రాజమౌళి సినిమాలన్నీ చందమామ కథలలాంటి సాదాసీదా కామిక్ బుక్ ఇతివృత్తాలతో తీసినవే. వాటిలో మణిరత్నం, సుకుమార్ సినిమాలలోలాగా ఇంటలెక్చువల్ టచ్ గానీ, శంకర్, కొరటాల శివ సినిమాలలోలాగా సమాజానికి ఒక మంచి సందేశం ఇచ్చేవిగాగానీ ఉండవు. ఆ మాటకొస్తే గొప్ప జీనియస్ టింజ్ ఏమీ రాజమౌళి సినిమాలలో కనపడదు. మరి గ్లోబల్ లెవల్ డైరెక్టర్ ఎలా అయ్యాడు! అతని సక్సెస్‌కు కారణం అతని సినిమాలలో ఉండే భారీతనం అని, బలమైన ఎమోషన్స్ అని, హీరోను తలదన్నేలా ఉండే […]
ఒక మనిషి గొప్ప వాడైతే లాభం లేదు. దానికి అదనంగా ఆస్తులుండాలి, వారసత్వం వుండాలి. కాంతారావు గొప్పవాడే. ఆస్తులు లేవు. హీరోలుగా రంగంలో ఉన్న వారసులు లేరు. మార్చి 22 వర్ధంతి. ఎవరైనా ఆయన గురించి నాలుగు మంచి మాటలు రాస్తారేమో అని పత్రికలు వెతికాను. కనపడలేదు. అన్నీ చదవలేను, చూడలేను. కాబట్టి ఆయన్ని గుర్తు చేసుకున్న వాళ్లెవరైనా వుంటే అది వాళ్ల సంస్కారం, గొప్పతనం. కాంతారావు 400 సినిమాల్లో నటించాడు. ఎక్కువగా జానపదాలు. కత్తియుద్ధాల వీరుడు. […]
మార్చి 20, శోభన్‌బాబు వర్ధంతి. ఆయన విచిత్రమైన నటుడు. గొప్పగా నటించిన సినిమా ఒకటి కూడా గుర్తు లేదు. చెత్తగా చేసిన సినిమా కూడా గుర్తు లేదు. నేనెప్పుడూ ఆయన అభిమాని కాదు. కానీ ప్రతి సినిమా చూశాను. ఊహ తెలిసేసరికి NTR, ANR మాత్రమే హీరోలు. కృష్ణ, శోభన్‌లు చిన్న సినిమాలు చేస్తూ పెద్ద హీరోలకి తమ్ముళ్లుగా నటించేవాళ్లు. మొదటిసారి శోభన్ పేరు విన్నది మనుషులు మారాలి సినిమాతో. దాంట్లో … హీరో. కానీ శోభన్ […]
కుముద్‌బెన్ జోషి చనిపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి 1985-90 మధ్య గవర్నర్‌గా చేశారు. తెలుగు పత్రికలు కూడా చిన్నవార్త తప్ప, ఎక్కువ రాయలేదు. చాలా గట్టి మహిళ. కాంగ్రెస్ ఏజెంటని అప్పటి సీఎం NT రామారావు విమర్శించినా లెక్క చేసేది కాదు. ఆమెని దగ్గరగా చూసే అవకాశం ఒకసారి వచ్చింది. 1986లో వరదలు. SK యూనివర్సిటీ NSS విద్యార్థిగా భద్రాచలం సమీపంలోని చింతూరుకి వెళ్లాను. మొత్తం వంద మంది. హైస్కూల్లో బస. బురదతో నిండిపోయిన ఇళ్లను శుభ్రపరచడం పని. […]
వ్యాయామశాలలో లేదా క్రీడల సమయంలో వ్యాయామం చేసిన తర్వాత లేదా వాకింగు లేదా జాగింగుకు వెళ్ళినపుడు గుండె సంబంధిత సమస్యలు లేదా గుండెపోటుతో అకస్మాత్తుగా చనిపోవడం ముఖ్యంగా యువ మరియు మధ్య వయస్కులలో ఈ మధ్యలో సర్వసాధారణం అవుతున్నాయి. ఇందుకు గుండెపోటు మాత్రమే కారణం అనుకుంటే పప్పులో కాలేసినట్లే! అమెరికాలో ప్రతి సంవత్సరం 3,25,000 మంది ఇలా చనిపోతారు… ఇందుకు చాలా కారణాలు గుండె సంబంధించిన వాటిలో ఉన్నాయి… 1. గుర్తించబడని కొరోనరీ ఆర్టరీ జబ్బులు.. గుండె […]
