P Krishna
Visakhapatnam: ఇటీవల కుర్రకారు రోడ్లపై హారన్ల మోత మోగిస్తున్నారు. తమ వాహన సైలెన్సర్లను మార్చి పెద్ద సౌండ్ వచ్చే వాటిని ఉపయోగిస్తు నానా రచ్చ చేస్తున్నారు.
Visakhapatnam: ఇటీవల కుర్రకారు రోడ్లపై హారన్ల మోత మోగిస్తున్నారు. తమ వాహన సైలెన్సర్లను మార్చి పెద్ద సౌండ్ వచ్చే వాటిని ఉపయోగిస్తు నానా రచ్చ చేస్తున్నారు.
P Krishna
ఎవడి పిచ్చి వాడికి ఆనందం అంటారు. ఇటీవల కుర్రకారు రేస్‌బైక్‌లతో హారన్ల మోత మోగిస్తున్నారు. తమ వాహన సైలెన్సర్లను మార్చి పెద్ద సౌండ్ వచ్చే వాటిని ఉపయోగిస్తు రోడ్లపై రైయ్.. రైయ్ చక్కర్లు కొడుతున్నారు. ఆ శబ్ధం వల్ల ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు శబ్ధకాలుష్యం భారీగా పెరిగిపోతుంది. ఈ తరహా అల్లరి మూకలను కట్టడి చేసేందుకు విశాఖ పట్నం పోలీస్ కమీషనర్ కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నగరంలో ఎక్కువ శబ్ధం చేసే వాహనాలను గుర్తించి, వాటి సైలెన్సర్లను తొలగించారు. వాటిని విశాఖ బీచ్ రోడ్ లో వరుసగా పేర్చి రోడ్ రోలర్ తో తొక్కించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
విశాఖ నగరంలో అధిక శబ్ధం చేచే సైలెన్సర్లు ఉపయోగిస్తే జరిమానాతో పాటు జైలు శిక్ష పడుతుందని యువతను హెచ్చరించారు. పెద్ద శబ్ధాలు వచ్చే సైలెన్సర్లను వాడటం భారత మోటర్ వాహన చట్టం 1988 ప్రకారం సెక్షన్ 190 (II) కింద నేరంగా పరిగణించబడుతుంది. ఈ నేరానికి మూడు నెలల జైలు శిక్ష లేదా రూ.10 వేల జరిమానా విధించబడుతుంది. అంతేకాదు, డ్రైవింగ్ లైసెన్స్ మూడు నెలల పాటు సస్పెండ్ చేస్తారు. అదే నేరం రెండోసారి చేసినట్లయితే ఆరు నెలల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధించడమే కాకుండా వాహనాన్ని కూడా సీజ్ చేస్తారు. మరోసారి డ్రైవింగ్ లైసెన్స్ మూడు నెలల పాటు రద్దు చేస్తారు. కొంతమంది ఆకతాయిలు అధిక శబ్ధాలు చేస్తూ బైకులు నడుపుతూ ఇరిటేట్ చేస్తున్నట్లు నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ భారీ శబ్ధాలకు గుండె జబ్బు ఉన్నవారు, చిన్న పిల్లలు, వృద్దులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు అంటున్నారు. ఈ క్రమంలోనే నగర పోలీస్ కమిషనర్ కి వరుస ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆకతాయి బుద్ది చేప్పే పనిలో పడ్డారు పోలీసులు. మొదట సైలెన్సర్లు అమర్చే మెకానిక్ షాపు యజమానులకు వార్నింగ్ ఇచ్చారు. తర్వాత మోడిఫై చేసిన సెలెన్సర్లను గుర్తించి వాటిని నాశనం చేశారు. భవిష్యత్ లో ఇలాంటి శబ్ధాన్ని సృష్టించే సైలెన్సర్లు వాహనాలకు అమర్చితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీసులు.
ఈ కార్యక్రమం విశాఖపట్నం నగర పోలీసు కమీషనర్, అదనపు జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు శాంతి భద్రతలు మరియు ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి 181 సైలెన్సర్లను ధ్వంసం చేశారు. ఇదిలా ఉంటే.. తెలంగాణలో సైతం ఇలాంటి ఆకతాయిల ఆగడాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. సైలెన్సర్లు మార్చుకొని బైక్ రేస్ పెట్టుకుంటూ హల్ చల్ చేస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీసులను కోరుతున్నారు నగరవాసులు. ద్విచక్ర వాహనాలకు ఉండే సైలెన్సర్లను బిగించుకొని ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో పెద్ద పెద్ద సౌండ్స్ చేస్తూ వాహనాలు నడుపుకుంటూ రావడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ప్రధాన కూడళ్ల వద్ద అడ్డా వేస్తూ.. ఒక్కసారిగా బైకులను స్టార్ట్ చేసి రైయ్ రైయ్ అంటూ వేగం పెంచుకుంటూ జనాలను హడలగొడుతున్నారు.కొన్నిసార్లు బైక్ సౌండ్స్ తో హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయిన వారు కూడా ఉన్నారు. కొంత మంది యువకులు కొత్త బైక్ మోజులో తిరుగుతుంటే.. మరికొందరు జులాయిగా తిరుగుతూ కావాలని ఇబ్బందులు పెడుతున్నారు. ఇలాంటి వారిపై ఫిర్యాదులు రావడం, వారిని పట్టుకొని కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతూనే ఉంది. కానీ ఆకతాయిల్లో మాత్రం మార్పు రావడం లేదు. అందుకే విశాఖ పోలీసులు ఇలాంటి ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.