iDreamPost
android-app
ios-app

ప్రేమ పెళ్లి.. ప్రాణ భయంతో కాపాడండి ప్లీజ్ అంటూ..

  • Published Nov 12, 2024 | 4:26 PM Updated Updated Nov 12, 2024 | 4:26 PM

ప్రేమించుకున్నారు. ఆ తర్వాత పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. తల్లిదండ్రులు చంపేస్తామని బెదిరిస్తుండడంతో ప్రాణ భయంతో పోలీసులను ఆశ్రయించారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ప్రేమించుకున్నారు. ఆ తర్వాత పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. తల్లిదండ్రులు చంపేస్తామని బెదిరిస్తుండడంతో ప్రాణ భయంతో పోలీసులను ఆశ్రయించారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

  • Published Nov 12, 2024 | 4:26 PMUpdated Nov 12, 2024 | 4:26 PM
ప్రేమ పెళ్లి.. ప్రాణ భయంతో కాపాడండి ప్లీజ్ అంటూ..

ప్రేమ ఇద్దరి మనసుల కలయిక. ప్రేమ కోసం.. ప్రేమించిన వారి కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. కొందరు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నారు. మరికొందరు ఇంట్లో వాళ్లను ఎదిరించి వివాహాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రేమ వివాహాలు గొడవలకు దారితీస్తున్నాయి. కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నాయి. ప్రేమ కారణంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రియుడు దక్కలేదనో, ప్రేయసి దూరమైందనో క్షణికావేశంతో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే కొందరు ప్రేమికుల ధైర్యం చేసి తమ ప్రేమను గెలిపించుకుంటున్నారు. ఈక్రమంలో ఆంధ్రప్రదేశ్ లో ఓ ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించింది. ప్రేమ వివాహం చేసుకున్న తమకు రక్షణ కల్పించమని పోలీసులను కోరింది.

లవ్ మ్యారేజ్ చేసుకున్న తమను చంపేస్తామంటూ తల్లిదండ్రులు బెదిరిస్తున్నారని కాపాడండి ప్లీజ్ అంటూ కోరుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ కు చెందిన సరిద భూమిక శ్రీ, హరిప్రసాద్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కాగా భూమిక శ్రీ వయసు 19 సంవత్సరాలు. ఈమె ప్రస్తుతం ఎంబీబీఎస్ చదువుతోంది. హరిప్రసాద్ ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. అయితే వీరిద్దరు పెళ్లితో ఒక్కటవ్వాలనుకున్నారు. భూమిక శ్రీ, హరిప్రసాద్ ప్రేమ, పెళ్లి చేసుకోవాలనుకుంటున్న విషయాన్ని ఇంట్లో చెప్పకుండా గోప్యంగా ఉంచారు. తల్లిదండ్రులు ఒప్పుకోరని తెలిసి రహస్యంగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఎందుకంటే గతంలోనే వీరి ప్రేమ వ్యవహారం తెలిసి హరిప్రసాద్ పై కేసులు పెట్టినట్లు తెలిపారు. ఈ గొడవల కారణంగా ఇంట్లో వారికి ప్రేమ పెళ్లి చేసుకుంటామని చెబితే అంగీకరించరని ప్రేమ పెళ్లికి సిద్దమయ్యారు. ఈ క్రమంలో ఏలూరుకు చేరుకుని అక్కడ బహుజన సేన ట్రస్ట్ లో వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి అక్టోబర్ 29న జరిగింది. లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఈ జంట షిరిడీకి వెళ్లిపోయింది. కాగా వీరి మ్యారేజ్ విషయం ఇరు కుటుంబాల్లో తెలిసిపోయింది. ప్రేమ పెళ్లి ఇష్టం లేని తల్లిదండ్రులు వారిని చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు.

ఈ క్రమంలో తమకు రక్షణ కల్పించమని ప్రేమికులు పోలీసులను వేడుకున్నారు. జిల్లా ఎస్పీని కలిసి ప్రొటెక్షన్ కల్పించాలని కోరారు. తల్లిదండ్రుల నుంచి తమకు ప్రాణ హాని ఉందని తమను కాపాడండి అంటూ పోలీసులను మొరపెట్టుకుంటున్నారు. దీంతో ఎస్పీ ఆ ప్రేమ జంటకు ప్రొటెక్షన్ కల్పిస్తామని చెప్పినట్లు భూమిక శ్రీ తెలిపింది. మరి లవ్ మ్యారేజ్ చేసుకుని మాకు రక్షణ కల్పించండి అంటూ వేడుకుంటున్న ఈ జంటపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom