iDreamPost
android-app
ios-app

ఏపీకి మరో ముప్పు..మరో అల్పపీడం! ఆ జిల్లాల్లో భారీ వర్షాలు

  • Published Oct 18, 2024 | 4:18 PM Updated Updated Oct 18, 2024 | 4:18 PM

Imd Alert AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం ఏపీ, తమిళనాడు, కర్ణాటకలపై బాగా చూపింది. మూడు రోజులు కురిసిన భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. ఏపీలో ఒక ముప్పు పోయిందనుకునేలోపు వాతావరణ శాఖ మరో బాంబ్ పేల్చింది.

Imd Alert AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం ఏపీ, తమిళనాడు, కర్ణాటకలపై బాగా చూపింది. మూడు రోజులు కురిసిన భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. ఏపీలో ఒక ముప్పు పోయిందనుకునేలోపు వాతావరణ శాఖ మరో బాంబ్ పేల్చింది.

ఏపీకి మరో ముప్పు..మరో అల్పపీడం! ఆ జిల్లాల్లో భారీ వర్షాలు

గత రెండు నెలల క్రితం ఏపీ, తెలంగాణలో భారీగా వర్షాలు కురిశాయి. ఏపిలోని విజయవాడలో బుడమేరు వాగు పొంగి పలు కాలనీల్లో భారీగా వరద నీరు చేరడంతో ప్రజాజీవనం స్థంభించింది. ఇక తెలంగాణలో ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు పొంగి పొర్లడంతో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమ్యాయి. రెండు సంఘటనల వల్ల తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లింది. ఇప్పటికీ ఆ షాక్ నుంచి కోలుకోక ముందే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలో రెండు రోజులు వరుసగా వర్షాలు ముంచెత్తాయి. అయితే ఏపీకి తుఫాన్ ముప్పు తప్పిందని అనుకునే లోపే.. మరో ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ షాక్ ఇచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఏపీని వర్షాలు వీడేలా లేవు. ఒక గండం తప్పిపోయిందనుకునే లోపు మరో ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 22 నాటికి బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం ఏర్పడనుందని, అది తుఫాన్ గా మారి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని బాంబు పేల్చింది వాతావరణ శాఖ. ప్రస్తుతం ఉత్తర అండమాన్ లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు తెలిపింది. అది వాయువ్య దిశగా కదులుతూ అక్టోబర్ 22 నాటికి అల్ప పీడనంగా బలపడనున్నట్లు తెలిపింది. దీని ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. ఏపీలోనే కాకుండా దీని ప్రభావం తెలంగాణలో కూడా ఉంటుందని అంచనా వేస్తుంది. ఈ నెల 21 నుంచే తేలిక పాటి వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఇదిలా ఉంటే నేడు శుక్రవారం (అక్టోబర్ 18) కోనసీమ, ఉభయగోదావరి జిల్లా, ఏలూరు, నెల్లూరు, కర్నూల్, ఎన్టీఆర్, నంద్యాల, శ్రీ సత్యసాయి, అనంతపురం, వైఎస్సాఆర్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, అల్లూరి సీతారామారాజు, అనకాపల్లి, విశాఖ, కాకినాడ, బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో తెలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి తెలిపారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో కొమురంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, నల్లగొండ, సూర్యపేట, వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ, వికారాబాద్, జనగాం, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, కామారెడ్డి, గద్వాల జిల్లా లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని.. వర్షంతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంలో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.