార్త తెలియగానే కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు ఏఐజీ ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నాయి. చిన్నాన్న మృతితో నారా లోకేష్ ఏఐజీ ఆసుపత్రికి పయనమయ్యారు. హైదరాబాద్ లో చనిపోవడంతో రామ్మూర్తి నాయుడి మృతదేహాన్ని ప్రత్యేక విమానంలో స్వగ్రామం నారావారిపల్లెకు కుటుంబ సభ్యులు తరలించనున్నారు. ఆదివారం నారా రామ్మూర్తి నాయుడు స్వగ్రామం నారావారిపల్లెలో అంతిమ సంస్కారాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కాగా ఇటీవల నారా రోహిత్ ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. నటి సిరి లెల్లతో త్వరలో వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇలాంటి సమయంలో నారా రోహిత్ తండ్రి మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్నది.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio