iDreamPost
android-app
ios-app

విశాఖలో ఘోరం.. లా స్టూడెంట్ పై నలుగురు యువకులు..

  • Published Nov 19, 2024 | 5:22 PM Updated Updated Nov 19, 2024 | 5:22 PM

ఆంధ్రప్రదేశ్ లో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. లా స్టూడెంట్ పై నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగుచూసింది.

ఆంధ్రప్రదేశ్ లో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. లా స్టూడెంట్ పై నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగుచూసింది.

  • Published Nov 19, 2024 | 5:22 PMUpdated Nov 19, 2024 | 5:22 PM
విశాఖలో ఘోరం.. లా స్టూడెంట్ పై నలుగురు యువకులు..

కామాంధుల ఆకృత్యాలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి. చిన్న పిల్లల నుంచి వృద్దుల వరకు ఎవరినీ వదలడం లేదు. పశువుల్లా మారి లైంగిక వాంఛలను తీర్చుకుంటున్నారు. పసిపిల్లలను చిదిమేస్తున్నారు. రోజుకో ఘోరం మహిళలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. బయటికి వెళితే మళ్లీ సేఫ్ గా తిరిగి వస్తామో లేదో అని వణికిపోతున్నారు. బస్టాండుల్లో, కాలేజీల్లో, పని ప్రదేశాల్లో మహిళలను వేధింపులకు గురిచేస్తున్నారు. కామంతో కళ్లుమూసుకుపోయి కామంధులు రెచ్చిపోతున్నారు. ఇంటి నుంచి వెళ్లిన వారు తిరిగి వచ్చేంత వరకు కుటుంబ సభ్యుల్లో టెన్షన్ ఉంటుంది. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని భయపడిపోతుంటారు.

దేశ వ్యాప్తంగా జరుగుతున్న అత్యాచారాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో మరో ఘోరం వెలుగు చూసింది. విశాఖపట్నంలో లా స్టూడెంట్ పై గ్యాంగ్ రేప్ కలకలం సృష్టించింది. లా విద్యార్థినిపై నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. అన్యాయాలకు గురవుతున్న వారికి న్యాయం చేయాలని న్యాయ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరగడం కలకలం రేపుతోంది. అత్యాచారానికి పాల్పడడమే కాకుండా ఆ దృష్యాలను సెల్ ఫోన్లలో చిత్రీకరించి బెదిరింపులకు పాల్పడ్డారు. ఆ వీడియోలను అడ్డుపెట్టుకుని ఆ యువతిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇక వారి వేధింపులు తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించింది బాధిత యువతి.

దీంతో ఈ దారుణం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు మధురవాడలోని NVP లా కాలేజీలో లా థర్డ్‌ ఇయర్‌ చదువుతోంది. ఈ క్రమంలో ఆమె సహచరి విద్యార్థి అయిన వంశీతో స్నేహం చేసింది. ఆస్నేహం కాస్త ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలో వంశీ ఆ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఈ ఏడాది ఆగస్టు 10వ తేదీన కంబాలకొండకు తీసుకుని వెళ్లాడు. అక్కడే విద్యార్థిని పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇక, మళ్లీ అదే నెల 13వ తేదీన డాబాగార్డెన్ లో ఉంటున్న తన ఫ్రెండ్‌ ఆనంద్‌ ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత వంశీ స్నేహితులు ఆనంద్‌, రాజేష్‌, జగదీష్‌ కూడా అక్కడికి వచ్చి ఒకరితర్వాత ఒకరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

అంతటితో ఆగకుండా సెల్ ఫోన్లలో ఆ దృశ్యాలను బందించి మరోసారి అఘాయిత్యానికి పాల్పడ్డారు. 2 నెలల తర్వాత ఆ వీడియోలను అడ్డంపెట్టుకుని ఆనంద్‌, రాజేష్‌, జగదీష్‌.. బాధితురాలికి ఫోన్‌ చేసి వేధించడం మొదలుపెట్టారు. ఈ విషయాన్ని వంశీ దృష్టికి తీసుకెళ్లగా వారి కోరిక తీర్చాలంటూ మానసికంగా వేధించాడు. వారి వేధింపులు తాళలేక లా స్టూడెంట్ ఈ నెల 18వ తేదీన ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మాహత్యాయత్నం చేసింది. గమనించిన బాధితురాలి తండ్రి అడ్డుకుని కూతురును నిలదీయగా తనపై జరిగిన ఘోరాన్ని చెప్పింది. వెంటనే విశాఖ టూ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. మరి లా స్టూడెంట్ పై జరిగిన ఘోరంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş