P Venkatesh
దారి దోపిడీల నుంచి ఆన్ లైన్ మోసాలకు మారిపోయింది కాలం. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక పరిచయాలు పెంచుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఆ తర్వాత డబ్బులు కాజేసి ముఖం చాటేస్తున్నారు.
దారి దోపిడీల నుంచి ఆన్ లైన్ మోసాలకు మారిపోయింది కాలం. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక పరిచయాలు పెంచుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఆ తర్వాత డబ్బులు కాజేసి ముఖం చాటేస్తున్నారు.
P Venkatesh
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక కొత్త రకం మోసాలు వెలుగుచూస్తున్నాయి. ఫేక్ లింక్స్, మెసేజ్ లు, కాల్స్ తో వంచిస్తూ సైబర్ క్రిమినల్స్ మోసాలకు తెగబడుతున్నారు. సైబర్ నేరగాళ్లు పంపే లింక్స్ క్లిక్ చేయగానే ఖాతాలు లూటీ చేస్తున్నారు. ఈజీ మనీకి అలవాటు పడి మోసాలకు పాల్పడుతున్నారు. అధిక డబ్బు ఆశ చూపి లక్షల్లో దండుకుంటున్నారు. ఇప్పటికే చాలామంది ఇలాంటి మోసాలకు గురై లక్షలు, కోట్ల రూపాయలను పోగొట్టుకున్నారు. చదువు లేని వారితో పాటు, చదువుకున్న వారు కూడా మోసపోతున్నారు. ఇన్ స్టా, ఫేస్ బుక్ ద్వారా పరిచయాలు పెంచుకుని డబ్బులు దండుకుంటున్నారు. ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి వలపు వల విసిరి ఖాతాలో సొమ్మును కాజేస్తున్నారు.
మోసానికి గురవుతున్నామన్న విషయం తెలిసే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోతున్నది. ఇదే విధంగా ఓ యువకుడు మోసపోయాడు. ఓ యువతి అన్నా అంటూనే అతడి నుంచి ఏకంగా కోటి 20 లక్షలు కాజేసింది. కోటీశ్వరుడైన అతడిని అడుక్కునేలా చేసింది. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పత్తికొండ మండలం చక్రాలలో లావణ్య అనే యువతి ఫేస్ బుక్ లో తన చెల్లి ప్రియాంక ఫోటోతో అకౌంట్ క్రియేట్ చేసింది. ఆ ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా హైదరాబాద్‌కు చెందిన సాయిలుతో పరిచయం పెంచుకుంది. ఆ తర్వాత కొంతకాలం చాటింగ్, కాల్స్ తో మరింత నమ్మకం కలిగించింది లావణ్య. ప్రియాంక మాట్లాడుతున్నట్టు సాయిలుతో మాట్లాడిన లావణ్య.. అతనికి వివిధ కారణాలు చెబుతూ డబ్బులు వసూలుచేసింది.
ఫేస్ బుక్ పరిచయంతోనే ఏకంగా రూ. కోటి 20 లక్షలు సాయిలు నుంచి లావణ్య వసూలు చేసింది. ఆ తర్వాత లావణ్య సాయిలును దూరం పెడుతూ వచ్చింది. దీంతో మోసపోయానని గ్రహించిన సాయిలు పత్తికొండ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించాడు. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను కోరాడు. ఈ కేసు దర్యాప్తులో ఉండగానే లావణ్య ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. బాధితుడు సాయిలును బెదిరించేందుకే లావణ్య ఆత్మహత్యాయత్నం చేసిందని స్థానికులు చెబుతున్నారు.
మోసాలకు గురై సర్వం కోల్పోతున్నారని.. ఆ తర్వాత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పోలీసులు వెల్లడిస్తున్నారు. సోషల్ మీడియా కారణంగా ఇలాంటి దారుణాలు ఎన్నో జరుగుతున్నాయని జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. సోషల్ మీడియా మోసాల పట్ల అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొందరి అజాగ్రత్త వల్ల ఇలాంటి మోసాలకు గురవుతున్నారని తెలిపారు. మరి చెల్లిపేరుతో ఫేస్ బుక్ ఖాతా తెరిచి యువకుడి నుంచి కోటి 20 లక్షలు కాజేసిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.