విరాట్ కోహ్లీ.. భారత్ క్రికెట్ జట్టుకు దొరికన అరుదైన ఆణిముత్యం. క్రికెట్ ప్రపంచంలో సచిన్ టెండూల్కర్ తరువాత అంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన వ్యక్తి. సచిన్ సృష్టించిన భారీ పరుగులు… సెంచరీల రికార్డులను తిరిగి రాస్తాడని సగటు క్రికెట్ అభిమానులు.. విశ్లేషకులు ఘంటాపథంగా చెప్పుకునే వారు. తన ప్రతిభాపాటవాలు.. బ్యాటింగ్ విన్యాసాలతో అభిమానులను అలరించిన కోహ్లీ.. సినీ హీరోయిన్లతో డేటింగ్లు చేస్తూ మైదానం బయట కూడా నిత్యం వార్తలలో నిలిచేవాడు. అయితే ఇప్పుడు అదే కోహ్లీ టెస్ట్.. […]
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రీడాకారుల వేలం మొదలైంది. శని, ఆదివారం రెండు రోజుల పాటు ఈ వేలం జరుగుతోంది. బెంగుళూరు కేంద్రంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి రెండు రోజులు పాటు జరిగే ఈ వేలంలో పది జట్లు క్రీడాకారులను కొనుగోలు చేయనుంది. ఇప్పుటికే అగ్రశ్రేణి క్రీడాకారులను ఆయా జట్లు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. 27 మంది ఆటగాళ్లను ఎనిమిది ప్రాంఛైజీలు సొంతం చేసుకోగా మిగిలిన 590 మంది క్రీడాకారులను కొనుగోలు చేసేందుకు ఈ […]
నిండా మూడు పదుల వయస్సు లేని యువకునిపై మోయలేని భారం మోపుతోంది తెలుగుదేశం పార్టీ. అమలాపురం పార్లమెంట్ ఇన్చార్జిగా దివంగత లోక్‌సభ స్పీకర్ జి.ఎం.సి.బాలయోగి కుమారుడు జి.హరీష్ మాధుర్‌ను నియమించి పార్టీ చేతులు దులుపుకుంది. గత ఎన్నికల ముందు పార్టీలో చేరిన మాధుర్‌కు అమలాపురం ఎంపీ సీటు ఇచ్చిన సమయంలోనూ… ఎన్నికల తరువాత పార్టీ ఇన్చార్జిగా నియమించి తరువాత కూడా పార్టీ చేతులు దులుపుకుందే తప్ప అతనికి దన్నుగా నిలవలేదు. కాని పార్టీని నడిపించేందుకు అవసరమైన యంత్రాంగాన్ని […]
వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. మూడు వన్డేలు గెలిచి తన ఆధిక్యతను చాటుకుంది. ఇక్కడ నరేంద్ర మోడీ స్టేడియంలో శుక్రవారం జరిగిన మూడవ వన్డేలో అన్నిరంగాల్లోను భారత్ ఆధిపత్యం చెలాయించింది. భారత్ స్టార్ బ్యాట్స్మెన్లు కెప్టెన్ రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ లు తక్కువ స్కోర్ లకే పెవిలియన్‌కు చేరినా శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్‌లు భారీ స్కోర్లు చేయగా, తరువాత సుందర్, ఛహర్లు రాణించడంతో భారత్ […]
రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా… ఆది దేవునిగా పేరొందిన అంతర్వేది శ్రీ లక్ష్మీ నర్శింహస్వామి కళ్యాణం శుక్రవారం జరగనుంది. ఆది దేవుడు అంతర్వేది నర్శింహస్వామి కళ్యాణ గడియలు దగ్గర పడుతున్నాయి. శ్రీదేవి భూదేవి సమేత నర్శింహస్వామి కళ్యాణం ఈ రోజు అర్థరాత్రి 12.35 గంటలకు మృగశిర నక్షిత్రయుక్త వృశ్చికలగ్న పుష్కరాంశంలో శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో స్వామివారి కళ్యాణం జరిపించనున్నారు. ఇప్పటికే అంతర్వేది కళ్యాణోత్సవాలు ఆరంభమయ్యాయి. గడిచిన నాలుగు రోజులుగా అంతర్వేదిలో ఆరంభమైన కళ్యాణోత్సవాల్లో ఆధ్యాత్మికశోభ పరిఢవిల్లుతోంది. ఉత్సవాల్లో […]
చారిత్రాత్మక 1000 వన్డేను భారత్ కైవసం చేసుకుంది. ఒకనాటి పసికూన ప్రపంచంలోనే అత్యధిక వన్డేలు అడిన జట్టుగా ఘనత సాధించింది. ప్రతిష్టాత్మక ఈ వన్డేలో వెస్టిండీస్‌పై సునాయాసంగా విజయం సాధించింది. అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ జట్టు ఆరు వికెట్ల తేడాతో గెలుపు సాధించింది. 177 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన భారత్ కేవలం 28 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి విజేతగా నిలిచింది. 1000 వ వన్డేకు నాయకత్వం […]
కోనసీమ రైల్వేలైన్‌కు కేంద్రం భారీగా నిధులు కేటాయించింది. నిర్మాలా సీతారామన్ మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో దీనికి రూ.358 కోట్ల నిధులు కేటాయించారు. దీనితో ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుకు కేంద్రం రూ.2 వేల 16 కోట్లు కేటాయించినట్టయ్యింది. నిర్మలమ్మ బడ్జెట్ కేటాయింపులు పూర్తయిన తరువాత రైల్వేశాఖ ప్రాజెక్టుల వారీగా నిధులు కేటాయించింది. కోటిపల్లి నుంచి నర్సాపురం వరకు నిర్మిస్తున్న రైల్వే లైన్‌కు కేంద్రం రూ. 358 కోట్లు కేటాయించినట్టు దక్షణ మధ్య రైల్వే నుంచి స్థానిక ప్రజాప్రతినిధులకు […]
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కాపులను బీసీలో చేర్చాలని చంద్రబాబు పాలనా కాలంలో ఉవ్వెత్తున ఎగిసిపడిన కాపు ఉద్యమం… ఉద్యమ నాయకత్వం వహించిన మాజీమంత్రి ముద్రగడ పద్మనాభాన్ని… అతని కుటుంబాన్ని… ఉద్యమకారులను వేేేధింపులకు గురి చేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఉద్యమాన్ని అణచివేసే క్రమంలో పెట్టిన అక్రమ కేసులు అన్నీఇన్నీకావు. వై.ఎస్.జగన్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రెండు విడతలుగా నాటి చంద్రబాబు పెట్టిన కేసులు ఉపసంహరించుకోవడం ఆ వర్గీయుల్లో సంతోషాన్ని నింపింది. ఇదే సమయంలో ఉద్యమం పట్ల […]
రాజోలులో రాజకీయం రగులుతోంది. మాజీమంత్రి, టీడీపీ నేత గొల్లపల్లి సూర్యారావు, ప్రస్తుత ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ల మధ్య సాగుతున్న దూషణల పర్వం సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. సంక్రాంతి పండుగ నాడు మొదలైన విమర్శలు.. ప్రతివిమర్శలు కాస్తా.. వ్యక్తిగత దూషణల వరకు వెళుతున్నాయి. కోడిపందేలు పండుగ మూడు రోజులతో ముగిసినా వీరిద్దరూ మాత్రం పందెం పుంజుల్లా ఇప్పటికీ తలపడుతూనే ఉన్నారు. గొల్లపల్లి సూర్యారావుకు కోనసీమ రాజకీయాల్లో ఒక గుర్తింపు ఉంది. అల్లవరం నుంచి ఆయన 1985, […]
భారతీయ రైల్వే వేగాన్ని పెంచే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. దేశంలోని అత్యంత వేగంగా పరుగులు తీస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను వచ్చే మూడేళ్లలో ఏకంగా 400లకు పైగా తీసుకువచ్చేలా కేంద్రం చర్యలు తీసుకుంటుంది. శక్తి ప్రాజెక్టు మూడవ దశలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లకు పెద్దపీట వేస్తున్నట్టు దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. కొత్త బడ్జెట్లో రైల్వే విభాగంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఈ ఎక్స్‌ప్రెస్ […]