రాయలసీమ గురించి కడప గురించి కడప ప్రాంతం గురించి ఇక్కడ ప్రజల గురించి సోము వీర్రాజు గారు ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలు దుర్మార్గమైనవి. దానిని ఏ ప్రాంత ప్రజలు కూడా హర్షించరు. రాయలసీమ మరియు కడప ప్రాంత ప్రజల గురించి అవమానంగా మాట్లాడడం తగదు. ఇది వరకు సినిమావాళ్ళు రాయలసీమ ప్రాంతాన్ని రాయలసీమ యాసను, రాయలసీమ జీవితాన్ని వక్రీకరించి ఇతర ప్రాంత ప్రజలకు రాయలసీమ అంటే కేవలం కక్షలు, కార్పణ్యాలు, బాంబులు వంటి విషసంస్కృతిని […]
మొదటిసారిగా, U.S. సర్జన్లు జన్యుపరంగా మార్పు చెందిన పంది గుండెను మానవ రోగికి మార్పిడి చేశారు. సాధారణంగా చక్కెర అనేది మార్పు చేసే పంది గుండెలో ఉంటే రిజెక్టు అవతావుంది అని కనుగొన్నారు,,తరవాత మేరీల్యాండ్ సర్జన్లు దాని కణాలలో చక్కెరను తొలగించడానికి జన్యు-సవరణకు గురైన పంది నుండి గుండెను తొలగించి ఉపయోగించారు, ఇలా చక్కెరను మార్పుచేయడం-అవయవ తిరస్కరణను ఆపుతుంది అని కనుగొని ప్రయోగం చేసారు.. వైద్య పరీక్షలో, వైద్యులు అతని ప్రాణాలను కాపాడే చివరి ప్రయత్నంలో రోగికి […]
దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియంట్ కోవిడ్ ని గుర్తించిన 19 రోజుల తర్వాత ఈ వేరియంట్ యొక్క లక్షణాలు కొన్ని తెలిసొచ్చాయి. ఆ దేశంలో డిసెంబర్ 12న రికార్డు స్థాయిలో 37 వేల మంది కోవిడ్ బారిన పడ్డారు. కాగా 15 మంది చనిపోయారు. ఈ ఏడాది జనవరి 19న అత్యధికంగా 819 మంది చనిపోయారు. ప్రస్తుతం ప్రతి యాభై ఐదు గంటలకు ఒమిక్రాన్ వేరియంట్ కోవిడ్ సోకుతున్న వారి సంఖ్య రెట్టింపు అవుతున్నది. కాగా గ్రేట్ బ్రిటన్ […]
కార్తిక ప్రభాతం. ఇప్పుడే శ్రీశైలేశుని దర్శనం చేసుకుని వచ్చాను. నల్లమల గిరిసానువులంతటా శారద ప్రాతః కాంతి. ఎవరో పసిడి కరిగించి శ్రీపర్వతాన్ని అభిషేకిస్తున్నారు. నా మనసులో ఆగీ ఆగీ నా మిత్రుడి తలపులు కదలాడుతూ ఉన్నాయి. ‘ఆ చిలక నువ్వే కావాలి, ఆ రాచిలుక నువ్వే కావాలి’ అంటున్నాడు నా మరొక మిత్రుడు కవితా ప్రసాద్ గగనపు విరితోటలోకి సీతారామశాస్త్రిని స్వాగతిస్తూ. సీతారామ శాస్త్రి అన్నిటికన్నా ముందు శివకవి. తన యవ్వనకాలంలో గంగావతరణాన్ని రాసినప్పటినుండి, తను కైలాసగామి […]
కాలం విసిరే గడ్డు సమస్యలకు ధీటైన కొత్త జవాబులు – కోవిడ్ చికిత్సలో కొత్త ప్రోటోకాల్ తో మెరుగైన ఫలితాలు 2019 డిసెంబర్ నుండి ప్రపంచాన్ని కుదిపేస్తున్న కోవిడ్ జబ్బుకి వివిధ అనేక చికిత్సలను వైద్యులు ప్రయత్నిస్తున్నారు. కొరోనావైరస్ ఇప్పటికే 25 కోట్ల మందికి సోకి 50 లక్షల మంది ప్రాణాలను తీసింది. అయితే కోవిడ్ జబ్బుకు కారణమైన కొరోనావైరస్ ఎక్కువమందిలో ఏమాత్రం ఇబ్బంది పెట్టని (ఎసింటమేటిక్) లేదా కొద్దిపాటి నలత (మైల్డ్)ను మాత్రమే కలుగజేస్తుంది. తీవ్రమైన […]