iDreamPost
android-app
ios-app

తీరం దాటిన వాయుగుండం.. ముందుకు దూసుకొచ్చిన సముద్రం!

  • Published Oct 17, 2024 | 11:14 AM Updated Updated Oct 17, 2024 | 12:07 PM

Heavy Rain Alert To AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గత మూడు రోజుల నుంచి ఏపీ, తమిళనాడు, కర్ణాటకలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్సాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్ని జలమయమ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాకాసి అలలతో సముద్రం ముందుకు వచ్చింది.

Heavy Rain Alert To AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గత మూడు రోజుల నుంచి ఏపీ, తమిళనాడు, కర్ణాటకలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్సాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్ని జలమయమ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాకాసి అలలతో సముద్రం ముందుకు వచ్చింది.

  • Published Oct 17, 2024 | 11:14 AMUpdated Oct 17, 2024 | 12:07 PM
తీరం దాటిన వాయుగుండం.. ముందుకు దూసుకొచ్చిన సముద్రం!

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గురువారం తెల్లవారుజామున నెల్లూరు జిల్లాలోని తడ వద్ద 22 కిలోమీటర్ల వేగంతో తీరం దాటింది. ఇది క్రమంగా అల్పపీడనంగా మారి బలహీనపడుతుందని ఐఎండీ శాఖ హెచ్చరించింది. కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవులో సముద్రంలో అల్లకల్లోంగా మారింది. అర్థరాత్రి భీకర అలలతో ONGC టెర్మినల్ దగ్గరకు దూసుకు వచ్చిన సముద్రం. సముద్రపు అలలు టెర్మినల్ గోడలను తాకుతున్నాయి. దీంతో ఓఎన్‌జీసీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం భీకరంగా అలలు ఎగసిపడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

త మూడు రోజులుగా దక్షిణాది రాష్ట్రాలను వాయుగుండం దడపుట్టిస్తుంది. విశాఖ, కాకినాడ తీరాల్లో సముద్రపు అలల ఉద్దృతి పెరిగిపోయింది.కాకినాడ జిల్లాలోని ఉప్పాడ తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. రాకాసి అలలు ఎగసిపడుతున్నాయి.. అలల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు, ఇళ్ల నేరకూలాయి. అంతర్వేది తీరంలో సముంద్రం అల్లకల్లోంగా మారిపోయింది. పల్లిపాలెంలో ఇళ్ళు, బీచ్ రోడ్డును అలలు ముంచెత్తాయి.  విశాఖ, గంగవరం పోర్టుల్లో మొదటి ప్రమాద హెచ్చరిక, నిజాంపట్నం, కృష్ణ పట్నం పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ. విశాఖ సముద్రం 150 అడుగులు ముందుకు దూసుకు వచ్చిందని అధికారులు తెలిపారు. గడిచిన ఆరు గంటల్లో వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షాల కారణంగా తిరుపతి, చిత్తూరు, ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున సూళ్లకు సెలవు ప్రకటించారు. తీర ప్రాంతాల్లో పరిస్థితి ప్రమాదంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవొద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

ఇప్పటికే అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతూనే ఉన్నాయి. తిరుమల ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని.. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని ఏపీ విపత్తుల సంస్థ హెచ్చరించింది. ప్రజలు అప్పమత్తంగా ఉండాలని కోరారు. తుపాను ప్రభావంతో ఉప్పాడ వద్ద రాకాసి అలలు మత్స్యకారుల ఇళ్లల్లోకి చొచ్చుకు వస్తున్నాయి. ఇళ్లల్లోకి వరద నీరు రావడంతో తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు మత్స్యకారులు. చాలా ఏళ్ల తర్వాత ఇలాంటి పరిస్తితిని చూస్తున్నామని అంటున్నారు.

ఇదిలా ఉంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం తమిళనాడు లోని చెన్నై, కాంచీపురం, చెంగల్ పట్టు తో పాటు మొత్తం పది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కన్యాకుమారి, తిరునల్వేలి, తుత్తుకూడి జిల్లాలతో పాటు కోయంబత్తూరు, తిరుప్పూర్ జిల్లాల్లో నేడు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇక కర్ణాటకలో సైతం భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. వర్షాల కారణంగా బెంగుళూరులో పలు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. దీంతో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.