iDreamPost
android-app
ios-app

బిగ్ అలర్ట్.. రాబోయే మూడు రోజుల్లో ఆ జిల్లాల్లో భారీ వర్షాలు!

  • Published Nov 11, 2024 | 2:34 PM Updated Updated Nov 11, 2024 | 2:35 PM

Andhra Pradesh Heavy Rains: ఏపీని వర్షాలు వదిలేలా లేవనిపిస్తుంది. బంగాళాఖాతంలో నైరుతి ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడింది. ఇది క్రమంగా అల్పపీడనంగా మారబోతుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావం ఏపీపై భారీగా పడనుందని తెలిపింది.

Andhra Pradesh Heavy Rains: ఏపీని వర్షాలు వదిలేలా లేవనిపిస్తుంది. బంగాళాఖాతంలో నైరుతి ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడింది. ఇది క్రమంగా అల్పపీడనంగా మారబోతుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావం ఏపీపై భారీగా పడనుందని తెలిపింది.

బిగ్ అలర్ట్.. రాబోయే మూడు రోజుల్లో ఆ జిల్లాల్లో భారీ వర్షాలు!

ఈ ఏడాది దేశ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్ చిగురుటాకులా వణికిపోతుంది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా విజయవాడలోని బుడమేరు వాగు పొంగి తీవ్ర నష్టాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. ఏపీలో మరోసారి భారీ వర్షాలు కురువనున్నాయి. బంగాళాఖాతంలో నైరుతి ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడింది. ఇది క్రమంగా అల్పపీడనంగా మారబోతుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మంగళవారం నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. రాయలసీమ, దక్షిణ కోస్తాలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. వివరాల్లోకి వెళితే..

నైరుతి బంగాళాఖాతం మీదుగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపారు.  తర్వాత పశ్చిమ దిశగా తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు నెమ్మదిగా కదిలి 15 రాత్రి వరకు తీరం దాటే అవకాశం ఉందని రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఈ అల్పపీడన ప్రభావం వల్ల మంగళ, బుధ, గురువారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.  సోమవారం (నవంబర్ 11) కాకినాడ, కోనసీమ, అన్నమయ్య, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. నవంబర్ 12 మంగళవారం నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే 13న బుధవారం కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, కృష్ణా, బాపట్ల , ప్రకాశం, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, తిరుపతి జిల్లాల్లోని తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

14 గురువారం గోదావరి జిల్లాలు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు,ఏలూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, తిరుపతి జిల్లాలలో మోస్తరు వర్షాలు పడే సూచన ఉందని తెలిపింది. అలాగే ఉత్తర కోస్తా జిల్లాల్లో చెదురు మదురుగా వర్షాలు పడొచ్చని వాతావరణ కేంద్రం అంచనావేసింది. వర్షాల నేపథ్యంలో వరి కోతలు ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉండనుందనున మత్స్యకారులు వేటకు వెళ్లవొద్దని హచ్చరికలు జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. సముద్రమట్టానికి 3.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఇది అల్పపీడనంగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.