iDreamPost
android-app
ios-app

Tirupathi: దారుణం! మూడేళ్ళ చిన్నారిపై అఘాయిత్యం, ఆపై చంపి.. అసలేం జరిగిందంటే?

  • Published Nov 02, 2024 | 12:43 PM Updated Updated Nov 02, 2024 | 12:43 PM

Tirupathi: తిరుపతిలో దారుణం జరిగింది. చిన్న పాపపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ నిందితుడు.

Tirupathi: తిరుపతిలో దారుణం జరిగింది. చిన్న పాపపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ నిందితుడు.

Tirupathi: దారుణం! మూడేళ్ళ చిన్నారిపై అఘాయిత్యం, ఆపై చంపి.. అసలేం జరిగిందంటే?

అభం శుభం తెలియని చిన్నారులు కూడా కామాంధుల కళ్ళలో పడి కాటికి పోతున్నారు. దీంతో దేశంలో క్రైమ్ ఏ విధంగా పెరిగిపోతుందో అర్ధం చేసుకోవచ్చు. సమాజంలో నరరూప రాక్షసులు ఎక్కువ అవుతున్నారు. తాజాగా తిరుప‌తి జిల్లాలో ఘోరాతి ఘోర‌మైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. అసలేం జరిగింది పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అభంశుభం తెలియ‌ని మూడున్న‌రేళ్ల చిన్నారిపై ఓ దుర్మార్గుడు పైశాచికత్వం చూపించాడు. ఆ పసిపాపపై క‌ర్క‌శంగా వ్య‌వ‌హ‌రించాడు. అప్ప‌టిదాకా న‌వ్వుతూ ఆడుకుంటుంది ఆ చిన్నారి. పాపకి చాక్లెట్లు ఇప్పిస్తాన‌ని మాయ‌మాట‌లు చెప్పాడు ఆ దుర్మార్గుడు. చిన్న పిల్ల అనే కనికరం లేకుండా కామంతో కళ్ళు మూసుకుపోయాడు. ఆ చిన్నారిపై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు నీచుడు. అంతేగాక ఆ చిన్నారిని హ‌త్య చేసి గుట్టుచ‌ప్పుడు కాకుండా పూడ్చిపెట్టేశాడు. ఆ దుర్మార్గుడు ఎవరో కాదు ఆ బాలికకు స‌మీప బంధువే. ఆ పసిపాపాకు వరసకి మామ అవుతాడు ఈ నీచుడు.

ఈ ఘోర‌మైన దారుణ ఘ‌ట‌న తిరుప‌తి జిల్లా వ‌డ‌మాట పేట మండ‌లంలోని ఏ.ఎం పురం ఎస్టీ కాలనీలో జరిగింది. శుక్ర‌వారం రాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది. నిందితుడి పేరు సుశాంత్ (22). త‌నకు కోడలైన మూడున్న‌రేళ్ల చిన్నారికి చాక్లెట్లు ఇప్పిస్తాన‌ని చెప్పి వెంట తీసుకెళ్లాడు. ఓ దుకాణంలో తినుబండారాలు కొనిచ్చాడు. తరువాత ఆ పసి పాపని స‌మీప పొలంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. అంతటితో ఆగకుండా ఆ చిన్నారిని చంపి పొలంలో పూడ్చి సమాధి చేశాడు ఆ నీచుడు. శుక్రవారం సాయంత్రం సరిగ్గా నాలుగు గంటల సమయంలో ఈ దారుణం చేశాడు.రాత్రి అవుతున్న‌ప్ప‌టికీ పాప క‌నిపించ‌క‌పోవ‌డంతో త‌ల్లిదండ్రులు కంగారు పడ్డారు. పాప కోసం చుట్టు పక్కల అన్ని చోట్లా వెతికారు. ఎంత వెతికినా కూడా చిన్నారి క‌నిపించ‌లేదు. దీంతో వ‌డ‌మాల పేట మండ‌లం పోలీసుల‌కు కంప్లైంట్ చేశారు. ఈ నేప‌థ్యంలో సుశాంత్‌ పై అనుమానం వచ్చింది. దాంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని తమ స్టైల్ లో పోలీసులు విచారించ‌గా అసలు నిజం చెప్పాడు.

నిందితుడు ఇచ్చిన స‌మాచారం మేర‌కు చిన్నారిని చంపి పూడ్చిన పొలానికి వెళ్లారు. పాప మృత దేహాన్ని బయటకి తీసి పోస్టుమార్టం నిమిత్తం పుత్తూరు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘటన పోలీసులనే బాధ పెట్టింది. నిందితుడు సుశాంత్‌పై వారికి పీకల్లోతు కోపం వచ్చింది. వెంటనే అతనిపై పోక్సో చ‌ట్టం కింద కేసు, మ‌ర్డ‌ర్ కేసుల‌తో పాటు వివిధ సెక్ష‌న్ల కింద కేసుల‌ను న‌మోదు చేశారు.అల్లారి ముద్దుగా పెంచుకున్న బాలిక ఇలా అర్థంత‌రంగా ఒక దుర్మార్గుడి కర్కశానికి బలికావడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరయ్యింది. పుట్టెడు దుఃఖ‌సాగ‌రంలోకి వెళ్లింది. ఆ పసిపాప త‌ల్లిదండ్రులు రోద‌నలు మిన్నంటాయి. వారిని చూసి కుటుంబ స‌భ్యులు, గ్రామ‌స్థులు క‌న్నీరు మున్నీరు అయ్యారు. ఈ షాకింగ్ ఘ‌ట‌నతో ఆ గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిప‌డింది. ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డ నిందితుడిని క‌ఠినంగా శిక్షించాల‌ని చిన్నారి కుటుంబ స‌భ్యులు, గ్రామ‌స్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇదీ సంగతి. ఎంత దారుణం. అభం శుభం తెలియని పసి చిన్నారి కామంతో రగిలి పోతున్న రాక్షసుడి చేతిలో బలి అయిపోయింది. ఇక ఈ ఘోరాతి ఘోరమైన ఘటన గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmarsbahis girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabetjojobet