P Krishna
Sri Sathya Sai District: ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాలు పచ్చని కాపురంలో చిచ్చు పెడుతున్నాయి. పెళ్లి తర్వాత పార్టనర్‌ను కాదని పక్క చూపులు చూస్తున్నారు. దీంతో దాంపత్య జీవితాల్లో గొడవలు, కొట్లాటలు చివరికి హత్యల వరకు వెళ్తున్నాయి.,
Sri Sathya Sai District: ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాలు పచ్చని కాపురంలో చిచ్చు పెడుతున్నాయి. పెళ్లి తర్వాత పార్టనర్‌ను కాదని పక్క చూపులు చూస్తున్నారు. దీంతో దాంపత్య జీవితాల్లో గొడవలు, కొట్లాటలు చివరికి హత్యల వరకు వెళ్తున్నాయి.,
P Krishna
భారత దేశంలో ఏ మతంలో అయినా వివాహ బంధానికి ఎంతో విలువనిస్తారు. కానీ ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు తీవ్ర విషాదాలకు దారితీస్తున్నాయి. దారుణ హత్యలకు కారణం అవుతున్నాయి. వివాహేతర సంబంధాలకు అడ్డుగా ఉంటున్నారని భార్యభర్తలను ఒకరినొకరు చంపుకుంటున్న ఘటనలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి. హ్యాపీగా సాగిపోతున్న దాంపత్య జీవితాల్లో అక్రమ సంబంధాలు చిచ్చుపెడుతున్నాయి. భాగస్వాములకు వివాహేతర సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో హత్యలు చేసుకుంటున్నారు. వారిలో ఎక్కువ మంది 18-35 ఏళ్లకు చెందిన వారే ఉంటున్నారని పోలీసులు చెబుతున్నారు. తాజాగా వివాహేతర సంబంధం ఓ మహిళ ప్రాణాలు తీసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఏపీలో దారుణం చోటు చేసుకుంది. మూడు ముళ్ల బంధాన్ని కాదనుకొని పరాయి మగాడి మోజులో పడింది. అతనితో శారీరక సంబంధం పెట్టుకొని భర్తను వంచించింది. తాను వెళ్తున్న మార్గం సరైనది కాదని తెలిసినా ఆ వ్యక్తిని వదల్లేదు. చివరికి ఆ అక్రమ సంబంధం ఆ మహిళకు శాపంగా మారి చనిపోయింది. భర్త ఇద్దరు పిల్లలతో హ్యాపీగా ఉన్న జీవితాన్ని వదులుకొని పరాయి మగాడితో సంతోషంగా ఉంటానుకుంది. కానీ, వివాహేతర సంబంధాలు ఎప్పటికైనా బెడిసి కొడతాయని ఆమె ఊహించలేకపోయింది. సత్యసాయి జిల్లాలో ఓ వివాహితను ఆమె ప్రియుడు హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. బోబులదేవర చెరువు మండలం కొండకమర్ల లో మెహతాజ్ (32) భర్త, ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవిస్తుంది. ఇటీవల ఆమెకు ఇర్ఫాన్ (28) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే మెహతాజ్ తో ఓ వ్యక్తి సన్నిహితంగా ఉండటం ఇర్ఫాన్ చూసి తట్టుకోలేకపోయాడు. తనని కాదని మరో వ్యక్తి మోజులో పడిపోతావా అంటూ ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 31న రాత్రి మెహతాజ్ ఇంటికి వెళ్లిన ఇర్ఫాన్ ఆమె గొంతునులిపి హత్య చేసి పారిపోయాడు. ఈ విషయం గురించి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు పోలీసులు. మృతదేహాన్ని పరిశీలించారు. తన కూతురుని ఇర్ఫాన్ హత్య చేసినట్లు మెహతాజ్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే పోలీసులు ఇర్ఫాన్ పై కేసు నమోదు చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ మధ్యనే మెహతాజ్ తన పుట్టింటికి వచ్చింది. మెహతాజ్ పుట్టింటికి వచ్చిన విషయం తెలుసుకున్న ఇర్ఫాన్ వాళ్ల ఇంటికి వెళ్లాడు. నీతో మాట్లాడాలని మెహతాజ్ ని ఫోన్ చేసి మేడపైకి పిలిచాడు. అక్కడే ఇద్దరి మద్య తీవ్ర వాగ్వాదం జరగడం, కోపంతో ఇర్ఫాన్ ఆమె గొంతు నులిమి చంపేశాడు. తర్వాత ఆమె ఇంట్లో పడుకోబెట్టి తల్లిదండ్రులకు సమాచారం అందించి అక్కడ నుంచి పారిపోయినట్లు ప్రాథమిక సమాచారం. ఈ క్రమంలోనే ఇర్పాన్ పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసలు. క్షణిక సుఖం కోసం పచ్చని సంసారాల్లో చిచ్చు పెట్టుకుంటూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. లేనిపోని మోహాల్లో పడి తమ పిల్లల జీవితాలతో పాటు తమ జీవితాలను కూడా నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనల వల్ల కుటుంబ వ్యవస్థ రోజు రోజుకీ కలుషితం అవుతుందని పలు నివేదికలు చెబుతున్నాయి.