జర్నలిజం కష్టకాలాల్లో 2005లో 1000 రూపాయల కోసం నేను ఉగాది కవి అవతారం ఎత్తాను. నేను కవి కాదని నాకు తెలుసు. దూరదర్శన్ వాళ్లకి తెలియదు. టీవీలో కవిత చదవాలంటే కవి కానక్కర్లేదు. అసలు తెలుగు రాకపోయినా ఫర్వాలేదు. దూరదర్శన్‌లో ఓ మిత్రుడు వుండేవాడు. ఆయనకి కథలు రాయడం రాదు. అది ఆయనకి తెలియదు. తెలుగు అక్షరాలంటే ఆయనకి ప్రేమ. అవన్నీ అవిభక్త కవలల్లా కలిసిపోయి వుండేవి. ఉపాయం అని రాస్తే ఉ అనేది మాత్రమే కనిపిస్తూ […]
చిన్నప్పుడు లెక్కల్లో బాగా భయపెట్టిన వాళ్లలో పైథాగరస్ ఒకడు. లంబకోణ త్రిభుజం అని ఏదో సూత్రం. ప్రతి పదానికి వేరే చిత్రాన్ని ఊహించుకునే అలవాటు. లంబ అంటే హిందీలో పొడవు, కోన అంటే అడవి లేదా వాగు. త్రిభుజం అంటే మూడు భుజాలు. పొడవైన వాగుకి మూడు భుజాలతో ఒక ఆకారం వుంటే? మనిషికి రెండు చేతులు కాకుండా 3 చేతులు వుంటే 3 భుజాలుంటాయి. త్రిభుజుడు , ఇది బాగుంది. రామాయణంలో కబంధుడు అనే రాక్షసుడికి […]
ప్లేటో, సోక్రటీసు శిష్యుడు. గురువుని అన్యాయంగా చంపేసిన తరువాత దేశం వదిలి వెళ్లాడు. ఎక్కడెక్కడో తిరిగి మళ్లీ ఏథెన్స్ చేరి అకాడమీ స్థాపించాడు. రాజకీయాల్లోకి తెలివైన వాళ్లు, మేధావులు వస్తేనే దేశం బాగుపడుతుందని నమ్మాడు. 2400 ఏళ్ల తర్వాత కూడా ఇది జరగలేదు. తెలివైన వాళ్లు ప్రభుత్వంలో ఉండకపోతే మూర్ఖులు తెలివైన వాళ్లని పాలిస్తారని చెప్పాడు. ప్రపంచమంతా ఇదే జరుగుతోంది. ప్లేటో ఏం చెప్పాడంటే… 1.నిజం మాట్లాడేవాన్ని ప్రపంచమంతా ద్వేషిస్తుంది రెండురెళ్లు నాలుగు అంటే గుండ్రాళ్లు విసురుతారని […]
సోక్రటీస్, చిన్నప్పటి నుంచి విన్న పేరు. 2500 ఏళ్ల క్రితం నాలుగు మంచిమాటలు చెప్పినందుకు విషం తాగించి చంపేశారు. మంచి చెబితే మరణాన్ని రిటర్న్ గిప్ట్గా ఇవ్వడం మానవజాతి స్వభావం. క్రీస్తు దగ్గర నుంచి గాంధీ వరకూ ఎవర్నీ వదల్లేదు. సోక్రటీస్ పైన ఆరోపణలు ఏమంటే , బోధనల ద్వారా యువకుల్ని చెడగొడుతున్నాడని, మతానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని. ప్రజాస్వామ్యంలో, అదీ డిజిటల్ యుగంలో , రెండున్నర వేల తర్వాత కూడా మతం గురించి మాట్లాడితే వెంటపడి వేధిస్తుంటే […]
బజాజ్ ఒక పేరు కాదు. ఒకప్పుడు లక్షల మంది యువకుల కల. 1970 నాటికి నగరాల్లో తప్ప స్కూటర్లు చిన్న వూళ్లలో లేవు. ధనికులకే తప్ప మామూలు వాళ్లకి అందుబాటులో లేని కాలం. మోపెడ్ కూడా చాలా తక్కువ మందికే ఉండేది. 80 తర్వాత హీరో మెజిస్టిక్ , లూనాలు వచ్చి ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో కొంత మందికి చేరువయ్యాయి. స్కూటర్ అంటే వెస్పానే అనుకునే రోజుల్లో బజాజ్ వచ్చింది. కుర్రాళ్లకి క్రేజ్, కొత్త దంపతులు బజాజ్‌లో తిరిగితే […]
రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే పాటిల్ వేణుగోపాల్‌రెడ్డి వెళ్లిపోయారు. 35 ఏళ్లకు పైగా రాయదుర్గం రాజకీయాలపై ముద్ర వేశారు. నా ఏడెనిమిదేళ్ల వయసులో చూసిన మొదటి నాయకుడు NC. శేషాద్రి తెల్లటి బట్టల్లో గంభీరంగా ఉండేవాడు. గుర్రం బండిలో తిరిగే వాడు. 1972లో గొల్లంపల్లి తిప్పేస్వామి ఎమ్మెల్యే. ఆయనకు చదువు రాదు. కానీ జనం మనిషి. గుండెపోటుతో చనిపోతే ఉప ఎన్నిక వచ్చింది. పయ్యావుల వెంకటనారాయణ గెలిచారు. రాయదుర్గం బజారుల్లో వందలాది ఆవు దూడలతో ఊరేగింపు జరిగింది (అప్పటి […]
చాలా ఏళ్ల క్రితం పెనుగొండ దగ్గర బంధువు చనిపోతే దినాలకు వెళ్లాం. ఆ రోజు రంజాన్. ఆ వూళ్లో ఉన్న ముస్లింలు ఈద్గాకు వెళ్లి నమాజ్ చేసి , తిరిగి వస్తూ మాతో పాటు భోజనం చేశారు. సంవత్సరానికి రెండు పండుగలు. ఇంట్లో తినాలని అనుకోలేదు. చనిపోయిన తమ ఊరి పెద్దాయనకి వాళ్లు చూపిన మర్యాద అది. ఆ సమయంలో బొంబాయిలో అల్లర్లు జరుగుతున్నాయి. ఒకసారి గుంతకల్లు సమీపంలో పెళ్లికివెళితే ఇదే విధంగా ఆ ఊరు ముస్లింలు […]
ఇప్పటి స్కూళ్లని చూస్తే నాకెందుకో కోళ్ల ఫారాలు గుర్తుకొస్తాయి. వైవిధ్యం వుండదు. గవర్నమెంట్ స్కూళ్లలో పేద పిల్లలు, నారాయణ, చైతన్యలో మధ్య తరగతి , ఢిల్లీ పబ్లిక్‌లో డబ్బున్న వాళ్లు. స్కూల్లోనే వర్గీకరణ జరిగిపోయింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో లండన్‌లోని పిల్లలందరిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మురికివాడల పిల్లలు , ధనవంతుల పిల్లలు ఇద్దరూ ఒకేచోట వున్నారు. ఒకర్ని చూసి ఒకరు ఆశ్చర్యపోయారట! ఇంత పేద పిల్లలు ఉంటారని వాళ్లకి , డబ్బున్న వాళ్ల పిల్లల […]
1960-70 మధ్య పుట్టిన జనరేషన్ చాలా విచిత్రాలు చూసింది. అన్ని తరాలు మంచిచెడు చూస్తాయి కానీ, టెక్నాలజీలో పురాతన కాలం నుంచి డిజిటల్ విప్లవం వరకూ చూసిన తరం మాది. అందని ద్రాక్షగా , ఒక కలగా ఉన్న సినిమాని అరచేతిలో చూస్తామని ఎప్పుడూ ఊహించలేదు. థియేటర్ యజమాని అంటే ఒక స్టేటస్ సింబల్, ఇప్పుడు అదే థియేటర్ గుదిబండ. థియేటర్ పరిసరాల్లో ఫిలిం ముక్కలు ఏరుకుని సంతోషించేవాళ్లం. ఇప్పుడు ఫిలిం లేని కాలం. నటులు మేకప్ […]
బుజ్జాయి వెళ్లిపోయారు. వయసు మీద పడింది. బొమ్మలన్నీ పసిపాపలే. అవి చిరంజీవులే. దేవులపల్లి కృష్ణశాస్త్రికి రెండే వ్యసనాలు. ఒకటి కవిత్వం, రెండు కన్నకొడుకు. కొడుకుని వదిలి వుండలేని ఆ తండ్రి, పసివాడిని స్కూల్‌కి కూడా పంపకుండా వెంటపెట్టుకుని తిరిగాడు. సంచారమే విద్యాభ్యాసమని అపుడు ఆ ఇద్దరికీ తెలియదు. బుజ్జాయిని అక్షరాల కంటే రంగులు ఆకర్షించాయి. భారతదేశ కామిక్స్‌కి మూల పురుషుడయ్యాడు. కృష్ణశాస్త్రి కొడుకుగా కీర్తి కోరుకోలేదు. ‘నేను–నాన్న’ పుస్తకాన్ని అద్భుతంగా రాశాడు. చదువుతుంటే కళ్లు తడుస్తుంటాయి. గొప్ప […]