iDreamPost
android-app
ios-app

Lady Aghori: డివైడర్ ను ఢీకొట్టిన లేడీ అఘోరీ కారు.. చివరకు ఏమైందంటే?

  • Published Nov 08, 2024 | 10:54 AM Updated Updated Nov 08, 2024 | 10:54 AM

Lady Aghori Accident: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న లేడీ అఘోరీ ప్రమాదానికి గురైంది. ఆమె ప్రయాణిస్తున్న కారు డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం దెబ్బతిన్నది.

Lady Aghori Accident: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న లేడీ అఘోరీ ప్రమాదానికి గురైంది. ఆమె ప్రయాణిస్తున్న కారు డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం దెబ్బతిన్నది.

  • Published Nov 08, 2024 | 10:54 AMUpdated Nov 08, 2024 | 10:54 AM
Lady Aghori: డివైడర్ ను ఢీకొట్టిన లేడీ అఘోరీ కారు.. చివరకు ఏమైందంటే?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో హల్ చల్ చేస్తుంది లేడీ అఘోరీ. సనాతన ధర్మం కాపాడేందుకు పోరాడుతానని చెప్తూ నానా రచ్చ చేస్తుంది. లోకకళ్యాణం కోసం పాటుపడతానని లేడీ అఘోరీ హంగామా చేస్తోంది. గత కొన్ని రోజులుగా లేడీ అఘోరీ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలతో సెలబ్రిటీ రేంజ్ లో పాపులారిటీ పొందింది. నలుగురు కలిశారంటే చాలు లేడీ అఘోరీ గురించే చర్చ. లేడీ అఘోరీ వేషధారణ, ఆమె మాట్లాడే మాటలు జనాలకు ఆమే పై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో తనపై తప్పుడు ప్రచారం చేసేవారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కారులో పుర్రెలతో రోడ్లపైకి వచ్చి రచ్చ రచ్చ చేసింది.

కాగా నిన్న గురువారం లేడీ అఘోరీ ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్లింది. దేవాలయ సిబ్బంది ఆమెను లోనికి పంపించకపోవడంతో వారిపై మండిపడింది. లోనికి పంపించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఒంటిపై పెట్రోల్ పోసుకుని భయానక వాతావరణాన్ని సృష్టించింది. దీంతో ఆ ప్రాంతమంతా టెన్షన్ వాతావరణం క్రియేట్ అయ్యింది. అక్కడున్న స్థానికులు, పోలీసులు ఆమెను రక్షించారు. ఆ తర్వాత బట్టలు తొడిగించి పరమశివుడి దర్శనానికి పంపిచారు. అయితే పెట్రోల్ పోసుకున్న తర్వాత అక్కడున్న వారు వాటర్ కుమ్మరించడంతో నాగసాధు అసలు రూపం వెలుగు చూసింది. తొలిసారి నిజరూపం కనిపించడంతో ప్రజలంతా ఆశ్చర్యానికి గురయ్యారు.

తర్వాత పోలీసులు ఆమెను ఏపీ బార్డర్ దాటించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. గురువారం రాత్రి సమయంలో లేడీ అఘోరీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఆమె ప్రయాణిస్తున్న కారు శ్రీకాళహస్తి వద్ద ప్రమాదానికి గురైంది. లేడీ అఘోరీ యాక్సిడెంట్ బారిన పడింది. ఆమె ప్రయాణిస్తున్న కారు డివైడర్ ను ఢీకొట్టింది. ప్రమాద ధాటికి కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. అయితే ఈ ప్రమాదంలో లేడీ అఘోరికి ఎలాంటి గాయాలు కాలేదు. యాక్సిడెంట్ పై లేడీ అఘోరీ స్పిందిస్తూ తనకు ఏమీ కాలేదని, క్షేమంగానే ఉన్నట్లు చెప్పుకొచ్చింది. చీకట్లో ప్రయాణిస్తుండగా విజిబులిటీ లేక పోవడంతో కారు డివైడర్ ను ఢీకొట్టినట్లు తెలిపింది.

వీధిలైట్లు లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పేర్కొంది. లేడీ అఘోరీ గత కొన్ని రోజులుగా ఒక ప్రాంతంలో ఉండకుండా కలియ తిరుగుతూ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడికెళ్లినా మీడియాలో హైలెట్ అయ్యే విధంగా ఆమె వ్యవహరిస్తూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నది. ఆత్మార్పణం చేసుకుంటానంటూ కారులో పెట్రోల్ పెట్టుకునితిరుగుతూ హల్ చల్ చేస్తోంది లేడీ అఘోరీ. చివరికి లేడీ అఘోరీ వ్యవహారంపై పోలీసులు, ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో, ఏమైనా చర్యలు తీసుకుంటాయో చూడాలి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom