iDreamPost
android-app
ios-app

దూసుకొస్తున్న దానా తుపాన్‌.. ఆ జిల్లాలపై తీవ్ర ప్రభావం!

  • Published Oct 24, 2024 | 11:33 AM Updated Updated Oct 24, 2024 | 11:33 AM

Dana Cyclone: దానా తుఫాన్ ప్రభావంతో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు మద్య బంగాళాఖాతంలో ఏర్పడి ఈ తుఫాన్ వల్ల ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది ఐఎండీ.

Dana Cyclone: దానా తుఫాన్ ప్రభావంతో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు మద్య బంగాళాఖాతంలో ఏర్పడి ఈ తుఫాన్ వల్ల ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది ఐఎండీ.

  • Published Oct 24, 2024 | 11:33 AMUpdated Oct 24, 2024 | 11:33 AM
దూసుకొస్తున్న దానా తుపాన్‌.. ఆ జిల్లాలపై తీవ్ర ప్రభావం!

గత రెండు నెలల క్రితం ఏపీలో భారీ వర్షాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేశాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో దానా తుఫాన్ మరోసారి కలవరపెడుతుంది. తూర్పు మద్య బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలను భయపడిపోతున్నారు. గురువారం అర్ధరాత్రి లేదా శుక్రవారం తెల్లవారుజామున ఒడిశాలోని పూరి, పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపానికి మధ్యలో బిత్తర్‌కనిక, ధమ్రా (ఒడిశా)కు సమీపంలో దాపా తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

దానా తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయంటున్నారు. దాదాపు 36 గంటల తీవ్ర తుఫాన్ గా కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దానా తుఫాన్ ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్ లోని కొన్ని జిల్లాల్లో 21 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. తీరం వెంట దానా తుఫాన్ దూసుకు వస్తుంది. దానా తుఫాన్ ప్రభావం ఏపీలో పలు జిల్లాలపై ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహన సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. తుఫాన్ ప్రభావంతో ఉత్తరాంధ్రలో వాతావరణం మేఘావృతమై ఉండి పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తుఫాన్ కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉందని, మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లో వేటకు వెళ్లవొద్దని హెచ్చరించింది.భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణపట్నం, నిజాంపట్నం, మచిలీపట్టణం, కాకినాడ, గంగవరం, విశాఖపట్టణం, కళింగపట్టణం పోర్టుకు రెండో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీచేశారు. ఇప్పటికే అప్రమత్తమైన ప్రభుత్వం వెంటనే అధికార యంత్రాంగం, రెస్క్యూ టీమ్‌ని రంగంలోకి దింపింది.

దానా తుఫాన్ ప్రభావంతో గురువారం (అక్టోబర్ 24) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, చిత్తూరు, విశాఖ, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో గురువారం రాత్రి వరకు 80-100 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అన్నారు. ఈదురుగాలుల కారణంగా భారీ వృక్షాలు, చెట్లు, కరెంటు స్థంబాలు, హోర్డింగ్స్‌ కూలే అవకాశం ఉందని.. వాటికి దూరంగా ఉండాలని అన్నారు. ప్రజలు బయటకు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ హెచ్చరించారు. ఇదిలా ఉంటే.. దానా తుఫాన్ ప్రభావం భారీగా ఉంటుందన్న విషయం తెలిసి ఇచ్చాపురం, పలాస, ఉద్దానం సహా పరిసర గ్రామాల్లో ప్రజలు భయంతో వణికిపోతున్నారు.గతంలో జరిగిన అనుభవాల దృష్యా దానా తుఫాన్ ఏ మేరకు నష్టం కలిగిస్తుందో అని టెన్షన్‌లో పడిపోయారు. దానా తుఫాన్ ప్రభావంతో పలు రైళ్లు, విమానాలు రద్దు చేశారు.